
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో 51% వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశిస్తున్న ఎల్‌ఐసీ... ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో 51% వాటా కొనుగోలు కోసం బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్‌డీఏఐ ఇటీవలనే ఎల్‌ఐసీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం కూడా పొందిన తర్వాత ఓపెన్ ఆఫర్‌కు అనుమతించాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీని ఎల్‌ఐసీ కోరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టేకోవర్ కోడ్ నిబంధన ప్రకారం, 25 శాతం, అంతకు మించిన వాటా కొనుగోలు చేస్తే, ఆ తర్వాత తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంకులో వాటా వద్దు.. ఎల్‌ఐసీ యూనియన్ల వ్యతిరేకత
కాగా, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరిస్తూ... ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్‌ఐసీ క్లాస్–1 అధికారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎల్‌ఐసీ చైర్మన్‌కు లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment