
అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ... లాస్ ఏంజెల్స్‌లో అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఈ సేవా కార్యక్రమాల్ని మరింత విస్త్రుతంగా కొనసాగించేందుకు లాస్ ఏంజెల్స్ నాట్స్ చాప్టర్ తాజాగా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి లాస్ ఏంజెల్స్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు.లాస్ ఏంజెల్స్ చాప్టర్ కో- ఆర్డినేటర్‌గా మనోహర రావు మద్దినేని, జాయింట్ కో-ఆర్డినేటర్‌గా మురళి ముద్దనలు బాధ్యతలు స్వీకరించారు.
స్థానిక నాట్స్ నాయకులు వెంకట్ ఆలపాటి, వంశీ మోహన్ గరికపాటి, నాట్స్ స్పోర్ట్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, ఈవెంట్స్ చైర్ బిందు కామిశెట్టి, హెల్ప్‌లైన్ చైర్ శంకర్ సింగంశెట్టి, స్పోర్ట్స్ చైర్ కిరణ్ ఇమ్మడిశెట్టి, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ అరుణ బోయినేని, మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ చైర్ ప్రభాకర్ రెడ్డి పాతకోట, ఫండ్ రైజింగ్ చైర్ గురు కొంక, కో చైర్స్, వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment