బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.
ఇంగ్లీష్ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మోస్లీ(57), సామ్ కుర్రాన్(40), ఆర్చర్(38) పరుగులతో రాణించారు. కరేబియన్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, షెఫార్డ్ తలా రెండు వికెట్లు సాధించారు.
కింగ్, కార్టీ ఊచకోత..
అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 43 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఆటగాళ్లు కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు, 128 నాటౌట్), బ్రాండెన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102) విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ, ఓవర్టన్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?
Comments
Please login to add a commentAdd a comment