NCLR
-
సిండికేట్, సిటీ, ఐఓబీ..ఎంసీఎల్ఆర్ కోత
న్యూఢిల్లీ: మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును తగ్గిస్తున్న బ్యాంకుల జాబితాలో శుక్రవారం సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)తోపాటు సిటీ ఇండియా చేరింది. ఆయా బ్యాంకులు 1% వరకూ రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. వివరాలు... సిండికేట్ బ్యాంక్...: సిండికేట్ బ్యాంక్ ఏడాది కాలపరిమితి రుణరేటును 0.7% తగ్గించింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి చేరింది. గృహ రుణాలపై వడీరేటు తగ్గిస్తున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. 0.7 శాతం తగ్గింపుతో 8.80 శాతం నుంచి 9.50 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఐఓబీ...: ఏడాది రేటును శనివారం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా 8.65 శాతానికి తగ్గించింది. సిటీబ్యాంక్...: గృహ రుణ రేటును 0.7 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.50 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గుతుంది. తాజా రేట్లు 9వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయని పేర్కొంది. కోటక్ బ్యాంక్ బేస్ రేట్ తగ్గింపు: కోటక్ మహీంద్రా బ్యాంక్ బేస్ రేటును 0.10% తగ్గించింది. బేస్‌రేట్‌ను 9.40% నుంచి 9.30 శాతానికి(ఏడాదికి)తగ్గిస్తున్నామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. -
వడ్డీ రేట్లు తగ్గించినా మార్జిన్లు పదిలం
• బ్యాంకులకు మొండి బాకీల కష్టాలూ తగ్గొచ్చు • ఎంసీఎల్ఆర్ కోతపై జెఫ్రీస్ నివేదిక ముంబై: భారీ స్థాయిలో డిపాజిట్లు వెల్లువెత్తిన నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినా కూడా వాటి మార్జిన్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. పైగా సమస్యలతో సతమతమవుతున్న కార్పొరేట్లు.. వడ్డీ భారం తగ్గుదల కారణంగా మళ్లీ రుణాలను తిరిగి చెల్లించడం మొదలుపెట్టడం వల్ల బ్యాంకుల మొండి బకాయిల కష్టాలు కూడా కొంత తీరతాయని వివరించింది. ’ఎస్బీఐ సారథ్యంలో బ్యాంకులు 30–90 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ను తగ్గించినా బ్యాంకుల మార్జిన్లు పెద్దగా తగ్గకపోవచ్చు. స్వల్పకాలికంగా ఒకటి లేదా రెండు త్రైమాసికాల్లో ఈ కోతల ద్వారా నికర వడ్డీ మార్జిన్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా స్వల్పంగానే ఉండొచ్చు’ అని జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. రేట్లు గానీ తగ్గితే కార్పొరేట్ల లాభదాయకత కొంత మెరుగుపడటం వల్ల రుణాల తిరిగి చెల్లింపునకు వాటికి కాస్త వెసులుబాటు లభించి, బ్యాంకుల మొండిబకాయిల భారం కాస్తయినా తగ్గగలదని వివరించింది. మొత్తం బ్యాంకు రుణాల్లో 56 శాతం, మొత్తం నికర మొండిబకాయిల్లో 88 శాతం వాటా పెద్దఎత్తున రుణాలు తీసుకున్న సంస్థలదే ఉంది. ఎంసీఎల్ఆర్ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ చాలా మటుకు బ్యాంకులు 60–90 బీపీఎస్‌ల మేర శ్రేణిని పాటిస్తున్నందున.. తాజాగా రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు రూపంలో.. చౌక వడ్డీ రేట్ల ప్రయోజనాలను అవి ఖాతాదారులకు బదలాయించే అవకాశం ఉందని జెఫ్రీస్ పేర్కొంది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాల రేటును (ఎంసీఎల్ఆర్) గరిష్టంగా 90 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దాదాపు రూ. 1.65 లక్షల కోట్ల మేర కాసా (కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు) డిపాజిట్ల సమీకరించిన ఎస్బీఐ .. ఇప్పటికే బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ మొదలైనవి కూడా అదే బాటలో ఎంసీఎల్ఆర్ తగ్గించాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రతికూలం..: నిధుల అవసరాలకు ఎక్కువగా హోల్‌సేల్/బాండ్ల మార్కెట్‌పై ఆధారపడిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు(ఎన్బీఎఫ్సీ) రేట్ల కోత పరిణామం ప్రతికూలమని నివేదిక పేర్కొంది. డీమోనిటైజేషన్ అనంతరం ట్రిపుల్ ఎ రేటింగ్ ఉన్న ఒక్క సంవత్సర వ్యవధి బాండ్లపై రాబడులు 15 బీపీఎస్‌లు మాత్రమే తగ్గగా.. ఏడాది వ్యవధి బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లు 60–90 బీపీఎస్ మేర తగ్గడంతో వ్యాపార పరిమాణం ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకులవైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించింది. -
రేటు తగ్గింపు వరుసలో మరో రెండు బ్యాంకులు
ఓబీసీ, యూబీఐల ప్రకటన న్యూఢిల్లీ: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిలిచాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు తమ ఎంసీఎల్ఆర్ ఆధారిత రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. వేర్వేరుగా చూస్తే.. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) కొన్ని మెచ్యూరిటీలకు సంబంధించి రేటును 0.15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆరు నెలల రుణ రేటు 0.10 శాతం తగ్గి 9.30 శాతానికి చేరింది. అక్టోబర్ 10 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తాయని వివరించింది. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) వివిధ మెచ్యూరిటీలపై ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం తగ్గించింది. అక్టోబర్ 17 నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని వివరించింది. దీని ప్రకారం వార్షిక రుణ రేటు 9.45 శాతం నుంచి 9.40 శాతానికి తగ్గుతుంది. ఆరు నెలల రుణ రేటు 9.40 శాతం నుంచి 9.35 శాతానికి పడింది. ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లు తగ్గించాయి.