హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్‌! | Newborn Saved From Dead Mother's Womb After Israel Strikes Gaza Hospital | Sakshi
Sakshi News home page

హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్‌!

Published Sat, Jul 20 2024 7:59 PM | Last Updated on Sat, Jul 20 2024 8:10 PM

Newborn Saved From Dead Mother's Womb After Israel Strikes Gaza Hospital

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది కాబట్టి. ఇదొక్క సంఘటనే కాదు..  9 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. 

హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ తాజాగా గాజాలో ఓ ఆస్పత్రిపై దాడులు జరిపింది. అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణీ అయిన ఒలా అద్నన్‌ హర్బ్‌ అల్‌ కుర్ద్‌ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే ఆమె కన్నుమూసింది. అయితే.. 

వైద్యులకు ఆల్ట్రాసౌండ్‌లో కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినిపించింది. దీంతో.. అత్యవసరంగా ఆపరేషన్‌ చేసి ఆ బిడ్డను బయటకు తీశారు.  ఆ బిడ్డ బతకదని వైద్యులు తొలుత భావించారట. ఇంక్యూబేటర్‌లో పెట్టి డీర్ ఎల్-బలాహ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారట.  కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు కోలుకుంటున్నాడని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక వలంటీర్లకు ఆ బిడ్డను అప్పజెప్తామని తెలిపారు వాళ్లు. 

యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement