సాక్షి,ముంబై: ప్రైవేట్ బ్యాంకు ఐడీబీఐ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. "అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ" ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడు రోజుల నుంచి ఐదేళ్ల కాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఇందులో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.65 శాతం వడ్డీని అందించ నుంది. దీంతోపాటు సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీని చెల్లిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు)
బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం,రెండుకోట్లరూపాయల లోపు డిపాజిట్లపై కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లో ఉన్నాయి. బ్యాంక్ ప్రస్తుతం సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం నుండి 6.75 శాతం వరకు , మిగిలినవారికి 3-6.25 శాతం వడ్డీ రేటును వర్తింప చేస్తుంది. (స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్)
ఆరు నెలలు, ఒక రోజు నుండి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల (444 రోజులు కాకుండా) మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వరుసగా 5.5 శాతం, 6.75 శాతం వడ్డీని పొందవచ్చు.. ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్లకు 6.75 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. (మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?)
Comments
Please login to add a commentAdd a comment