international banking
-
ఊగిసలాట కొనసాగుతుంది
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక బిల్లు సవరణ మార్కెట్లలో ఒడిదుడుకులకు ప్రధాన కారణమయ్యాయి. మార్కెట్ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్ సోల్డ్) ఉండటం వాస్తవం. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెరపైకి రావడంతో సెంటిమెంట్ బలపడలేకపోతుంది. అమ్మకాలు కొ నసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు నెలకొంటే ఎగువ స్థాయిలో 17,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గతవారంలో సెన్సెక్స్ 463 పాయింట్లు నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. ఇరుసూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలం పాటు 16,800–17,200 శ్రేణిలో ట్రేడవ్వొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. బ్యాంకింగ్ సంక్షోభం గత వారాంతాన జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ సంక్షోభ ఉదంతం తెరపైకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) ప్రీమి యం ఒక్కసారిగా పెరగడంతో ఈ బ్యాంక్ సైతం దివాలా బాట పటొచ్చని ఊహాగానాలు నెలకొన్నాయి. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రంగంలో జరిగే ప్రతి పరిణామాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ఐఐలు ఈ మార్చి 20–24 తేదీల మధ్య రూ.6,654 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఈ మార్చిలో సంస్థాగత ఇన్వెస్టర్లు మొతం్త రూ.9,430 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. -
పరిస్థితులు బాలేవు.. ఆర్థిక క్రమశిక్షణ అవసరం
న్యూఢిల్లీ: అమెరికాలో ఇటీవలి పరిణామాల తర్వాత ప్రపంచ అనిశ్చితి పెరుగుతోందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులు తమతమ ఆర్థిక, కార్పొరేట్, పొదుపు ఖాతా ప్రణాళికలో ’భద్రత మార్జిన్లను’ జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) జనవరిలో ఇచ్చిన అంచనాలు పాతవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన, గత వారంలో అమెరికాలో జరిగిన పరిణామాలు ఆర్థిక విశ్వాసం, బ్యాంకింగ్ రుణాల వృద్ధి, సంబంధిత సరఫరాల వ్యవస్థలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయం తాజాగా తేలాల్సి ఉందని అన్నారు. ప్రపంచ వృద్ధికి మరింత విఘాతంగా ఆయా పరిణామాలు కనిపిస్తున్నాయని అన్నారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితుల పై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ సెమినార్‌ను ఉద్దేశించి అనంత నాగేశ్వరన్ ప్రసంగిస్తూ.. ప్రపంచ, భారత్ ఎకానమీ అంశాలను చర్చించారు. ఆయ న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అనిశ్చితి పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. గత వారంలో కొన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావారణం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఆయా తీవ్ర పరిణామాలను దేశాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ► గత వారంలో జరిగిన పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపాల్సిన పరిస్థితిని, అవసరాన్ని సృష్టించింది. ఈ పరిస్థితుల్లో అమెరికాలో వడ్డీ రేట్ల పరిస్థితి ఏమిటి? డాలర్ల దారి ఎటు అన్న అంశంపై మీమాంస నెలకొంది. ► తాజా పరిణామాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి చిక్కులను కలిగిస్తాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. ఒక కోణంలో ఆయా దేశాలకు సంబంధించి కరెన్సీలపై ఒత్తిడి తగ్గుతుందని, ఇది సానుకూల అంశమని నేను విశ్వసిస్తున్నాను. వడ్డీరేట్ల పెంపుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కట్టుబడితే, ప్రపంచంలోని పలు దేశాలకు ఇది ఒక సవాలునే సృష్టిస్తుంది. ► ఈ తరుణంలో భారతదేశం వంటి దేశాలపై ఈ పరిణామాల ప్రభావాన్ని లెక్కించడం ప్రస్తుతం కొంత క్లిష్టమైన అంశమే. ఎగుమతుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తంగా క్లిష్ట ఆర్థిక పరిస్థితులను భారత్ తట్టుకోగలదని విశ్వసిస్తున్నాను. