‘‘ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిగారికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు ప్రభాస్.. నా బ్రదర్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. కీరవాణిగారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో మహేశ్‌బాబు–రాజమౌళి సినిమా రాబోతోంది. ఇలా ఎన్నో సాధిస్తున్నాం.
తెలుగు సినిమా 90 సంవత్స రాలు పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ‘మా’ నిధుల సేకరణ కోసం మలే సియాలో ‘నవతిహి ఉత్సవం’కు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉంది’’ అని ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. తెలుగు సినిమా 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు సినిమా చరిత్రను తెలియజేసేలా మలేసియాలో ‘నవతహి ఉత్సవం’ పేరిట ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ను జూలైలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్ణు మంచు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment