Dushyant
-
హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
జీంద్: హర్యానాలోని జింద్ జిల్లా ఉచన కలాన్‌లో కలకలం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అనంతరం దుష్యంత్ కాన్వాయ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ రోడ్ షోలో దుష్యంత్‌తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు. ఈ హఠాత్ దాడి హర్యానా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. జేజేపీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
బీజేపీని కూలదోస్తాం: దుష్యంత్ చౌతాలా!
ఒకవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు హర్యానా అసెంబ్లీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తూ, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.జననాయక్ జనతా పార్టీ అధినేత, హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా బీజేపీకి ఎదురు తిరిగి, కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించారు. బలపరీక్ష జరిగితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ ఎమ్మెల్యేలు మద్దతిస్తారని దుష్యంత్ వెల్లడించారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటి నుంచి మద్దతిస్తామన్నారు. అయితే కాంగ్రెస్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నదో చూడాలన్నారు. విప్‌కు అధికారం ఉన్నంత వరకు ఆయన ఆదేశాల మేరకు అందరూ ఓటు వేయాల్సిందేనన్నారు. అయితే అటు కాంగ్రెస్‌తో గానీ, ఇటు బీజేపీతో గానీ వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. -
హోమ్ క్వారంటైన్లోకి వసుంధరా రాజే కుటుంబం
-
ఆసియా గేమ్స్: దుష్యంత్‌కు కాంస్యం
ఇంచియోన్: ఆసియా గేమ్స్‌లో ఐదో రోజు బుధవారం భారత షూటర్లు నిరాశపరిచారు. పతకాల వేటలో విఫలమయ్యారు. కాగా రోయర్ దుష్యంత్ చౌహాన్ మాత్రం కాంస్య పతకం సాధించాడు. పురుషులల లైట్ వెయిట్ సింగిల్స్ కల్స్ ఈవెంట్లో దుష్యంత్ మూడో స్థానంలో నిలిచి పతకం గెలుచుకున్నాడు. భారత్ ఓవరాల్‌గా 14వ స్థానంలో నిలిచింది.