టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ | NATS Board Meeting In Tampa Kickoff Celebrations And Discussion On NATS | Sakshi
Sakshi News home page

టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Published Tue, Nov 5 2024 5:01 PM | Last Updated on Tue, Nov 5 2024 5:04 PM

NATS Board Meeting  In Tampa Kickoff Celebrations And Discussion On NATS

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు వారికి మరింత చేరువయ్యేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిపెట్టింది. టాంపాలో జరిగిన నాట్స్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను వచ్చే ఏడాది జులైలో టాంపాలో నిర్వహించనుంది.

దీనికి సంబంధించిన కార్యచరణ, ప్రణాళికకు సంబంధించి నాట్స్ బోర్డ్ సభ్యులు, నాట్స్ చాప్టర్ విభాగ నాయకులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు.. నిధుల సేకరణ, కార్యక్రమాల నిర్వహణ, స్థానిక తెలుగు సంస్థల సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే నాట్స్ కొత్త చాప్టర్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాట్స్ సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించారు. నాట్స్ జీవిత కాల సభ్యత్వాన్ని ప్రోత్సహించేలా నాట్స్ నాయకులు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. కొత్త చాప్టర్లు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫుడ్ డ్రైవ్, కాపీ విత్ కాప్, హైవే దత్తతలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. టాంపలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ చాప్టర్ నాయకులు తమ వంతు కృషి చేయాలని కోరారు.

 అమెరికాలో జరిగే ఈ అతి పెద్ద తెలుగు పండుగకు చాప్టర్ల నాయకులు తమ ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలను ఆహ్వానించి సంబరాల సంతోషాన్ని పంచుకునే అవకాశాన్ని అందరికి కల్పించాలన్నారు. ఇంకా నాట్స్ బోర్డు సమావేశంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు గంగాధర్ దేసు, మోహనకృష్ణ మన్నవ, బాపు నూతి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజేంద్ర మాదల, నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడితో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

టాంప కన్వన్షన్ సెంటర్‌ను పరిశీలించిన నాట్స్ బృందం
ఔరా అనిపించేలా అమెరికా తెలుగు సంబరాల వేదిక. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి టాంప వేదికగా జులై 4, 5, 6 తేదీల్లో  జరగగున్నాయి. ఈ సంబరాలకు సంబంధించిన వేదికను నాట్స్ జాతీయ నాయకులు, టంపా నాట్స్ విభాగం బృంద సభ్యులు పరిశీలించారు. 

సంబరాలకు వేదిక అద్భుతంగా ఉండాలనే సంకల్పంతో నాట్స్ టంపా విభాగం 6  లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకుంది. హిల్స్‌బరో నది ఒడ్డున అద్భుతమైన ప్రకృతి రమణీయతల మధ్య ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండటం పై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. 

ఈ సెంటర్ పక్కన అతిధ్యానికి తిరుగులేదనిపించేలా ఉన్న హోటల్స్, దగ్గరల్లోనే టూరిజం స్పాట్లు ఉన్నాయని నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. అమెరికాలో ఉండే ప్రతి తెలుగు కుటుంబం సంబరాల్లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా గుత్తికొండ పిలుపునిచ్చారు. సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ సభ్యులందరం కలిసి కృషి చేద్దామని ఆయన కోరారు. హద్దులు లేని ఆనందాల కోసం ఆత్మీయ, అనుబంధాలను పంచుకునేందుకు అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారు తరలిరావాలని శ్రీనివాస్ గుత్తికొండ ఆహ్వానించారు.

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల బృందం ఇదే..!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణలో శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, భాను ధూళిపాళ్ల, రాజేష్ కాండ్రు, జగదీష్ చాపరాల, మాలినీ రెడ్డి, అచ్చిరెడ్డి, ప్రసాద్ ఆరికట్ల, విజయ్ కట్టా, సుధాకర్ మున్నంగి లు సంబరాల వివిధ కమిటీల బాధ్యతలు తీసుకుని సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. 

బిందు బండా, సుమంత్ రామినేని, సురేష్ బుజ్జా, శ్రీనివాస్ బైరెడ్డి, మాధురి గుడ్ల, రవి కానూరి, ప్రసాద్ కొసరాజు, భరత్ ముద్దన, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, కృష్ణ భగవరెడ్డి, శ్యామ్ తంగిరాల, మాలినీ రెడ్డి తంగిరాల, మధు తాతినేని, మాధవి యార్లగడ్డ, రామ కామిశెట్టి, అనిల్ అరమండ, భాస్కర్ సోమంచి, శివ తాళ్లూరి, ప్రసన్న కోట, ప్రహ్లాదుడు మధుసూదుని, శిరీషా దొడ్డపనేని, రవి కానూరు, కిరణ్ పొన్నం, వీర జంపాని, సుధీర్(నాని) వాలంటీర్లు ఈ సంబరాల విజయం కోసం తమ వంతు కృషి చేయనున్నారు.

(చదవండి: టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement