విండీస్ బౌలర్ సునీల్ నరైన్పై వేటు | icc suspends sunil narine from international cricket | Sakshi
Sakshi News home page

విండీస్ బౌలర్ సునీల్ నరైన్పై వేటు

Nov 29 2015 4:48 PM | Updated on Sep 3 2017 1:13 PM

విండీస్ బౌలర్ సునీల్ నరైన్పై వేటు

విండీస్ బౌలర్ సునీల్ నరైన్పై వేటు

వెస్డిండీస్ అనుమానాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నరైన్ను సస్పెండ్ చేశారు.

దుబాయ్: వెస్టిండీస్ అనుమానాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నరైన్ను సస్పెండ్ చేశారు. అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల్లో శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా నరైన్ పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు.  నరైన్ బౌలింగ్ చేసే క్రమంలో తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు.


నరైన్ బౌలింగ్ యాక్షన్ను పరిశీలించిన ఐసీసీ బృందం అతను నిబంధనలను ఉల్లంఘించినట్టు కనుగొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement