క్షమాపణ కోరుతూ తెలుగు ప్రజలకు లేఖ రాసిన నటి కస్తూరి | Actress Kasthuri Write Apology Letter For Telugu People | Sakshi
Sakshi News home page

క్షమాపణ కోరుతూ తెలుగు ప్రజలకు లేఖ రాసిన నటి కస్తూరి

Published Tue, Nov 5 2024 6:36 PM | Last Updated on Tue, Nov 5 2024 6:51 PM

Actress Kasthuri Write Apology Letter For Telugu People

సినీ నటి కస్తూరు తమిళనాడులో ఒక వేదికపై తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అయితే, తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదంటూ ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ, ఆమెపై ఎదురుదాడి ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఎట్టకేలకు తెలుగు ప్రజలకు క్షమాపణ చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది.

'నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. ప్రాంతాలను విడికొట్టి ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం నా అదృష్టం. నేను నాయకర్ రాజులు, కట్టబొమ్ము నాయక (వీరపాండ్య కట్టబ్రహ్మన) , త్యాగరాజు కీర్తనల గురించి తెలుసుకుంటూ పెరిగాను. తెలుగులో నా సినీ కెరీర్‌ ఎంతో అద్భుతంగా సాగుతుంది. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు కీర్తి, ప్రేమ, కుటుంబాన్ని అందించారు. నేను మాట్లాడింది కొందరి వ్యక్తుల గురించి మాత్రమేనని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. 

నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం  ఉద్దేశ్యం కాదు. అనుకోని విధంగా జరిగిన ఈ సంఘటనకు నన్ను క్షమించండి. సర్వతోముఖ స్నేహం దృష్ట్యా, నేను 3 నవంబర్ 2024న నా ప్రసంగంలో తెలుగుకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను. ఈ వివాదం వల్ల నేను ఆ ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలు అన్నింటినీ పక్కను నెట్టేసింది. తమిళనాడులోని తెలుగు సోదరులు అందరూ..  పరువు కోసం జరిగే పోరాటంలో తమిళ బ్రాహ్మణులకు మద్దతుగా నిలవాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొంది.

నవంబర్‌ 3న కస్తూరి తెలుగు వారి గురించి ఇలా వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు  తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్‌ చేసింది. అలా అయితే,  ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. అయితే, ఈ వ్యాఖ్యలు తాను కొందరిని ఉద్దేశించి మాత్రమే చేశానంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తెలుగు ప్రజలందరికి క్షమాపణలు చెబుతూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement