బీజేపీని కూలదోస్తాం: దుష్యంత్‌ చౌతాలా! | JJP Will Support Congress from Outside | Sakshi
Sakshi News home page

బీజేపీని కూలదోస్తాం: దుష్యంత్‌ చౌతాలా!

Published Wed, May 8 2024 12:42 PM | Last Updated on Wed, May 8 2024 1:02 PM

JJP Will Support Congress from Outside

ఒకవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా,  మరోవైపు హర్యానా అసెంబ్లీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తూ, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

జననాయక్ జనతా పార్టీ అధినేత, హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా బీజేపీకి ఎదురు తిరిగి, కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించారు. బలపరీక్ష జరిగితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ ఎమ్మెల్యేలు మద్దతిస్తారని దుష్యంత్ వెల్లడించారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటి నుంచి మద్దతిస్తామన్నారు. అయితే కాంగ్రెస్‌ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నదో చూడాలన్నారు. విప్‌కు అధికారం ఉన్నంత వరకు ఆయన ఆదేశాల మేరకు అందరూ ఓటు వేయాల్సిందేనన్నారు. అయితే అటు కాంగ్రెస్‌తో గానీ, ఇటు బీజేపీతో గానీ వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement