ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్/డీటీహెచ్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్,ఫిక్స్‌డ్ /రికరింగ్ డిపాజిట్లు వివరాలు తదితర సేవలును పొందవచ్చు. వినియోగదారులతో 24 గంటలూ అనుసంధానమై ఉండటానికి ఈ అప్లికేషన్ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐడీబీఐ బ్యాంక్ సీఎండీ ఎం.ఎస్.రాఘవన్ అన్నారు.
దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సేవలను ఎక్కడి నుంచైనా పొంద వచ్చని చెప్పారు.