Biocon
-
కిరణ్ మజుందార్ షాకు జెంషెడ్జీ టాటా అవార్డు
బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాకు ప్రతిష్టాత్మక జెంషెడ్జీ టాటా అవార్డు లభించింది. దేశంలో బయోసైన్సెస్ ప్రగతికి మార్గదర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది.ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ప్రెసిడెంట్, టీక్యూఎం ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జనక్ కుమార్ మెహతా చేతుల మీదుగా మజుందార్-షా ఈ పురస్కాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్ బి ముత్తురామన్, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్, ఐఎస్‌క్యూ బెంగళూరు చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎన్ సుబ్రమణ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కిరణ్ మజుందార్-షా మాట్లాడుతూ “ఐఎస్‌క్యూ అందిస్తున్న 2024 జంషెడ్జీ టాటా అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది భారతదేశపు గొప్ప దార్శనికుడి పేరుతో ఉంది. ఆయన వారసత్వం, ఆవిష్కరణ, దేశ నిర్మాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అన్నారు.ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళబయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.####Biosciences#QualityExcellence#IndianSocietyForQuality#LifetimeAchievement#Biotechnology#HealthcareInnovation# -
నాడు నమ్మి లోన్ ఇవ్వలేదు.. నేడు రూ.40 వేల కోట్ల కంపెనీ
వ్యాపార రంగంలో రాణించడం అంత సులువు కాదు.. అందునా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా దశాబ్దాల క్రితం దేశంలో ఓ మహిళ వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సాహసమే. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.కిరణ్ మజుందార్ షా కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.విద్య, నేపథ్యంకర్ణాటకలోని బెంగళూరులో 1953 మార్చి 23న జన్మించిన కిరణ్ బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో తన బీఎస్సీ పూర్తి చేశారు. సైన్స్‌పై ఆకాంక్షతో, ఆమె ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మాల్టింగ్ అండ్ బ్రూయింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె భారత్‌కు తిరిగి రావడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు కార్ల్టన్ & యునైటెడ్ బ్రూవరీస్లో ట్రైనీ బ్రూవర్‌గా పనిచేశారు.జాబ్ ఇవ్వని కంపెనీలుభారత్కు తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకోవాలని కిరణ్ భావించారు. అయితే ఆ సమయంలో భారతీయ పరిశ్రమ పురుషులకు ప్రత్యేకమైన వృత్తిగా బ్రూయింగ్ను చూసేది. దీంతో విద్యార్హతలు ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగళూరులోని కంపెనీలు ఆమెకు జాబ్ ఇవ్వకుండా తిరస్కరించాయి.ఇలా ఉండగా ఐరిష్ వ్యాపారవేత్త లెస్ ఆచిన్‌క్లోస్‌ను కలుసుకోవడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించమని కిరణ్ మజుందార్ షాను ఆయన ప్రోత్సహించారు. ప్రారంభంలో సంశయించిన ఆమె ఐర్లాండ్‌లోని బయోకాన్ బయోకెమికల్స్‌లో ఆరు నెలల శిక్షణ కోసం ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఒక వేళ ఆమెకు వ్యాపారం సరిపడకపోతే ఉద్యోగం కల్పించడంలో సహాయం చేస్తానని కూడా ఆచిన్‌క్లోస్ హామీ ఇచ్చారు.రూ.10,000తో బయోకాన్ ప్రారంభం1978లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కిరణ్ బయోకాన్ బయోకెమికల్స్తో భాగస్వామిగా ఉంటూ కేవలం రూ.10,000 పెట్టుబడితో బయోకాన్ ఇండియాను స్థాపించారు. చిన్న గ్యారేజీలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె బొప్పాయి సారం నుండి ఎంజైమ్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్పత్తులు యూఎస్, యూరప్‌లో మార్కెట్‌ను పొందాయి. బయోకాన్‌కు మొదటి విజయం దక్కింది.తరువాత బీర్ వడపోతలో ఉపయోగించే ఐసింగ్లాస్ను తయారు చేయడం ప్రారంభించారు. బయోకాన్ దేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని విలువ రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ.లోన్ ఇవ్వని బ్యాంకులుకిరణ్ తొలిరోజులలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో బయోటెక్నాలజీ భారత్‌లో ఒక నూతన రంగం. ఒక మహిళా వ్యాపారవేత్తగా ఆమె రాణించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పరిశ్రమలో విజయం సాధించగల ఆమె సామర్థ్యాన్ని అనుమానిస్తూ బ్యాంకులు ఆమెకు రుణాలు మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ, ఆమె సంకల్పం, వినూత్న విధానం సందేహాల వ్యక్తం చేసినవారి కళ్లు తెరిపించాయి. -
‘మీ లెక్క తప్పు.. సరిచూసుకోండి’.. ఎన్నికల బాండ్లు.. కిరణ్ మజుందార్‌షా రిప్లై
ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్డు ఇటీవల స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అందులో చాలా కంపెనీలకు చెందిన యాజమాన్యాలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఎలక్టోరల్ బాండ్‌కు సంబంధించి వివిధ సమాచారం వైరల్‌గా మారుతుంది. తాజాగా కిరణ్ మజుందార్‌షా ప్రాతినిధ్యం వహిస్తున్న బయోకాన్ కంపెనీ తరఫున నెలకు రూ.5 కోట్ల చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు ‘ఎస్.’ అనే ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌లు వెలిశాయి. ఈ వ్యవహారం కర్ణాటక ఎన్నికల ముందే జరిగినట్లు అందులో తెలిపారు. వెంటనే దానికి షా ‘అది తప్పు. దయచేసి లెక్కలు సరిచేసుకోండి’ అంటూ బదులిచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కిరణ్షా రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ‘ఇది వాస్తవానికి రూ.6 కోట్లు. మీరు ఆ మొత్తాన్ని ఇతర పద్ధతుల ద్వారా చెల్లించారని భావిస్తే, దయచేసి వాటి వివరాలు చెప్పండి’ అని మరో యూజర్ స్పందించారు. దాంతో తాను ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటానని షా బదులిచ్చారు. మీరు సవరించినట్లు మొత్తం రూ.6కోట్లు బాండ్ల కొనుగోలు చేసినట్లు చెప్పారు. .@kiranshaw donate 5 crore a month before Karnataka elections. pic.twitter.com/Z2JiYfHzbx — S. (@Biryani_) March 14, 2024 బయోకాన్తోపాటు అనేక లిస్టెడ్, అన్‌లిస్టెడ్ హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు బాండ్ల పథకంలో పాల్గొన్నాయి. వీటిలో ప్రముఖ పారాసెటమాల్ బ్రాండ్ డోలో, అరబిందో ఫార్మా, మ్యాన్‌కైండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ హెల్త్‌కేర్, నాట్కో, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, పిరమల్ ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్, లుపిన్, ఇప్కా, అజంతా ఫార్మా ఉన్నాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్స్, హెటెరో బయోఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, మైక్రో ల్యాబ్స్, యూఎస్వీ, భారత్ బయోటెక్, చిరోన్ బెహ్రింగ్, బయోలాజికల్ ఇ, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంస్థలు విరాళాలు ఇచ్చాయి. ఇదీ చదవండి: ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా.. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. -
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్‌ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్‌లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్‌ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
సుందరానికి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ మజుందార్ షా పదవీ విరమణ చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా పేర్కొంది. ఈ నెల 22న పదవీ కాలం ముగిసినట్లు వెల్లడించింది. అయితే నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫారసుమేరకు ఈ 23 నుంచి డి.సుందరంను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ బోర్డులో 2014 నుంచి స్వతంత్ర డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 నుంచి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, సీఎస్ఆర్ కమిటీలకు చైర్‌పర్శన్‌గా వ్యవహరించారు. బోర్డుకు చెందిన రిస్క్ మేనేజ్మెంట్, ఈఎస్జీ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. ఇన్ఫోసిస్ కుటుంబంలో సభ్యులైన కిరణ్ కొన్నేళ్లుగా విలువైన నాయకత్వం, మార్గదర్శకత్వం వహించారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని పేర్కొన్నారు. ఇదేవిధంగా లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఎంపికైన సుందరంకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2017 నుంచి సుందరం ఇన్ఫోసిస్ బోర్డులో కొనసాగుతున్నారు. ఫైనాన్స్, వ్యూహ రచనలో అత్యంత సమర్ధుడైన సుందరం కంపెనీ భవిష్యత్ లక్ష్యాలను నిజం చేయడంలో కీలకంగా నిలవగలరని అభిప్రాయపడ్డారు. ఆయన ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్, వాటాదారుల రిలేషన్షిప్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ తదితర పలు కమిటీలలో సేవలందించనున్నారు. -
బయోకాన్‌లో ‘కోటక్ ఫండ్’ రూ. 1,070 కోట్ల పెట్టుబడి
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో భాగమైన కోటక్ స్పెషల్ సిట్యుయేషన్స్ ఫండ్ (కేఎస్‌ఎస్‌ఎఫ్) తాజాగా బయోకాన్ బయాలాజిక్స్లో రూ. 1,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. బయోసిమిలర్స్ వ్యాపారంలో తమ భాగస్వామి వయాట్రిస్ వాటాలను బయోకాన్ కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ డీల్‌తో తాము మొత్తం 1 బిలియన్ డాలర్ల నిధిని పూర్తిగా ఇన్వెస్ట్ చేసినట్లవుతుందని కేఎస్‌ఎస్‌ఎఫ్ సీఈవో ఈశ్వర్ కర్రా తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాపార విభాగానికి సంబంధించిన పూర్తి ఆదాయాలు బయోకాన్‌కు దఖలుపడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమీకృత బయోసిమిలర్స్ కంపెనీగా ఎదిగేందుకు ఈ కొనుగోలు డీల్ ఉపయోగపడుతుందని వివరించారు. వయాట్రిస్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు బయోకాన్ గతేడాది ప్రకటించింది. -
బయోకాన్ లాభం డౌన్
న్యూఢిల్లీ:హెల్త్‌కేర్ రంగ దిగ్గజం బయోకాన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 188 కోట్లు ఆర్జించింది. వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,840 కోట్ల నుంచి రూ. 2,320 కోట్లకు ఎగసింది. బయోసిమిలర్స్, రీసెర్చ్ సర్వీసులు, జనరిక్స్ బిజినెస్ ఇందుకు సహకరించాయి. అయితే మొత్తం వ్యయాలు 30 శాతం పెరిగి రూ. 2,110 కోట్లను తాకాయి. మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా 25 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,025 కోట్లు), కమర్షియల్ పేపర్(బాండ్లు) ద్వారా మరో 27.5 కోట్ల డాలర్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బయోకాన్ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 284 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
లేడీబాస్.. మెగా డీల్
న్యూఢిల్లీ: లేడీబాస్ కిరన్ మజుందార్‌షా నేృతృత్వంలోని ఔషధాలు, ఆరోగ్య సేవల రంగంలో దూసుకెళ్తోన్న బయోకాన్ భారీ డీల్‌కు తెరలేపింది. యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బయోకాన్ బయోలాజిక్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.25,140 కోట్లు. ఇందులో నగదుతోపాటు బయోకాన్ బయోలాజిక్స్కు చెందిన రూ.7,550 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్‌ను వయాట్రిస్‌కు జారీ చేస్తారు. కంపెనీలో ఇది 12.9 శాతం ఈక్విటీకి సమానం. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డు ఈ లావాదేవీని ఆమోదించింది. 2022 జూలై–డిసెంబర్ మధ్య డీల్ పూర్తి కానుంది. ఒప్పందంలో భాగంగా వయాట్రిస్ అంతర్జాతీయ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని బయోకాన్ బయోలాజిక్స్ దక్కించుకుంటుంది. దానితో పాటు లైసెన్స్ పొందిన బయోసిమిలర్స్ ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా చేజిక్కించుకుంటుంది. రెండేళ్లలో ఐపీవోకు..: ఈ వ్యూహాత్మక కలయిక రెండు భాగస్వాముల పరిపూర్ణమైన సామర్థ్యాలు, బలాలను ఒకచోట చేర్చుతుందని బయోకాన్ బయోలాజిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ సందర్భంగా తెలిపారు. ‘యూఎస్, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మార్కెట్లలో బయోకాన్ బయోలాజిక్స్ ఒక బలమైన వాణిజ్య వేదికను పొందేందుకు, ప్రపంచ బ్రాండ్‌ను నిర్మించేందుకు, సంస్థ ప్రయాణాన్ని వేగిరం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. బయోకాన్ బయోలాజిక్స్ రెండేళ్లలో ఐపీవోకు రానుంది. తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ.60,400 కోట్లకు చేరుతుంది. ఐపీవో చాలా ఆకర్షణీయమైన స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. వాటాదార్లకు భారీగా విలువను సృష్టించబోతోంది. వయాట్రిస్ డీల్‌తో బయోసిమిలర్స్ రంగంలో బయోకాన్ బయోలాజిక్స్ లీడర్‌గా మారడానికి సహాయపడుతుంది. 2020–21లో రూ.2,900 కోట్ల ఆదాయం ఆర్జించాం’ అని వివరించారు. సుమారు రూ.7,550 కోట్లు.. వయాట్రిస్ బయోసిమిలర్స్ ఆదాయం వచ్చే ఏడాది సుమారు రూ.7,550 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డీల్ కారణంగా బయోకాన్ ప్రస్తుత శ్రేణి వాణిజ్యీకరించిన ఇన్సులిన్లు, ఆంకాలజీ, ఇమ్యునాలజీ బయోసిమిలర్స్తోపాటు అభివృద్ధిలో ఉన్న అనేక ఇతర బయోసిమిలర్స్ ఆస్తులతో కూడిన సమగ్ర పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటానికి సాయపడుతుంది. ప్రస్తుతం 20 బయోసిమిలర్స్ పోర్ట్‌ఫోలియోను బయోకాన్ ఖాతాలో ఉంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్‌తో గతంలో ప్రకటించిన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ పోర్ట్‌ఫోలియో సైతం తన ఖాతాకు జోడించింది. అంతర్జాతీయ బయోసిమిలర్స్ రంగంలో ధరల ఒత్తిడిని తగ్గించడంలో ఈ డీల్ సహాయపడుతుందని బయోకాన్ బయాలాజిక్స్ ఎండీ అరుణ్ చందవర్కర్ తెలిపారు. -
Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ..
Kiran Mazumdar Mother Yamini Mazumdar Inspirational Journey In Telugu: యామినీ మజుందార్... ఈ పేరు మనకు పరిచయం లేదు. కానీ ఎప్పుడో విన్న పేరే అనిపిస్తుంది. నిజమే... బయోకాన్ ఫౌండర్, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తల్లి యామినీ ముజుందార్. ఆమె జీవితంలో ఎక్కువ కాలం గృహిణిగానే గడిచిపోయింది. ఎంట్రప్రెన్యూర్‌గా మారాల్సిన అత్యయిక పరిస్థితిని కల్పించింది జీవితం. అది కూడా 58 ఏళ్ల వయసులో. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వయసులో కెరీర్ నిర్మాణం చేసుకున్నారామె. భర్త మరణం తర్వాత తనకంటూ ఒక ఉపాధి మార్గాన్ని ఏర్పరుచుకోవాల్సిన అవసరం అది. పెద్దగా చదువుకున్నది లేదు. కొత్తగా ఏదైనా చేయాలంటే నేర్చుకునే సమయం కూడా ఇవ్వలేదు జీవితం. ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం పెట్టారామె. అదే జీవ్స్ డ్రై క్లీనింగ్ సర్వీస్. పన్నెండు గంటల పని లాండ్రీ బిజినెస్ పెట్టీ పెట్టగానే అంతా సవ్యంగా ఏమీ జరగలేదు. అలాగని ఆమె వెనుకడుగు వేయలేదు. ఆమె లాండ్రీ పెట్టిన 1990లో మనదేశంలో అందుబాటులో లేని హై ఎండ్ ఎక్విప్మెంట్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఐదుగురు ఉద్యోగులతో పని చేయించుకుంటూ ఆమె రోజుకు పన్నెండు గంటలు పనిలోనే ఉండేవారు. అలా ఓ దశాబ్దం పాటు పడిన శ్రమతో అప్పుల నుంచి బయటపడ్డారామె. ‘‘పని లేకుండా నిరుపయోగంగా రోజును గడపడం నాకు నచ్చదు. వయసు ఒక నంబర్ మాత్రమే. పని చేయాలనే సంకల్పం ఉంటే వయసు లెక్క కానే కాదు. ఇప్పటికీ రోజుకు నాలుగు గంటల సేపు లాండ్రీ యూనిట్లో ఉంటాను. నలభై మంది ఉద్యోగులు పని చేస్తున్నారిప్పుడు. కోవిడ్ సమయంలో పనులు ఆపేశాం. ఇప్పుడు అంతా గాడిలో పడినట్లే. అన్నీ యథావిథిగా జరుగుతున్నాయి’’ అంటారు యామినీ మజుందార్. కోవిడ్ కారణంగా యూనిట్ తాత్కాలికంగా పని లేకుండా మూతపడిన సమయంలో కూడా ఉద్యోగులందరికీ జీతంలో ఏ మాత్రం కోత లేకుండా పూర్తి వేతనాన్ని ఇచ్చారామె. చైతన్యమే ఆమె శక్తి యామినీ మజుందార్‌కి ఇప్పుడు తొంభై ఏళ్లు. రోజూ న్యూస్ చూస్తారు. క్రికెట్ మ్యాచ్ వస్తుంటే టీవీ ముందు నుంచి కదలరు. ‘నేను టీవీ చూడాల్సిన పని లేదు. మ్యాచ్‌లో స్కోర్ నుంచి వార్తల వరకు గంటగంట కూ అప్డేట్ ఇస్తుంటుంది అమ్మ’ అని చెబుతారు కిరణ్ మజుందార్ షా. యామినీ మజుందార్ ఎంత చురుగ్గా, చైతన్యవంతంగా జీవిస్తున్నారో చెప్పే మరో సంఘటన మూడేళ్ల కిందట చోటు చేసుకుంది. అది 2018 మే నెల 12వ తేదీ. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల రోజు. యామిని పోలింగ్ బూత్ కెళ్లి వోటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకు గుర్తును చూపిస్తూ ‘వోటు వేయడం నా హక్కు. నా హక్కును వినియోగించుకున్నాను. అది పౌరులుగా మన బాధ్యత. మనం వోటు వేయకపోతే ఇక ప్రజాస్వామ్యానికి, ఎన్నికలకు అర్థం ఏముంటుంది?’ అని వోటు హక్కు వినియోగం గురించిన సందేశం ఇచ్చారు. చదవండి: How To Secure Digital Payment Transactions: రెస్టారెంట్‌కు వెళ్లిన గీతకు షాకిచ్చిన వెయిటర్.. ఏకంగా.. The most precious word in the world is MA. It stands for unlimited love and selflessness. Like me, everyone who loves their mother must support @mafoundationindia and encourage their followers, family & friends to do the same. Click to donate: https://t.co/ryYXsGrTnJ pic.twitter.com/bXUQtHtCAH — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 29, 2021 -
ఐడియాలున్నా ఫండింగ్ లేదు!
ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్‌కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తగ్గిన మొత్తం విలువ సుమారు 2 వేల 60 కోట్ల రూపాయలు! మహిళల స్టార్టప్‌లపై నమ్మకం లేక డబ్బు పెట్టేవాళ్లు ఇలా ముఖం చాటేయవచ్చు కానీ, అవే ముఖాలు ఆశ్చర్యంతో తమ వైపు తిరిగి చూసేలా మహిళలు తమ వ్యాపార దక్షతను చాటుతుండటం విశేషం. ‘బయోకాన్’ సంస్థ ఒక ఆలోచనగా ఆవిర్భవించే నాటికి కిరణ్ మజుందార్ షా వయసు ఇరవై ఐదేళ్లు. అప్పటికే ఆమెకు మంచి ‘బ్య్రూ–మాస్టర్’గా పేరుంది. ‘బయోకాన్’ జీవ ఔషధాల పరిశోధనా సంస్థ కనుక ‘బ్య్రూ–మాస్టర్’గా ఆమెకు ఉన్న అనుభవం తప్పక తోడ్పడుతుంది. అనుభవం సరే. డబ్బు మాటేమిటి? ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఎవరూ రాలేదు! ఒక మహిళ శక్తి సామర్థ్యాలను నమ్మి బయో టెక్నాలజీ రంగంలోని ఒక అంకుర సంస్థకు (టెక్–స్టార్టప్) రుణం ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ఆనాడు తొందరపడలేదు. కిరణ్ మజుందార్ షా కొన్ని మాత్రం ముందుకు వచ్చాయి కానీ, రుణం ఇవ్వడానికి ఆమె తండ్రి ఆమెకు షూరిటీగా ఉండాలన్న షరతు విధించాయి. యునైటెడ్ బ్రూవరీస్లో ఆయన హెడ్ బ్య్రూ–మాస్టర్. తండ్రి చేత సంతకాలు పెట్టించడం కిరణ్ మజుందార్‌కు ఇష్టం లేదు. చివరికి ఓ ‘ఏంజెల్ ఇన్వెస్టర్’ ఆమెకు దొరికారు. అంటే.. బంధువుల్లోనే ఒకరు. అలా బెంగళూరులో బయోకాన్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆ సంస్థ నికర విలువ సుమారు 33 వేల కోట్ల రూపాయలు! ∙∙ గుర్గావ్లోని ప్రసిద్ధ ‘విన్‌గ్రీన్స్ ఫామ్స్’ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం వంద రకాలైన పంటలను పండిస్తుంది. ఆహార, ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాత్సవ. మొదట్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే ఆమెకు కష్టమైపోయింది. పది లక్షల రూపాయల పెట్టుబడితో 2008లో ప్రారంభం అయింది ‘విన్ గ్రీన్స్ ఫామ్స్’. అంజు శ్రీవాత్సవ కిరణ్ మజుందార్లానే అంజు శ్రీవాత్సవ కూడా విన్గ్రీన్స్కు అవసరమైన పెట్టుబడి కోసం తలకు మించిన ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. మహిళ అన్న ఒకే ఒక కారణంగా వెంచర్ క్యాపిటలిస్టులు (డబ్బు పెట్టేవారు) వెనకాడారు. కనీసం ఆమెకు తెలిసినవాళ్లలో ఏంజెల్ ఇన్వెస్టర్లైనా లేరు. తన తిప్పలు తనే పడ్డారు. సంస్థను పైకి తెచ్చారు. పెట్టుబడి డబ్బు కోసం వెళ్లినప్పుడు ఖాళీ చేతులు చూపించిన వారికి ఇప్పుడు ఆమె నెలకు 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపిస్తున్నారు! ∙∙ ‘నిరమయి’ పేరు వినే ఉంటారు. వినూత్న వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు, విధానాల పరిశోధనా సంస్థ. నిరమయి వ్యవస్థాపకురాలు గీతా మంజూనాథ్. సంస్థ బెంగళూరులో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు చేసే మామోగ్రఫీ కన్నా కూడా చౌకగా నిరమయి కనిపెట్టిన వ్యాధి నిర్థారణ విధానం ఆ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సంస్థ ఆవిష్కరణలన్నీ స్వయంగా మంజూనాథ్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. బయోటెక్నాలజీలో 25 ఏళ్ల అనుభవం ఆమెది. అయితే ‘‘మహిళల స్టార్టప్‌లకు అంత తేలిగ్గా ఏమీ ఫండింగ్ దొరకదు’’ అని మంజూనాథ్ అంటారు. నాలుగేళ్ల క్రితమే మొదలైన ‘నిరమయి’.. సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడు కోట్ల రూపాయల రాబడిని పొందుతున్న కంపెనీగా వెంచర్ క్యాపిటలిస్టుల గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది 16 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోగలిగింది. ∙∙ స్టార్టప్‌ను నడపడం బ్రహ్మవిద్యేమీ కాదని మహిళల నేతృత్వంలోని బయోకాన్, విన్‌గ్రీన్స్, నిరమయి వంటి విజయవంతమైన కంపెనీలు నిరూపిస్తున్నప్పటికీ మహిళల స్టార్టప్‌లకు ఫండింగ్ దొరకడం అన్నది మాత్రం ఇప్పటికీ పెద్ద విషయం గానే ఉంది! 