
చెన్నై: ఐడీబీఐ బ్యాంక్‌లో వేతన సవరణ చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా డిసెంబర్ 27న భారత్ బ్యాంకింగ్ సమ్మె బాట పడుతోంది. బ్యాంకింగ్‌లో రెండు ప్రధాన యూనియన్లు– ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) శుక్రవారం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘‘ఐడీబీఐలో వేతన సవరణ అంశాన్ని ఆ బ్యాంక్ మేనేజ్‌మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకువెళుతున్నాం.
అయితే తుది నిర్ణయం లేకుండా సమస్య పరిష్కారం కాలాతీతం అవుతోంది’’ అని సంయుక్త ప్రకటన తెలిపింది. డిసెంబర్ 27 సమ్మెకు మద్దతుఇవ్వాలని బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) కూడా నిర్ణయించినట్లు వివరించింది. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణ అంశం 2012 నవంబర్ నుంచీ పెండింగులో ఉంది. ఈ సమస్యపై అక్టోబర్‌లో ఆ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె కూడా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment