ఈ బ్యాంక్ నుంచి 584 మందికి రుణాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ బల్లా రాజేశ్ మాట్లాడుతూ సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల్లో రుణాలు ఇస్తున్నారనే ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ టీమ్‌తో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అక్రమంగా రుణాలు పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ఐఓబీలో భారీ కుంభకోణం
Published Fri, Jul 28 2017 3:05 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM
నకిలీ పాస్ పుస్తకాలతో రూ.కోట్లు స్వాహా..
సత్తుపల్లి: నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రూ.కోట్లల్లో అక్రమ రుణాలు మంజూరు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రెవెన్యూ, పోలీస్ బృందం గురువారం తనిఖీలు చేపట్టారు. దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన రైతుల పేరిట నకిలీ పాస్ పుస్తకాలతో రూ. కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. ఆయా మండలాలకు చెందిన 200లకుపైగా పాస్ పుస్తకాలను తనిఖీ చేస్తే.. సగానికిపైగా నకిలీగా తేలినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.

Advertisement
Advertisement