భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు 'ఇండస్‌ఇండ్' (IndusInd) 'ఇండీ' (INDIE) పేరుతో ఓ కొత్త యాప్ పరిచయం చేసింది. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీని ఉపయోగమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ పరిచయం చేసిన ఈ కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన డిజిటల్ అనుభవం పొందవచ్చు. బ్యాంక్ డిజిటల్ స్ట్రాటజీ 2.0ని వేగవంతం చేసే దిశగా INDIE ప్రారంభమైంది. ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ బ్యాంకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ
ఇండీ మొబైల్ యాప్ గురించి తెలుసుకోవలసిన అంశాలు..
- ఇండీ యాప్ అనేది కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టదు, కావున వినియోగదారుడు తన అవసరానికి కావాల్సిన మొత్తంలో లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ ఆధారంగా వడ్డీ కూడా ఉంటుంది.
- ఈ యాప్ అత్యంత పారదర్శకమైన రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది, కస్టమర్లు టాప్ ఈ కామర్స్ బ్రాండ్ల నుంచి తమకు ఇష్టమైన బ్రాండ్‌లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
- ఇండీ యాప్ ద్వారా ఇండస్‌ఇండ్ బ్యాంక్ అందించే అన్ని సర్వీసులను పొందవచ్చు. అకౌంట్ నెంబర్ ఎంచుకోవడం, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సర్వీసులను పొందవచ్చు.
- కస్టమర్‌లు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. కావున కస్టమర్‌ల వద్ద సేవింగ్స్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో చెల్లించవచ్చు. ఈ యాప్ చాలా సెక్యూరిటీ అందిస్తుంది. దీని ద్వారా నంబర్‌లెస్ డెబిట్ కార్డ్‌లు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment