Malayalam Director Basil Joseph Couple Blessed With Baby Girl, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Basil Joseph: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య

Published Wed, Feb 15 2023 6:33 PM | Last Updated on Wed, Feb 15 2023 7:03 PM

Malayalam Director, Actor Basil Joseph Couple Blessed With Baby Girl - Sakshi

ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ తండ్రి అయ్యాడు. నేడు(బుధవారం) ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రయిన ఆనంద క్షణాలను సోషల్‌ మీడియా వేదికగా ఆయన స్వయంగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కూతురికి హోప్‌ ఎలిజబెత్‌ బాసిల్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోను షేర్‌ చేస్తూ తాను తండ్రి అయినట్లు ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.

చదవండి: వాలంటైన్స్‌ డే: తమన్నా-విజయ్‌ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?

దీంతో ఆయనకు మలయాళ సినీ ప్రముఖులు, నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దుల్కర్ సల్మన్​, నజ్రియా ఫాహద్, టోనివో థామస్​, ఐశ్వర్యా లక్ష్మీ, సంయుక్త, రాజీషా విజయన్ లాంటి స్టార్లు జోసెఫ్‌​ దంపతులకు విషెష్ తెలిపారు. కాగా బాసిల్‌ జోసెఫ్‌ తెలుగు సినీ ప్రియులకు సైతం సుపరిచితమే. ఇటీవల ఆయన నటించిన జయ జయ జయ హే చిత్రం తెలుగులోనూ డబ్‌ అయ్యింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

చదవండి: వరుస ఫ్లాప్‌లు.. అలా చేస్తేనే పూజాకు ఆఫర్స్‌ ఇస్తామంటున్నారట?

ఇందులో ఆయన భార్యను వేధించే భర్తగా కనిపించాడు. అంతేకాదు మలయాళంలో ఆయన వినూత్న కథా చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. కుంజీరమాయనమ్‌, గోధా వంటి చిత్రాలతో ఆయన మాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యాడు. మిన్నల్‌ మెరళి చిత్రం ద్వారా డైరెక్టర్‌గా మారి తొలి చిత్రానికే దర్శకుడిగా పలు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యాడు. దీంతో ఆయన పేరు జాతీయ వ్యాప్తంగా మారుమోగింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్‌ అయిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement