హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే వేదికపై ఆమె తెలుగు వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నివశిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్లారిటి ఇస్తూ ఒక పోస్ట్ చేశారు.
'నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ డీఎంకే పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారాలకు తెరలేపారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. తెలుగు ప్రజలందరూ నా కుంటుంబం అనే భావిస్తాను. ఈ విషయం తెలియని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటిరోజున నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. ఈ ట్రాప్‌లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్ర,తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.' అని తెలిపింది.
సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించారంటూ తమిళనాట వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment