
విధ్వసంకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టీ20లకు ప్రధాన జట్టు నుంచి హెట్‌మైర్‌ను సెలక్టర్లు తప్పించారు. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హెట్‌మైర్‌పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది.
ఇక అతడి స్ధానాన్ని మరో డేంజరస్ ఆటగాడు జాన్సెన్ చార్లెస్‌తో విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు జోషఫ్ స్ధానంలో ఓషానే థామస్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ట్రినిడాడ్ వేదికగా డిసెంబర్ 20న జరగనుంది.
మిగిలిన రెండు టీ20లకు విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్
Comments
Please login to add a commentAdd a comment