ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో లంకేయులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. భారత్ కూడా చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోందంటూ ఓ గ్రాఫ్‌ను చూపిస్తూ కేంద్రంపై ఆగ్రహం వ‍్యక్తం చేశారు.
దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందోని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ క్రమంలో బుధవారం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. భారత్ చాలా వరకు శ్రీలంకలా కనిపిస్తోంది. రెండు దేశాల్లో నిరుద్యోగం, పెట్రోలు ధరలు, మత హింసకు సంబంధించిన గ్రాఫ్‌ను పోస్ట్ చేసి.. ఇవి తీవ్ర స్తాయికి చేరుకున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రజల చూపును పరిస్థితుల నుంచి మళ్లించడం వల్ల నిజాలు అబద్ధాలు కాలేవు.. అంటూ కామెంట్స్ చేశారు. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన డేటా ఆధారంగా ఈ గ్రాఫ్‌లను రూపొందించినట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మరోవైపు.. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ దొరక్క అల్లాడుతున్న జనం వంట చేసుకునేందుకు కిరోసిన్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరోవైపు.. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్ కొనేందుకు తమ వద్ద డబ్బుల్లేవని లంక సర్కార్ చేతులెత్తేసింది. ప్రజలు.. పెట్రోల్ కోసం బంకుల వద్దకు రావద్దొని తెలిపింది. దీంతో ప్రభుత్వం తీరుపై లంకేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2022
Comments
Please login to add a commentAdd a comment