
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీరేట్లను 0.20 శాతం వరకూ పెంచింది. రుణ మొత్తాలను బట్టి రుణాలపై వడ్డీరేట్లను 0.05 శాతం నుంచి 0.20 శాతం వరకూ పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఈ రేట్ల పెంపు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది.
మహిళలు తీసుకున్న రూ.30 లక్షల లోపు రుణాలపై రేట్లు ఇక నుంచి 8.40 శాతంగా ఉంటాయని, ఇతరులకు 8.45 శాతమని తెలిపింది. రూ.30–75 లక్షల మధ్య రుణాలకు మహిళలకైతే 8.55 శాతమని, ఇతరులకైతే 8.60 శాతమని పేర్కొంది. రూ.75 లక్షలు మించిన రుణాలకు మహిళలకు 8.65 శాతమని, ఇతరులకు 8.70 శాతమని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment