
ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీతో డీల్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. రుణ సంక్షోభంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ 51 శాతం వాటా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా తమ సంస్థలో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకునేందుకు, యాజమాన్య అధికారాలు వదులుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐడీబీఐ బ్యాంకు తెలిపింది. ఈ డీల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ/ఈక్విటీ ఓపెన్ ఆఫర్ రూపంలో ఉంటుందని పేర్కొంది. లావాదేవీ అనంతరం ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా మారుతుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి 7.98% వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment