న్యూయార్క్: అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల నేతలు, ప్రచార బృందాల విమర్శల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం రాత్రి ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో క్యాంపస్ వద్ద ట్రంప్ మాట్లాడారు.
‘నాలుగు ఏళ్ల క్రితం ఆమెరికా ఒక గొప్పదేశంగా ఉండేది. అంతే స్థాయిలో మరికొన్ని రోజుల్లో అమెరికా గొప్ప దేశం నిల్చోబెడతా. యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. దీంతో కొంత కాలం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో వలసలు పెరిగాయి. బహిష్కరణ విధానాలతో వలసలపై కఠిన చర్యలు తీసుకుంటాను. మోసగాడైన జో బైడెన్.. సోదరభావంతో ఉండే ఫిలడెల్ఫియా సిటీని మొత్తం నేరాలు, రక్తపాతంతో నాశానం చేశారు. ఇక్కడ అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇదంతా ‘బైడెన్ వలస నేరం’.
.. మన దేశ చరిత్రలో సురకక్షితమైన సరిహద్దులు కలిగి ఉండేవాళ్లం. కానీ ఇప్పడు మనం ప్రపంచ చరిత్రలోనే రక్షణ లేని సరిహద్దులను కలిగి ఉన్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను. బైడెన్ ఆర్థిక విధానాలను మార్చివేస్తాను. రక్షణ వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తా. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా అమెరికాకు సైతం ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా’అని ట్రంప్ అన్నారు.
ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరుగనున్నాయి. జాతీయవాదిగా, వలసలను త్రీంగా వ్యతిరేకించే నేతగా పేరున్న ట్రంప్ ఇటీవల అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్ గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment