
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్ ఆఫర్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గలఒక్కో ఐడీబీఐ బ్యాంక్ షేర్‌ను రూ.61.73 ధరకు 26 శాతం వాటాకు సమానమైన 204 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ఐసీ పేర్కొంది. ఈ మొత్తం ఓపెన్ ఆఫర్ రూ.12,602 కోట్లని పేర్కొంది.
కాగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఎల్‌ఐసీకి షేర్లు జారీ చేస ప్రతిపాదనకు ఐడీబీఐ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీకి మార్గం సుగమం అవుతుంది. మరోవైపు బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.8,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనకు కూడా ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది.