
సాక్షి, న్యూఢిల్లీ : ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల వడ్డీరేటును పెంపునకు కేంద్ర సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ వార్షిక అంతర్గత రివ్యూలో భాగంగా ఈ వడ్డీరేటు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. 2018-19కు గాను వడ్డీమ రేటును 8.55 శాతంనుంచి పెంచేందుకు యోచిస్తోందట. దీంతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులు లబ్ధిపొందనున్నారు. జనవరి మాసాంతంలో జరిగే సెంట్రల్ బోర్డ్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న జారీ చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు ప్రభాకర్ బనసూర్ వడ్డీరేటు పెంపునకు ఎక్కువ అవకాశం ఉందంటూ ధృవీకరించారు. మరో సభ్యుడు వ్యాఖ్యానిస్తూమ వాస్తవానికి డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ వడ్డీరేటును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అకౌంట్ల ఆడిటింగ్ ఇంకా కొనసాగుతున్న కారణంగా ఆలస్యమైందన్నారు. కాగా 2017-18 ఏడాదికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ ఖాతాలపై వడ్డీరేటు 8.55శాతంగా ఉంది. ఇది అయిదేళ్ల కనిష్టం.
Comments
Please login to add a commentAdd a comment