Mobile banking application
-
మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్!
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు 'ఇండస్ఇండ్' (IndusInd) 'ఇండీ' (INDIE) పేరుతో ఓ కొత్త యాప్ పరిచయం చేసింది. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీని ఉపయోగమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ పరిచయం చేసిన ఈ కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన డిజిటల్ అనుభవం పొందవచ్చు. బ్యాంక్ డిజిటల్ స్ట్రాటజీ 2.0ని వేగవంతం చేసే దిశగా INDIE ప్రారంభమైంది. ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ బ్యాంకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఇండీ మొబైల్ యాప్ గురించి తెలుసుకోవలసిన అంశాలు.. ఇండీ యాప్ అనేది కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టదు, కావున వినియోగదారుడు తన అవసరానికి కావాల్సిన మొత్తంలో లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ ఆధారంగా వడ్డీ కూడా ఉంటుంది. ఈ యాప్ అత్యంత పారదర్శకమైన రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది, కస్టమర్లు టాప్ ఈ కామర్స్ బ్రాండ్ల నుంచి తమకు ఇష్టమైన బ్రాండ్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇండీ యాప్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ అందించే అన్ని సర్వీసులను పొందవచ్చు. అకౌంట్ నెంబర్ ఎంచుకోవడం, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సర్వీసులను పొందవచ్చు. కస్టమర్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లను సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. కావున కస్టమర్ల వద్ద సేవింగ్స్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్‌తో చెల్లించవచ్చు. ఈ యాప్ చాలా సెక్యూరిటీ అందిస్తుంది. దీని ద్వారా నంబర్‌లెస్ డెబిట్ కార్డ్‌లు పొందవచ్చు. -
ఫేస్ ఐడీతో కొటక్ మహీంద్రా బ్యాంక్ సేవలు
ముంబై: ప్రైవేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌కు కొత్త ఫీచర్లను జోడించింది. ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీలతో లాగిన్ కావొచ్చని తెలియజేసింది. అయితే ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్లలోనే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. ‘బ్యాంక్ కస్టమర్లు వారి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లోకి మొబైల్ పిన్ (ఎం–పిన్) సాయం లేకుండానే బయోమెట్రిక్ అథంటికేషన్‌తో లాగిన్ అవ్వొచ్చు. అలాగే ఎం–పిన్ అవసరం లేకుండా యాప్‌లోని చాలా సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. మరీముఖ్యంగా అన్ని రకాల నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను నిర్వహించుకోవచ్చు. అయితే ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు మాత్రం ఎం–పిన్ తప్పనిసరి’ అని కొటక్ మహీంద్రా బ్యాంక్ వివరించింది. -
ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్/డీటీహెచ్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్,ఫిక్స్డ్ /రికరింగ్ డిపాజిట్లు వివరాలు తదితర సేవలును పొందవచ్చు. వినియోగదారులతో 24 గంటలూ అనుసంధానమై ఉండటానికి ఈ అప్లికేషన్ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐడీబీఐ బ్యాంక్ సీఎండీ ఎం.ఎస్.రాఘవన్ అన్నారు. దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సేవలను ఎక్కడి నుంచైనా పొంద వచ్చని చెప్పారు.