120 మంది అనాథలను దత్తత తీసుకున్న మంచు విష్ణు | Manchu Vishnu Adopt 150 Orphans in Tirupati | Sakshi
Sakshi News home page

మంచు విష్ణు గొప్ప మనసు.. 120 మంది చిన్నారుల బాధ్యత తనదేనంటూ..

Published Mon, Jan 13 2025 7:41 PM | Last Updated on Mon, Jan 13 2025 8:31 PM

Manchu Vishnu Adopt 150 Orphans in Tirupati

హీరో మంచు విష్ణు (Manchu Vishnu) గొప్ప మనసు చాటుకున్నాడు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్నాడు. ఒక కుటుంబసభ్యుడిలా వారికి అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానన్నాడు. సంక్రాంతి పండగ సైతం చిన్నారులతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. పిల్లలకు నచ్చిన బొమ్మలు కూడా కొనిపెడతానన్నాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ కుటుంబసభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా..
సాధారణంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేసిన ఓ చిన్న పని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన పనిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పక్కన ఉన్నవాళ్లకు సాయం చేస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలను నేను చూసుకుంటూ ఉంటాను. ఓ రోజు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మాతృశ్య అనాథాశ్రమం నిర్వహిస్తున్న శ్రీదేవి పరిచయమయ్యారు. 

(చదవండి: డాకు మహారాజ్‌లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?)

120 మంది చిన్నారుల బాధ్యత నాదే
ఒకసారి తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. ఏ స్వలాభం లేకుండా సహృదయంతో 120 మందికి పైగా చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది. ఏడాదిన్నర క్రితం ఆ అనాథాశ్రమానికి వెళ్లాను, పిల్లలందర్నీ దత్తత తీసుకుంటానని చెప్పాను. చెప్పిన మాట ప్రకారం చిన్నారులను దత్తత తీసుకున్నాను. వారికి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే పిల్లలందరి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. పండగలకు వారితో కలిసుందామని సంక్రాంతికి ఇక్కడికి వచ్చాను.

బర్త్‌డే రోజు అనవసర ఖర్చులు పక్కన పెట్టండి
వీళ్లంతా నా కుటుంబసభ్యులే.. ఒక అన్నగా, ఇంటిపెద్దగా పిల్లలతో పండగ జరుపుకున్నాను. ఇది మీకూ నచ్చితే ఎవరినైనా దత్తత తీసుకోండి. పుట్టినరోజు అనవసర ఖర్చులు చాలా ఉంటాయి. అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవసరం ఉన్నవారికి సాయపడితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.. కాబట్టి నేను ఇప్పుడు సాయపడగలుగుతున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దవాళ్లయ్యాక.. వారు మిగతావారికి సాయపడాలి. అది ఇప్పటినుంచే నేర్పిస్తున్నాను అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

చదవండి: 50 ఏళ్ల వయసులో హీరోయిన్‌ డేటింగ్‌? నిజమిదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement