
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవలే తనపై కొందరు నిఘా ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. గతేడాది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు ఆమె తన ఇన్‌స్టాలో తెలిపింది.
గతేడాది ఓ రెస్టారెంట్ ప్రారంభించాలకున్నట్లు కంగనా తెలిపింది. కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అది వీలు కాలేదని పేర్కొంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతాతో పాల్గొన్న ఇంటర్వ్యూను పంచుకుంది. ఈ వీడియోను మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఇప్పటికే మర్చిపోయానని కంగనా తెలిపింది.
గతంలో ఎమర్జెన్సీ చిత్రం నిర్మించడానికి తన ఆస్తులన్నీ తనఖా పెట్టినట్లు కంగనా వెల్లడించారు. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే తన ఆస్తిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. నేను కేవలం రూ.500తో ముంబైకి వచ్చానని.. కాబట్టి పూర్తిగా ఫెయిలైనా మరోసారి నిలబడగలననే విశ్వాసముందని తెలిపారు. కాగా.. కంగనా ఇటీవలే ఎమర్జెన్సీ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చంద్రముఖి -2 సినిమాలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment