పీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు | PFC, NTPC Dun & Bradstreet Corporate Award | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు

Published Sat, Jul 25 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

పీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు

పీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు

ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) ప్రతిష్టాత్మక కార్పొరేట్ అవార్డులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ)లు  అందుకున్నాయి.  గురువారం రాత్రి న్యూఢిల్లీలో డీఅండ్‌బీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ ‘ఇండియా టాప్ పీఎస్‌యూ అవార్డు-2015’ను పీఎఫ్‌సీ తరఫున ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్ నాగరాజన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీ రవి సంయుక్తంగా అందుకున్నారు.

ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేందర్ మోహన్ మల్లా అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఎన్‌టీపీసీకి లభించిన ఇండియా టాప్ పీఎస్‌యూ-2015 అవార్డును ఐడీబీఐ ఆర్‌ఎం మల్లా, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియూ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.గంగూలీ చేతుల మీదుగా ఎన్‌టీపీసీ డెరైక్టర్(ఆపరేషన్స్) కేకే.శర్మ అవార్డును అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement