
అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ రంగప్రవేశానికి ఐసీసీ ఓకే చెప్పింది. ఆస్ట్రేలియాలో జన్మించిన డేనియల్ మెక్‌గాహె అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించనుంది. మెక్‌గాహె అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ నిర్ధేశించిన అన్ని అర్హత ప్రమాణాలను క్లియర్ చేసింది. మెక్‌గాహె 2024 మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోటీల కోసం ఎంపిక చేసిన కెనడా జట్టులో చోటు దక్కించుకుంది.
2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకు వలస వెళ్లిన మెక్‌గాహె.. అదే ఏడాది లింగమార్పిడి చేయించుకని మహిళగా మారి, త్వరలో అదే దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. ఐసీసీ నుంచి క్లియెరెన్స్ లభించాక మెక్‌గాహె స్పందిస్తూ.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించనున్న మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని అంది.
కాగా, పురుషుడి నుంచి మహిళగా మారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే, సదరు వ్యక్తి పలు మెడికల్ టెస్ట్‌లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారు పలు రాతపూర్వక హామీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment