
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ షేర్ల కోసం ఎల్‌ఐసీ ఓపెన్ ఆఫర్ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నది. ఓపెన్ ఆఫర్‌లో భాగంగా ఒక్కొక్క ఐడీబీఐ బ్యాంక్ షేర్‌ను రూ.61.73 ధరకు ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నదని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ డిసెంబర్14న ముగుస్తుంది.
ఓపెన్ ఆఫర్‌లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 204, 15, 12, 929 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఎల్‌ఐసీ ఈ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 14.90 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment