ఐడీబీఐకి బ్యాడ్ లోన్ల బెడద
Published Thu, May 18 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ గత ఏడాది క్యూ4 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం విడుదల చేసిన జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాల్లో భారీగా నష్టపోయింది. ముఖ్యంగా తమ లోన్లలో అయిదుశాతం బాడ్ లోన్లుగా మారినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో క్యూ4లో బ్యాంకు నికర నష్టం 84శాతం ఎగిసి రూ. 3,200 కోట్లగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,736 కోట్లగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 14 శాతం పెరిగి రూ. 1633 కోట్లను తాకింది.
స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 15.6 శాతం నుంచి 21.25 శాతానికి ఎగశాయి. ఐడిబిఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 27 శాతం పెరిగి రూ. 44,753 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఐడీబీఐ బ్యాంకు మొత్తం అభివృద్ధిలో నికర అసంతృప్త ఆస్తులు భారీగా పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో 9.61 శాతంతో పోలిస్తే 13.21 శాతం పెరిగాయి. నికర ప్రొవిజన్లు రూ. 4450 కోట్ల నుంచి రూ. 6209 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 9శాతానికిపైగా పతనమైంది. గత మూడు నెలల్లో నిఫ్టి బ్యాంక్లో 12 శాతం లాభంతో పోలిస్తే ఐడిబిఐ బ్యాంకు షేర్లు 13 శాతం పడిపోయాయి.
Advertisement