సిండికేట్, సిటీ, ఐఓబీ..ఎంసీఎల్‌ఆర్‌ కోత | Syndicate Bank lowers MCLR rates | Sakshi
Sakshi News home page

సిండికేట్, సిటీ, ఐఓబీ..ఎంసీఎల్‌ఆర్‌ కోత

Published Sat, Jan 7 2017 1:31 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM

సిండికేట్, సిటీ, ఐఓబీ..ఎంసీఎల్‌ఆర్‌ కోత - Sakshi

సిండికేట్, సిటీ, ఐఓబీ..ఎంసీఎల్‌ఆర్‌ కోత

న్యూఢిల్లీ: మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారిత రుణ రేటును తగ్గిస్తున్న బ్యాంకుల జాబితాలో శుక్రవారం  సిండికేట్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)తోపాటు సిటీ ఇండియా చేరింది. ఆయా బ్యాంకులు 1% వరకూ రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి.

వివరాలు...
సిండికేట్‌ బ్యాంక్‌...: సిండికేట్‌ బ్యాంక్‌ ఏడాది కాలపరిమితి రుణరేటును 0.7% తగ్గించింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి చేరింది. గృహ రుణాలపై వడీరేటు తగ్గిస్తున్నట్లు కూడా బ్యాంక్‌ ప్రకటించింది. 0.7 శాతం తగ్గింపుతో 8.80 శాతం నుంచి 9.50 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.

ఐఓబీ...: ఏడాది రేటును శనివారం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా 8.65 శాతానికి తగ్గించింది.

సిటీబ్యాంక్‌...: గృహ రుణ రేటును 0.7 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.50 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గుతుంది. తాజా రేట్లు 9వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయని పేర్కొంది.

కోటక్‌ బ్యాంక్‌ బేస్‌ రేట్‌ తగ్గింపు: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ బేస్‌ రేటును 0.10% తగ్గించింది. బేస్‌రేట్‌ను 9.40% నుంచి 9.30 శాతానికి(ఏడాదికి)తగ్గిస్తున్నామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement