Bharatiya Janata Party
-
బీజేపీని కూలదోస్తాం: దుష్యంత్ చౌతాలా!
ఒకవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు హర్యానా అసెంబ్లీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తూ, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.జననాయక్ జనతా పార్టీ అధినేత, హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా బీజేపీకి ఎదురు తిరిగి, కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించారు. బలపరీక్ష జరిగితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ ఎమ్మెల్యేలు మద్దతిస్తారని దుష్యంత్ వెల్లడించారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటి నుంచి మద్దతిస్తామన్నారు. అయితే కాంగ్రెస్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నదో చూడాలన్నారు. విప్‌కు అధికారం ఉన్నంత వరకు ఆయన ఆదేశాల మేరకు అందరూ ఓటు వేయాల్సిందేనన్నారు. అయితే అటు కాంగ్రెస్‌తో గానీ, ఇటు బీజేపీతో గానీ వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. -
చదువుపై అలా... మద్యంపై ఇలా..!!
-
మత రాజకీయాలు ఇక్కడ సాగవు
-
అధికారం కోసం ఇంత దారుణానికి దిగజారుతారా ??
-
కాషాయం లోకి వెళ్లినా ఆ ఇద్దరు పచ్చ పార్టీ అడుగుల్లోనే!
-
ఎన్నికలు పెట్టాలా వద్దా... డైలమా
-
మిషన్ యూపీ: అసెంబ్లీ ఎన్నికలపై కమల దళం ఫోకస్
-
తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం
-
దమ్ముంటే ఆ పనిచేయండి : ఎంపీ సీఎం
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని భీరాలు పలుకుతున్న బీజేపీ నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వట్టి మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇండోర్‌లో శనివారం జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్-2019 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘మా ప్రభుత్వాన్ని కూల్చుతామని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, కైలాష్ విజయ్వార్గియా పలు సందర్భాల్లో హెచ్చరించారు. మరి అంత దమ్ముంటే ఎందుకు ఆగుతున్నారు. మాపై కనికరం చూపుతున్నారా. ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు కాబట్టే అధికారంలో ఉన్నాం. కార్యకర్తల్లో జోష్ పెంచడానికే బీజేపీ నేతలు పసలేని మాటలు చెప్తున్నారు’అన్నారు.మరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలెందుకు ఆదరించలేదన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర, జాతీయ రాజకీయాలు ఒకేలా ఉండవు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరగాలని లేదు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయవాదం ప్రధానపాత్ర పోషిస్తుంది. అయితే, బీజేపీ ఒక్కటే జాతి కోసం పనిచేస్తున్నట్టు కాదు’అన్నారు. -
కమలానికి కఠోర పరీక్ష
త్రికాలమ్ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అన్ని వర్గాల ఆమోదం కోసం తాను అనేకమందితో సమాలోచనలు జరుపుతున్నట్టు శ్రీశ్రీ రవిశంకర్ రెండురోజుల క్రితమే ప్రకటించారు. ఆయనకు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వంటి బీజేపీ అగ్రనాయకులు మద్దతు పలికారు. భారతదేశంలో నివసించే హక్కు హిందువులకు మాత్రమే ఉన్నదని శనివారం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఉద్ఘాటించారు. ఈ పరిణామాలకూ, గుజరాత్ ఎన్నికలకూ ఏమైనా సంబంధం ఉన్నదా? గుజరాత్ ఎన్నికలకూ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)లో సవరణలకూ లంకె ఉన్నదా? వికాస్ (అభివృద్ధి), అవినీతి రహిత పాలన అంటూ రెండు నినాదాలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ హిందూత్వను కూడా జోడిస్తే కానీ ఆశించిన ఫలితం రాదని భావించారా? అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమా? ఎందుకంత శ్రమ? ‘రాహుల్‌గాంధీలాగా మా మోదీ సోమరి కాదు. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరి గినా శక్తివంచన లేకుండా కష్టపడతారు.’ ఇవి బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు ఒక ఇంగ్లీషు చానల్ చర్చాకార్యక్రమంలో అన్న మాటలు. మోదీ అక్టోబర్ మాసంలో గుజరాత్లో అయిదు పర్యాయాలు పర్యటించారు. గుజరాత్లో ఘనవిజయం ఖాయమనే విశ్వాసం ఉంటే ఒక ప్రధాని అన్నిసార్లు ఆ రాష్ట్రానికి వెళ్ళడం ఎందుకనే ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో చివరి మూడు రోజులూ ఒక్క కాశీ నగరంలోనే మోదీ ప్రచారం చేయడం విస్తుగొలిపింది. గెలుపు చాలా కష్టసాధ్యమని భావిం చిన కారణంగానే ప్రధాని ఒకే నగరంలో అన్ని రోజులు ఉన్నారేమో అనుకున్నాం. ఉత్తరప్రదేశ్‌లో అంతిమంగా బీజేపీ ఘనవిజయం సాధించింది. బీజేపీకి యూపీలో గెలుపొందడం చాలా అవసరం. ఆ గెలుపు పార్టీకి కొత్త ఊపునిచ్చింది. దేశప్రజల దృష్టిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్థాయి పెంచివేసింది. యూపీ కంటే గుజరాత్ బీజేపీ దృష్టిలో కీలకం. ఈ రాష్ట్రాన్ని మోదీ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు పరిపాలించారు. గుజరాత్ తరహా అభివృద్ధి దేశవ్యాప్తంగా సాధిస్తాననే వాగ్దానంతోనే ఆయన 2014 ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ సాధించిపెట్టారు. ఆ ఎన్నికలలో గుజరాత్లో ఉన్న మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకున్నది. పైగా బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వాణీ గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. షా కూడా ఆ రాష్ట్రం నుంచే ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనారు. సొంతరాష్ట్రంలో ఓడిపోతే మోదీ–అమిత్‌షా ద్వయానికి తలవంపులు. గెలిచినా ఆధిక్యం 2012లో కంటే తగ్గిందంటే అప్రతిష్ఠ. మారిన రాహుల్ 1995 నుంచీ అధికార పీఠానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘పప్పు’గా పేరుమోసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కత్తిలాగా మాటల తూటాలు ప్రయోగించి దేశ ప్రజల మెప్పు సంపాదిం చారు. ఆత్మవిశ్వాసంతో, జీఎస్టీని గబ్బర్‌సింగ్ టాక్స్‌గా అభివర్ణిస్తూ విసురుతున్న చలోక్తులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ‘ఇండియా టుడే’, ‘టైమ్స్ నౌ’ వంటి మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు బీజేపీకి ఈ సారి 2012లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని జోస్యం చెబుతున్నప్పటికీ మోదీకి నమ్మకం కలగడం లేదు. అందుకే అంత తరచుగా గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందు ఆ రాష్ట్రంలో రూ.15,000 కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కూడా అందుకే. ‘అచ్ఛే దిన్’గురించి అంతగా ప్రస్తావించకపోవడానికీ అదే కారణం. ఈ సంవత్సరం ఆరంభంలో యూపీలో అమిత్‌షా, 1970లలో గుజరాత్లో ఇందిరాగాంధీ చేసిన ప్రయోగం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్నారు. యూపీలో సుమారు 200 కుల సమావేశాలను అమిత్‌షా నిర్వహించి అన్ని కులాల మద్దతూ కూడగట్టి యాదవ కులాన్ని ఒంటరిదాన్ని చేశారు. ఇందిరాగాంధీ క్షత్రియులనూ ( గుజరాత్ జనాభాలో 37శాతం ఓబీ సీలు), దళితులనూ (6), ఆదివాసీలనూ (15), ముస్లింలనూ (10 శాతం) ఒక తాటిపైకి తెచ్చి (ఓఏఅ M‘ఖామ్’) బలమైన సంకీర్ణం నిర్మించారు. నాడు ఈ కృషిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ నాయకుడు జీనాభాయ్ దర్జీది ప్రధానపాత్ర. నేడు రాహుల్‌గాంధీ చాకచక్యం వల్ల కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల 70 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల నాయకులు కాంగ్రెస్‌తో భుజం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మోదీ, షాలను బాగా కలవరపెడుతున్న పరిణామం. వ్యాపారమే ప్రధానంగా భావించే గుజరాతీయులలో అకస్మాత్తుగా ఒక చైతన్యం వెల్లువెత్తుతుంది. చినికి చినికి గాలివానగా మారుతుంది. యువత అతి వేగంగా స్పందించి తిరుగుబాటు చేస్తుంది. అహ్మదాబాద్ హాస్టళ్ళలో ఆహారం నాసిరకంగా ఉండటానికీ, మెస్ బిల్లులు పెరిగిపోవడానికీ నిరసనగా 1973 డిసెంబర్లో ఆరంభమైన విద్యార్థుల ఆందోళన క్రమంగా ఊపందుకొని నవనిర్మాణ ఉద్యమంగానూ, అనంతరం జయప్రకాశ్‌నారాయణ్ నాయకత్వంలో సంపూర్ణ విప్లవంగానూ పరిణమించింది. 1975లో ఆత్యయిక పరిస్థితికి దారితీసి, 1977లో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి కారణమై దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేసింది. విద్యార్థి ఉద్యమం గుజరాత్లో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. 43 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుజరాత్లో యువత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. మూడు బలమైన వర్గాలకు ప్రతినిధులుగా ముగ్గురు యువనేతలు– హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకుర్, జిగ్నేశ్ మెవానీ– ఎదిగారు. ముగ్గురు మరాఠీలు పతీదార్లకు ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కావాలంటూ పతీదార్ అనామత్ ఆందోళన్ సమితి (PASS )ఆధ్వర్యంలో 2015లో 22 ఏళ్ళ హార్దిక్ పటేల్ ఆందోళన మొదలుపెట్టారు. ఆనందీబెన్ పటేల్ సర్కార్‌ను గడగడలాడిం చారు. పతీదార్లు వ్యవసాయం ప్రధానంగా జీవించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వ్యవసాయాధార పరిశ్రమలకూ, ఇతర పరిశ్రమలకూ, రాజకీయాలకూ విస్తరించారు. కడ్వ, ల్యూవా పటేల్ ఉపకులాలవారు హార్దిక్‌పటేల్‌ను సమర్ధిస్తున్నారు. గుజరాత్ జనాభాలో కడ్వ పటేళ్ళు ఆరు శాతం, ల్యూవా పటేళ్ళు ఎని మిది శాతం, ఇతర పటేళ్ళు రెండు శాతం ఉంటారు. 1984–85 నుంచీ పటేళ్ళు మూకుమ్మడిగా బీజేపీతో ఉన్నారు. ఈ సారి తేడా వచ్చింది. కానీ నాయకులు మాత్రం ఇప్పటికీ బీజేపీతోనే ప్రయాణం చేస్తున్నారు. అల్పేశ్ ఠాకుర్ (40) ఓబీసీ నాయకుడు. కాంగ్రెస్ నేత ఖోడాభాయ్ పటేల్ తనయుడు. ఆరేళ్ళ కిందట ‘క్షత్రియ ఠాకుర్ సేన’ను అల్పేశ్ స్థాపించారు. ఆ సంస్థలో ఏడు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏక్తామంచ్ (OSS ) నెలకొల్పారు. మంచి నిర్వాహకుడిగా పేరు సంపాదిం చారు. అల్పేశ్ ప్రభావం ఉత్తర గుజరాత్‌లోని సబర్కాన్తా (3 నియోజకవర్గాలు), బనాస్కాంతా (9), ఖేడా (7), మెహసానా(7), ఆనంద్ (7), పట్నా (4), గాంధీనగర్ (5), ఆరావళీ (3) జిల్లాలలో విశేషంగా ఉంటుంది. ఉత్తర గుజరాత్‌లోని మొత్తం 33 శాసనసభ స్థానాలలో 2012 ఎన్నికలలో కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 15కే పరిమితమైంది. అప్పుడు శంకర్‌సిన్హ్ వఘేలా కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆయనకు 15 నియెజకవర్గాలలో పట్టు ఉంది. గత జులైలో వఘేలా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు. ‘జనవికల్ప్’ పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు. 1996 లో సైతం బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా కాంగ్రెస్‌లో చేరకుండా ‘రాష్ట్రీయ జనతా పార్టీ’ని నెలకొల్పారు. 1998 ఎన్నికలలో ఆ పార్టీ గుర్తుపై అభ్యర్థులను నిలబెట్టి 12 శాతం ఓట్లు చీల్చుకున్నారు. ఓబీసీలలో ఠాకూర్లది పెద్ద వర్గం. దాని నాయకుడు అల్పేశ్ ఇటీవల జనాదేశ్ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి తన నాయకత్వం లోని ఓఎస్ఎస్ సంస్థను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. జిగ్నేశ్ మెవానీ 37 సంవత్సరాల యువకుడు. వృత్తిరీత్యా న్యాయవాది. పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు వేయడంలో దిట్ట. 2016లో ఉనా నగరంలో నలుగురు అర్ధనగ్నంగా ఉన్న దళిత యువకులను గోరక్షకులు విపరీతంగా కొట్టిన ఘటనపై పెద్ద ఉద్యమం నిర్మించి దళిత నేతగా ఎదిగిన వ్యక్తి జిగ్నేశ్. చాలామంది దళితులను బౌద్ధంలో చేర్పించారు. గుజరాత్ జనాభాలో దళితులు ఆరు శాతం. ముస్లింలు పది శాతం. ఈ రెండు వర్గాల మద్దతు లేకుండానే ఎన్నికలలో గెలవడం బీజేపీకి పరిపాటి. గుజరాత్‌లోని వివిధ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ముగ్గురు యువకులు గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలలోనూ 111 స్థానాలను ప్రభావితం చేయగలరు. వీరిని కాంగ్రెస్ అక్కున చేర్చుకోగలిగితే బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బతింటాయి. అల్పేశ్, జిగ్నేశ్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. తాను పోరాడుతున్నది పటేళ్ళకు రిజర్వేషన్లకోసం కనుక రిజర్వేషన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తాను పూర్తి మద్దతు ఇస్తానని హార్దిక్ చెబుతున్నాడు. హామీ ఇవ్వడం అంత తేలిక కాదు. పటేళ్ళకు రిజర్వేషన్లు అవసరమా, లేదా అనే విషయంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాహుల్‌గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయినా బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాలని పట్టుదలగా ఉన్న హార్దిక్ కాంగ్రెస్ పార్టీని సమర్థించక తప్పకపోవచ్చు. బీజేపీ నేతల్లో గుబులు ఆర్ధిక మాంద్యం గుజరాత్లో వివిధ వర్గాలను దెబ్బతీస్తున్నది. వ్యవసాయరంగం దీనావస్థలో ఉంది. ఇటీవలి వరదలలో నష్టపోయినవారిలో చాలామంది ఇంకా కోలుకోలేదు. ఆరోగ్యం, రవాణా రంగాలు కుదేలైనాయి. ఇంతవరకూ బీజేపీని బేషరతుగా బలపరిచిన అహ్మదాబాద్, సూరత్ వజ్రాలూ, జౌళి వ్యాపారులు జీఎస్టీతో దారుణంగా దెబ్బతిని ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఈ నెల 8 వ తేదీన వదోదరా సభలో ప్రసంగిస్తున్న మోదీపైన పరిమిత వేతనాలకు వ్యతి రేకంగా పోరాడుతున్న సంస్థ అధ్యక్షురాలు చంద్రికా సోలంకీ అరడజను గాజులు విసిరి నిరసన ప్రకటించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భరత్‌సింగ్ సోలంకీ సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు. పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయం తాలూకు ఉత్సాహం పార్టీ కార్యకర్తలలో ఉంది. అయినప్పటికీ నవంబర్ 9, 14 తేదీలలో 14వ గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఓడించగలదని చెప్పడం కష్టం. బీజేపీ చేతిలో అధికారం ఉంది. వివిధ వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది. అంగబలం, అర్థబలం ఉన్నాయి. పెద్ద నోట్లు రద్దయినప్పటికీ అధికారపార్టీ చేతుల్లో నల్లధనం అపారంగా ఉంది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల క్షేత్రస్థాయి సేవలు ఉన్నాయి. 2002 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పొందిన ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు 10–11 శాతం అధికం. మోదీ ప్రధానిగా వచ్చి ఓట్లు అడుగుతున్నారు కనుక బీజేపీకే వేయాలనే ఆలోచన చాలామందిలో ఉండవచ్చు. అయినప్పటికీ మోదీ ర్యాలీలకు జనం ఉత్సాహంగా హాజరు కాకపోవడం బీజేపీ నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నది. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే సరిపోదు. భారీ ఆధిక్యం సాధించాలి. లేకపోతే ఆర్ఎస్ఎస్ నాయకత్వం క్షమించదు. ప్రజల దృష్టిలో మోదీ–షా ద్వయం పలచన అవుతారు. వారి మ్యాజిక్ పనిచేయడం లేదనే అభిప్రాయం కలుగుతుంది. అటువంటి అభిప్రాయం ప్రబలితే గుజరాత్ ఎన్నికల తర్వాత జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, ఆ తర్వాత 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలోనూ బీజేపీకి నష్టాలూ, కష్టాలూ పెరుగుతాయి. అందుకే మోదీ అంతగా శ్రమిస్తున్నారు. కె. రామచంద్రమూర్తి -
గెయిల్ సర్కార్ తొహార్
సాక్షి : నటుడు, బీజేపీ షాట్ గన్ శతృఘ్నసిన్హా మరోసారి పార్టీ ముఖ్యనేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టూ మెన్ ఆర్మీ(మోదీ, అమిత్ షా పేర్లను ప్రస్తావిస్తూ...) గా తమ ప్రభుత్వం నడుస్తోందంటూ ఆయన తెలిపారు. శనివారం పట్నా యూనివర్సిటీ వేడుకల్లో మోదీ పాల్గొనబోతుండగా.. ఆ కార్యక్రమానికి శతృఘ్న సిన్హాకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో మీడియా శుక్రవారం ఆయనను ఈ విషయమై ప్రశ్నించింది. అధిష్టానం పట్టించుకోవట్లేదు కాదా.. మరి పార్టీని వీడతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘బీజేపీతోనే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు నేను పార్టీలో చేరా. అలాంటిది పార్టీని ఎందుకు వదిలేస్తా. మోదీ, ముఖ్య నేతలు, చివరికి తన కూతురు(నటి సోనాక్షి సిన్హా) సహకారం లేకుండా ఎన్నికల్లో గెలిచా. కానీ, ప్రస్తుతం పార్టీలో కొందరి పెత్తనం కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం బిహార్ ఎన్నికల సమయంలో తన సేవలను వినియోగించుకుంటారేమోనని అమిత్ షాను కలిశా.. కానీ, అటు నుంచి సానుకూలత రాలేదు. ఇక ఈ మధ్య ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించా. కనీసం పట్టించుకోను లేదు. అయినప్పటికీ నాకేం బాధలేదు. నన్ను నిర్లక్ష్యం చేసినా కడదాకా పార్టీతోనే ఉంటా’ అని సిన్హా స్పష్టం చేశారు. ఇక సీనియర్ నేత అద్వానీ గురించి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన(అద్వానీ) నా గురువు, మార్గదర్శి. ప్రధాని అభ్యర్థిత్వానికి మోదీ తగిన వ్యక్తి కాదని ఆనాడూ(2013లో) అద్వానీతో సహా తాను గళం వినిపించానని కానీ పార్టీ అధిష్టానం ఆ అంశాన్ని పక్కన పెట్టిందని గుర్తుచేశారు. అంతేకాదు అద్వానీ రాష్ట్రపతి కావాలని బీజేపీలోని 80 శాతం మంది కోరుకున్నారని.. కానీ, కొందరు ఆ అంశాన్ని లేవనెత్తనీయకుండా అణచివేశారని సిన్హా చెప్పారు. జీఎస్టీతో ఇబ్బందులే... మోదీ ప్రభుత్వ నిర్ణయాలపై సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు శతృఘ్న సిన్హా తెలిపారు. నోట్ల రద్దు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిదన్న ఆయన జీఎస్టీతో బీహార్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని బీహార్ ప్రజలు అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పేదలు, వ్యాపారవేత్తల్లో భయాందోళనలు రేకెత్తించిందని ఆరోపించారు. మధ్య తరగతి కుటుంబాలు, యువతరం, నిరుద్యోగం, చిన్న వ్యాపారులు, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. బీహార్ ప్రజలు ఇప్పటికీ ఈ సమస్యల నుంచి బయటపడలేదని, జీఎస్టీ అంటే ‘గెయిల్ సర్కార్ తొహార్ (ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది) అని సిన్హా సరికొత్త భాష్యం చెప్పారు. -
అధికారం నిజాన్ని ఒప్పుకుంటుందా?
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను కలకలం రేపుతున్నాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కోసం ఆయన రాసిన ఓ కథనం ఇప్పుడు చర్చకు దారితీసింది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఆయన రాసిన ఆర్టికల్‌లో కేంద్రం కీలకంగా భావించిన నోట్లరద్దు, జీఎస్టీలపైనే ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను తన ప్రభుత్వమే నట్టేట ముంచిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇప్పటికీ కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస్మరించినట్లేనన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు జీడీపీ తగ్గిపోవటానికి సాంకేతిక కారణాలే కారణమన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను యశ్వంత్ తప్పుబట్టారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా దర్యాప్తు సంస్థల దాడులను ఖండించే వాళ్లమని ఆయన గుర్తు చేశారు. అధికారం అండతో ప్రత్యర్థులపైకి ఉసిగొల్పటం సరికాదంటూ ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు. వాజ్‌పేయి హయాంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక యశ్వంత్ రాసిన కథనంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం ట్విట్టర్లో స్పందించారు. ‘ఆయన (యశ్వంత్) అధికారంలో ఉన్న వారి గురించి నిజం చెప్పారు. మరి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్న ఆ నిజాన్ని అధికారం ఒప్పుకుంటుందా? అంటూ బీజేపీకి చురకలంటించారు. సొంత నేత చేసిన విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. Yashwant Sinha speaks Truth to Power. Will Power now admit the Truth that economy is sinking? — P. Chidambaram (@PChidambaram_IN) September 27, 2017 ETERNAL TRUTH: No matter what Power does, ultimately Truth will prevail. — P. Chidambaram (@PChidambaram_IN) September 27, 2017 -
సాటి మనిషికి ఆ మాత్రం సాయం...
సాక్షి, ఆగ్రా : కేవలం ఓట్ల కోసం జనాల దగ్గరికి క్యూ కట్టే కొందరు నేతలు.. తర్వాత వారిని పట్టించుకోకుండా ముఖం చాటేయడమనే వ్యవహారం కొత్తేం కాదు. కానీ ఇక్కడ.. తన మానాన తాను పోకుండా పక్కవాడి ప్రాణాలు కాపాడాలన్న ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నం హర్షణీయంగా మారింది. ఉత్తర ప్రదేశ్ ఫర్రూఖాబాద్లో శుక్రవారం సాయంత్రం బీమ్సేన్ మార్కెట్లో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న సర్దార్ నియోజకవర్గ ఎమ్మెల్యే మేజర్ సునీల్ దత్ ద్వివేదీ ఘటనను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. తన సిబ్బంది సహయంతో ఆ ముగ్గురిని సమీపంలోని లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే గన్ మెన్, మరో అనుచరుడు ఇద్దరిని స్ట్రెచ్చర్‌పై ఆస్పత్రిలోకి లోపలికి తీసుకెళ్లారు. అయితే మరో బాధితుడి కోసం స్ట్రెచ్చర్ అందుబాటులో లేకపోవటంతో ఆ సమయంలో స్వయంగా ఎమ్మెల్యే తన వీపు మీద అతన్ని మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లారు. ‘‘ ఆ సమయంలో ఆ వ్యక్తి బాధతో విలపిస్తున్నాడు. ఆలస్యం చేయటంసరికాదని భావించా. వెంటనే వీపుపై మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లా. అయినా సాటి మనిషికి ఆ మాత్రం సాయం చేయటం నా బాధ్యత’’ అని ద్వివేదీ పేర్కొన్నారు. తనకు సాయం చేసిన ఎమ్మెల్యేకు బాధితుడు అరవింద్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలియజేయగా.. పలువురు స్థానికులు ఎమ్మెల్యే ద్వివేదీ చేసిన పనిని అభినందిస్తున్నారు. -
మోడీకి వీసా జారీ నిర్ణయంలో మార్పు లేదు:యూఎస్
భారతీయ జనతాపార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని వచ్చే ఎన్నికల్లో భారత ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన వీసా జారీ ప్రక్రియ విధానంలో గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అమెరికా శనివారం స్పష్టం చేసింది. అయితే మరో సారి మోడీ యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం సమీక్షిస్తామని తెలిపింది. అది కూడా యూఎస్ చట్టాలకు లోబడే నిర్ణయం తీసుకుంటామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మారీ హర్ఫ్ వెల్లడించింది. శనివారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వీసా జారీ ప్రక్రియలో ఎంతోకాలంగా అనుసరిస్తున్న విధాన్నానే ఇప్పుడు కూడా పాటిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం భారత రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. భారత్ లేదా ఇతరదేశాల్లోని రాజకీయ వ్యవహారాల్లో యూఎస్ ఎప్పుడు తలదూర్చదని మారీ హర్ఫ్ మరో సారి స్ఫష్టం చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయంలోనే గోద్రాలో అల్లర్లు జరిగాయి. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని మోడీకి వీసా జారీ చేసేందుకు యూఎస్ నిరాకరించింది. అదికాక నిన్న న్యూఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశంలో నరేంద్రమోడీని దేశ ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ ఎంపిక చేసింది. అందులోభాగంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు మారీ హర్ఫ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.