జోసెఫ్ శుభారంభం | Joseph good start | Sakshi
Sakshi News home page

జోసెఫ్ శుభారంభం

Published Fri, May 8 2015 2:21 AM | Last Updated on Mon, Oct 22 2018 5:42 PM

Joseph good start

తెలంగాణ-ఏపీ స్నూకర్ టోర్నీ
 
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఏపీ స్నూకర్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో జోసెఫ్ శుభారంభం చేశాడు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ క్లబ్‌లో గురువారం తొలిరౌండ్ పోటీలను బెస్టాఫ్ ఫైవ్ ఫ్రేమ్స్ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో క్యూ క్లబ్‌కు చెందిన జోసెఫ్ 3-1 (59-11, 29-55, 41-32, 63-20) ఫ్రేమ్‌ల తేడాతో ఎస్‌డీ పార్లర్‌కు చెందిన సాయికిరణ్‌పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఫైజల్ 3-0 (59-35, 43-11, 58-31) ఫ్రేమ్‌ల తేడాతో సమీర్‌ను ఓడించగా, నరేశ్ కుమార్ 3-1 (81-6, 34-57, 59-30, 68-20)తో శంకర్‌పై గెలిచాడు.

అస్లామ్ 3-0 (49-38, 53-24, 54, 2)తో భరత్‌పై, శ్రవణ్ కుమార్ 3-0 (40-5, 44-23, 53-22)తో విక్రమ్‌పై నెగ్గారు. అఖిల్ 3-0 (50-26, 61-53, 52-45)తో ప్రదీప్‌ను కంగుతినిపించగా,  సినాప్ర 3-1 (57-22, 45-22, 27-53, 56-55)తో కృష్ణపై, రాజీవ్ 3-1 (55-31, 25-59, 60-39, 59-24)తో ఫైజల్‌పై విజయం సాధించారు. సుదర్శన్ రెడ్డి 3-2 (50-28, 42-51, 19-66, 74-22, 53-44)తో ఉదయ్‌పై గెలుపొందగా, శ్రీధర్ 1-3 (43-21, 29-42, 40-59, 44-59)తో ధ్రువ్ సింగ్ చేతిలో, సుహాస్ రాజ్ 1-3 (64-54, 27-61, 38-45, 20-47)తో సన్నీ చేతిలో పరాజయం చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement