
వాషింగ్టన్: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పరపతి సమీక్షలో పావు శాతం (25బేసిస్‌పాయింట్లు) వడ్డీ రేటును పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.25-1.5 శాతానికి చేరాయి. దీంతో ఈ ఏడాది మూడోసారి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్లను పెంచింది. తక్కువ పన్నులతో వినియోగదారుల వ్యయం, వ్యాపార పెట్టుబడుల పెరుగుదలతో వచ్చే ఏడాదికి 2.5 శాతం వృద్ధిని అంచనా వేసింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిబాటన సాగుతోందనీ, ఈ క్రమంలో దేశ జీడీపీ 2.5 శాతం స్థాయిలో పురోగమించనుందని ఫెడ్ అభిప్రాయపడింది. ఇక ద్రవ్యోల్బణం మాత్రం 2 శాతం దిగువనే కదలనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ మరో రేటు పెంపునకు తగినంత బలంగా ఉందన్న ఫెడ్ చైర్‌పర్శన్ జానెట్ యెలెన్ ఏడాది మరింత అధికంగా రేట్ల పెంపు ఫెడ్ సంకేతాలిచ్చారు. అలాగే ఫిబ్రవరి 3 న తన పదవీ విరమణ ముందు తదుపరి అధ్యక్షుడు జెరోమ్ పావెల్‌కు మృదువైన పరివర్తనను అందించేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేశానని చెప్పారు.
మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అమెరికా పటిష్ట వృద్ధిని సాధించనుందన్న ఫెడ్ తాజా అంచనాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్ నివ్వనుందని మార్కెట్ పండితులు విశ్లేషించారు.