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధిస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రస్తుత పరిధులలో ఉష్ణోగ్రతలు భారత్‌లో కొనసాగితే, (ముందుగా విత్తడం వల్ల) గోధుమ పంటకు సంబంధించి మనం సానుకూల ఫలితాన్ని పొందుతాయి. ఈ అంశాలు చక్కటి పంట దిగుబడికి, ద్రవ్యోల్బణం కట్టడి కి, సరళతర ద్రవ్య పరపతి విధానాలకు తద్వా రా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ఆయా అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ కనీసం 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసం ఉంది. ► ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత్‌లో దాదా పు అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థితి కి చేరుకున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో వినియోగం వాటా కూడా పెరుగుతోంది. ► ప్రస్తుత అనిశ్చితి వాతావరణంలో 8–9 శాతం జీడీపీ వృద్ధిరేటు గురించి ఎక్కువగా ఆశాజనకంగా ఉండకూడదు. వచ్చే 7–8 సంవత్సరాలలో 6.4 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి సాధించగలిగినా అది మనం మంచి ఫలితం సాధించినట్లే. 2023–24లో 6 శాతం వృద్ధి: క్రిసిల్ భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతం వృద్ధిని సాధించవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేసింది. ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. పలు సంస్థల 6.5%–7% అంచనాలకన్నా క్రిసిల్ లెక్క మరింత తక్కువగా ఉండ డం గమనార్హం. కాగా, వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారత్ ఎకానమీ సగటున 6.8% వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న అంచనాలను క్రిసిల్ తన వార్షిక నివేదిక వెలువరించింది. ఈ సందర్భంగా క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి మాట్లాడుతూ, 2022–23లో ఆర్బీఐ రెపో రేటుకు ప్రాతిపదిక అయి న రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదవుతుందని అన్నా రు. అయితే ప్రధానంగా బేస్ ఎఫెక్ట్‌తోపాటు క్రూడ్, కమోడిటీ ధరల తగ్గుదల కారణంగా 2023– 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5%కి దిగివస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంచి రబీ దిగుబడి కూడా ద్రవ్యోల్బణం కట్టడికి దోహ దపడుతుందని అంచనావేశారు. 2023–24లో కార్పొరేట్ రంగం రెవెన్యూ వసూళ్లు రెండంకెల్లో ఉంటాయని కూడా జోషి అభిప్రాయపడ్డారు. మార్కెట్ల సంక్షోభాన్ని సులువుగా దాటేయగలం ► చౌక క్రూడాయిల్ దేశానికి సానుకూలం ► అంతర్జాతీయ అనిశ్చితిపై ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల సంక్షోభాన్ని భారత్ సులువుగా దాటేయగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. ముడి చమురు రేట్లు తగ్గడం, కరెంటు అకౌంటు లోటు తగ్గుతుండటం మొదలైనవి దేశానికి సానుకూలాంశాలని గురువారం ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం కొనసాగుతోంది. అదే సమయంలో, భారత్‌కు సంబంధించి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగా మారుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 2.5% లోపు ఉండవచ్చని అంచనాలు నెలకొన్నా యి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, మనం చెప్పేది చేసి, జాగ్రత్తగా వ్యవç ßæరిస్తే ఈ సంక్షోభం నుంచి సులువుగానే బైటపడవచ్చు‘ అని కొటక్ పేర్కొన్నారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటంతో మార్కె ట్లు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఆయ న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
Credit Suisse: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం!
సాక్షి, బిజినెస్ డెస్క్: దాదాపు పదిహేనేళ్ల క్రితం తరహాలో అంతర్జాతీయంగా మరో బ్యాంకింగ్ సంక్షోభం ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా, యూరప్‌వ్యాప్తంగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్యాంకులో మరింతగా ఇన్వెస్ట్ చేసేది లేదంటూ కీలక ఇన్వెస్టరు ప్రకటించడంతో క్రెడిట్ సూసీ షేర్లు బుధవారం 27 శాతం పతనమయ్యాయి. గత రెండేళ్లలో బ్యాంకు షేరు సుమారు 85 శాతం క్షీణించింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు 40 శాతం మేర ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. సమస్యలతో సతమతం.. వాస్తవానికి క్రెడిట్ సూసీ గత కొన్నాళ్లుగా సమస్యలతో సతమతమవుతూనే ఉంది. 2019లో సంస్థ సీవోవో పియరీ ఆలివర్ కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకున్నారు. అయితే సదరు డిటెక్టివ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఆలివర్ను క్రెడిట్ సూసీ తొలగించింది. ఇదంతా బ్యాంకు వ్యవహారంపై సందేహాలు రేకెత్తించింది. అటుపైన 2021లో ఆర్చిగోస్ క్యాపిటల్ అనే అమెరికన్ హెడ్జ్ ఫండ్ సంస్థ మూతబడటంతో దాదాపు 5 బిలియన్ డాలర్ల భారీ నష్టం మూటకట్టుకుంది. ఆ కంపెనీకి క్రెడిట్ సూసీ బ్రోకరేజి సర్వీసులు అందించేది. అటు పైన గ్రీన్‌సిల్ క్యాపిటల్ అనే మరో సంస్థ మూతబడటంతో.. దాని ప్రభావాల కారణంగా ఇన్వెస్టర్లు 3 బిలియన్ డాలర్ల దాకా నష్టపోయారు. గతేడాది ఫిబ్రవరిలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పైగా డిపాజిట్లు ఉన్న 30,000 మంది పైచిలుకు ఖాతాదారులపై మనీలాండరింగ్, అవినీతి తదితర ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ట మరింత మసకబారింది. దీంతో క్రమంగా డిపాజిట్ల విత్‌డ్రాయల్స్ మొదలయ్యాయి. 2019 నుంచి టాప్ లీడర్షిప్ ఇప్పటికి అనేక సార్లు మారింది. గతేడాది క్రెడిట్ సూసీ పెట్టుబడుల కోసం అన్వేషిస్తుండగా.. సౌదీ నేషనల్ బ్యాంక్ 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. సంస్థలో మరింతగా ఇన్వెస్ట్ చేసే యోచన లేదని సౌదీ నేషనల్ బ్యాంక్ చైర్మన్ అమ్మార్ అల్ ఖుదైరీ ప్రకటించడం తాజాగా క్రెడిట్ సూజీ షేర్ల పతనానికి దారి తీసింది. 2018లో 16 స్విస్ ఫ్రాంకులుగా ఉన్న షేరు ప్రస్తుతం 1.70 ఫ్రాంకులకు (ఒక స్విస్ ఫ్రాంక్ విలువ సుమారు రూ. 89). పడిపోయింది. మార్కెట్లలో ప్రకంపనలు.. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూతబడటం, తాజాగా క్రెడిట్ సూసీ పరిణామాలతో ఇతరత్రా బ్యాంకులపైనా ప్రభావం పడింది. బుధవారం పలు యూరోపియన్ బ్యాంకుల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరల్ 12 శాతం, బీఎన్పీ పారిబా 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్.. బ్రిటన్ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ మొదలైనవి సుమారు 8 శాతం పడిపోయాయి. రెండు ఫ్రెంచ్ బ్యాంకుల్లోనూ కొంత సమయం పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అటు అమెరికాలో బ్యాంకులూ అదే బాటలో పయనించాయి. ప్రధానంగా డిపాజిటర్లు ఎకాయెకిన డిపాజిట్లను వెనక్కి తీసుకునే రిస్కులు ఉన్న చిన్న, మధ్య రకం బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 17 శాతం, ఫిఫ్త్ థర్డ్ బ్యాంకార్ప్ 6 శాతం, జేపీమోర్గాన్ చేజ్ 4 శాతం పతనమయ్యాయి. -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
చేయి కలిపిన ఎస్బీఐ... కైక్సాబ్యాంక్
దేశంలో ‘వ్యాపార’ విస్తరణ లక్ష్యం న్యూఢిల్లీ: భారత్-స్పెయిన్ జాయింట్ వెంచర్లు (జేవీ), భారత్ సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడం లక్ష్యంగా భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), స్పెయిన్‌కు చెందిన కైక్సా బ్యాంకులు చేతులు కలిపాయి. సంయుక్తంగా రుణాలు అందించడం ప్రత్యేకించి బ్యాంక్స్ గ్యారెంటీ లావాదేవీల బిజినెస్ విస్తరణకు ఈ ఒప్పందం ద్వారా ప్రయత్నిస్తామని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సుజిత్ కుమార్ వర్మ, కైక్సా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బ్యాంకింగ్) విక్టోరియా మాటియాలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. సిండికేటెడ్ లోన్ బిజినెస్, గ్యారెంటీ లావాదేవీలు, నెట్వర్కింగ్ సేవలు, ట్రేడ్ ఫైనాన్స్, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఫైనాన్స్, ఇన్ఫ్రా ఫైనాన్స్ అంశాల్లో రెండు బ్యాంకులు పరస్పరం సహకరించుకుంటాయని ప్రకటన వెల్లడించింది. తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించుకోవడానికి రెండు బ్యాంకుల కస్టమర్లకూ ఈ ఒప్పందం దోహదపడుతుందనీ వివరించింది. కైక్సా బ్యాంక్ 2011లో న్యూఢిల్లీలో తన రిప్రజెంటేటివ్ ఆఫీస్‌ను ప్రారంభించింది. దక్షిణాసియా ప్రాంతంలో స్పెయిన్ కంపెనీల అభివృద్ధికి బ్యాంక్ తోడ్పాటును అందించడంతోపాటు, స్పెయిన్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహించే భారత కంపెనీలకు సైతం సహాయసహకారాలను అందిస్తోంది. -
ఎస్బీఐ నిధుల వేట!
♦ అప్రాధాన్య ఆస్తుల విక్రయం, ♦ అనుబంధ విభాగాల లిస్టింగ్ సన్నాహాలు న్యూఢిల్లీ: తాజా మూలధన పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్ 3 నిబంధనలను 2019 మార్చి నుంచి అమలుపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక వ్యూహ రచన చేస్తోంది. వచ్చే మూడేళ్లలో అనుబంధ విభాగాలను మార్కెట్లో లిస్టింగ్ చేయడం, అప్రాధాన్య ఆస్తుల (నాన్-కోర్ అసెట్స్) విక్రయం వంటివి ఇందులో ఉన్నాయి. బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. బాసెల్ 3 ప్రమాణాల ప్రకారం... బ్యాంకింగ్‌కు రూ.1.80 లక్షల కోట్లు అవసరం. ఇందులో రూ.70,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు కావల్సిన మొత్తాలకు సంబంధించి ఎస్బీఐ దారులు వెతుకుతున్నట్లు బట్టాచార్య సంకేతాలు ఇచ్చారు. ముఖ్యాంశాలు చూస్తే... ప్రభుత్వం అందించగా... మిగిలిన మొత్తాలను బ్యాంకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లాభాలు, నాన్-కోర్ అసెట్స్ విక్రయాలు ఇందుకు ఒక మార్గం. ఎస్బీఐని తీసుకుంటే నగదుగా మార్చుకోడానికి పలు నాన్-కోర్ అసెట్స్ ఉన్నాయి. అలాగే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ... లిస్టెడ్ కాని అనుబంధ విభాగాలూ ఉన్నాయి. కనుక ఇందుకు సంబంధించి లిస్టింగ్, విక్రయ అంశాలపై బ్యాంక్ దృష్టి పెడుతుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ వంటి బీమా వెంచర్లలో 10 శాతం, 23 శాతం చొప్పున తన వాటాల తగ్గింపునకు ప్రణాళికలను ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. మా తరహాలోనే పలు బ్యాంకులూ మూలధన సమీకరణలకు తమతమ వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు అధికంగా ఉన్నాయనడంలో నిజం లేదు. డిపాజిట్ రేట్లు ద్రవ్యోల్బణానికి తగిన విధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ రేటు తగ్గింపు కష్టం. -
బ్యాంకింగ్‌కు రూ.5 లక్షల కోట్లు అవసరం: అసోచామ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్ 3 అమలుకు భారత్ బ్యాంకులకు రూ. 5 లక్షల కోట్ల మూలధనం అవసరమవుతుందని అసోచామ్-ఎన్ఐబీఎం అధ్యయనం ఒకటి తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రకారం.. బాసెల్ ప్రమాణాల అమలుకుగాను 2019 మార్చి నాటికి ఈ నిధుల అవసరం ఏర్పడుతుందని సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. సమీప కాలంలో భారీగా 20 శాతం రుణ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇప్పటికే తీవ్రంగా ఉన్న మొండి బకాయిల భారం, స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ మూలధనం సమకూర్చుకోవడం సవాలేనని కూడా పేర్కొంది. -
అస్త్ర యంత్ర : ఆమె చేతుల్లోనే ఆర్థిక రంగం!
భారతదేశంలో ప్రతి పది కంపెనీలకుగాను ఒక కంపెనీలో మాత్రమే మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. అయితే ఆ ఉన్నత స్థానాల్లో ఏ రంగంలో ఎక్కువమంది స్త్రీలు ఉన్నారని పరిశీలించినపుడు అత్యధికంగా బ్యాంకుల్లో ఉన్నట్లు తేలింది. తాజా విషయం ఏంటంటే... ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా కూడా మన దేశంలో బ్యాంకింగ్ రంగంలో మహిళా నాయకత్వం చాలా ఎక్కువట. భారతదేశంలో 40 శాతం బ్యాంకింగ్ మహిళా సీఈవోల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అంటే మహిళలు కోరుకుంటున్న మూడోవంతు అవకాశాలను బ్యాంకింగ్ ఎప్పుడో కల్పించింది. నిజానికి ఇవి కల్పించిన అవకాశాలు కాదు, దక్కించుకున్న అవకాశాలు. ‘బ్యాంకింగ్ అనేది భారతీయ స్త్రీ రక్తంలోనే ఉంది. ఆర్థిక స్వావలంబన, భవిష్యత్తు ఆర్థిక అవసరాల అంచనా, ఆర్థిక నిర్ణయాలు అన్నవి భారతీయ స్త్రీకి వెన్నతో పెట్టిన విద్య’ అని అంతర్జాతీయ బ్యాంకింగ్ నిపుణులు అరుణ్ దుగ్గల్ అంటారు. వినియోగదారుడి మనసును అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాల్లో స్త్రీలు బాగా అంచనా వేయగలరని ఆయన అన్నారు. మిగతా రంగాల్లో స్త్రీ నాయకత్వం తక్కువగా ఉండటానికి కారణం వాటిని నడిపే శక్తి స్త్రీకి లేకపోవడం వల్ల కాదు, బ్యాంకింగ్ వారి పని విధానానికి, పని వాతావరణానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దాంతో పాటు వారి సామర్థ్యం ఇందులో ఎక్కువ. మరో కారణం.. బ్యాంకులు మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ముందుగా గుర్తించాయి. సమాన సామర్థ్యాలున్న ఇద్దరు (స్త్రీ-పురుషులు) ఇంటర్వ్యూకు వస్తే బ్యాంకింగ్ రంగంలో స్త్రీకి కచ్చితంగా ప్రాధాన్యం దక్కుతుంది. ప్రైవేటు బ్యాంకులు మహిళా ఉద్యోగులకు అన్ని స్థాయుల్లో రాచబాట వేస్తున్నాయి. బహుశా అందుకే అవి అంతటి విజయాలను సాధిస్తున్నాయేమో. స్త్రీ ఒక ఉద్యోగం చేయడం వేరు.. ఆ రంగంలో అడ్డంకులన్నీ దాటుకుని అత్యున్నత స్థానాలకు చేరడం వేరు. తాజాగా భారతదేశపు అతిపెద్ద బ్యాంకు అయిన ‘ఎస్బీఐ’కి అరుంధతి భట్టాచార్య చైర్పర్సన్ కావడంతో బ్యాంకుల్లో మహిళల విజయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తుచేసినట్టయింది. అలాంటి స్థానాల్లో ఉన్న మహిళల జాబితా చెప్పాలంటే వ్యాసం కాదు, పుస్తకమే వేయాలి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లోనూ వారి హవా పెద్దదే. ఏకంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రూపకర్తల్లో ఒకరు మహిళ. ఇంకా సెక్యూరిటీస్, తదితర సంస్థల్లో మహిళల పాత్ర కీలకంగా ఉంది. నేర్చుకోవడానికే కాదు అర్థం చేసుకోవడం కూడా క్లిష్టమైన ఆర్థిక రంగంలో ఇంతగా ఎదిగిన మహిళ ఎక్కడైనా లక్ష్యాన్ని చేరుకోగలదు. మహిళ విజయానికి దగ్గరవుతున్న కొద్దీ వ్యతిరేకించే వారినుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడమే చేయాల్సింది! - ప్రకాష్ చిమ్మల