2020 తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్ కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిని వదిలేసి చూసినా ఇండియాలో వెంచర్ క్యాపిటలిస్టుల ఫండింగ్‌లో కేవలం 2 శాతం కన్నా తక్కువ మాత్రమే మహిళల స్టార్టప్‌లు పొందగలుగుతున్నాయి. కారణం తెలిసిందే. ఐటీ రంగంలో మహిళల వ్యాపార దక్షతలపై ఇన్వెస్టర్లకు నమ్మకం లేకపోవడమే. మహిళల పేరుపై వ్యక్తిగత ఆస్తులు ఉండకపోవడం కూడా మరొక కారణం. గీతా మంజునాథ్ ‘వెంచర్స్ ఇంటెలిజెన్స్’ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఫండింగ్ ఉన్న మహిళల స్టార్టప్‌లు 2018లో 9.2 రెండు శాతంగా ఉంటే, ఈ ఏడాది నవంబరుకు 14.3 శాతానికి పెరిగాయట! మరి ఈ పెరుగుదల ఎలా సాధ్యం అయింది? ఎలా అంటే.. ఆ స్టార్టప్ ల సహ వ్యవస్థాపకులుగా పురుషులు ఉండటం. పురుషుల భాగస్వామ్యం ఉన్నప్పుడే (తండ్రి గానీ, భర్త గానీ, మరొకరు గానీ) మహిళల స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, వెంచర్ కేపిటలిస్టు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మహిళలకు ఫండింగ్ దొరకపోవడానికి కారణాలను వెతుక్కోవడం కాదు ఇదంతా. ఫండింగ్ లభించకపోయినా మహిళలు వెనకంజ వేయకుండా వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించి చూపుతున్నారని చెప్పడం. -
కరోనా రోగులకు ఆ మందు వాడొచ్చు
ఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులను వాడుతున్నారు. తాజాగా చర్మ సంబంధిత వ్యాధి సోరియాసిస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఇటోలీజుమ్యాబ్ మందును కోవిడ్-19 పేషెంట్లకు వాడవచ్చవంటూ భారత డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ శుక్రవారం అనుమతులిచ్చింది. తీవ్రమైన తీవ్రమైన శ్వాసకోసతో బాధపెడుతున్న కోవిడ్ -19 రోగులకు ఈ మందును ఉపయోగించుకోవచ్చు అంటూ పీటీఐ సంస్థకు శుక్రవారం వెల్లడించింది.(కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) ఇటోలీజుమ్యాబ్ మందును భారత్‌కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. చాలా సంవత్సరాల నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ఈ మందును ఉపయోగిస్తున్నట్లు బయోకాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాతో బాధపడుతున్న రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, ఆ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తరువాత ఇటోలిజుమ్యాబ్కు అనుమతులిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి.జి. సోమయాని స్పందిస్తూ.. బయోకాన్ సంస్థ తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇటోలిజుమాబ్ సోరియాసిస్ సంబంధిత సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్ చికిత్సకు ఉయపయోగిస్తారన్నారు. కోవిడ్-19 చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ మందును పరిగణలోకి తీసుకున్నామన్నారు.(కోవిడ్ కేర్‌ఫుల్ సెంటర్లు) -
బయోకాన్ ప్రమోటర్‌కు విదేశీ అవార్డు
బయోకాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. అందుబాటు ధరల్లో మెడిసిన్స్ అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నందుకు గాను ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్-2020గా ఆమె నిలిచారు. వర్చువల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు కార్యక్రమంలో ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు. 41 దేశాల నుంచి 46 మంది ఎంటర్ప్రెన్యూర్లు పోటీపడగా కిరణ్ మజుందార్ మొదటి స్థానంలో నిలిచి వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్‌గా నిలిచారు. కాగా ఈ అవార్డును అందుకున్న భారతీయులలో కిరణ్ మూడో వ్యక్తి. 2015లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, 2014లో కొటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్లు వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ అవార్డు గెలుచుకున్న మహిళలల్లో కిరణ్ రెండో మహిళా సీఈఓ. గత 30 ఏళ్లుగా బయోకాన్ వృద్ధిని సుస్థిరంగా కొనసాగిస్తూ వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్రవేసిన కిరణ్.. అవార్డు ప్యానెల్ జడ్జీల మనసు గెలుచుకోవడంతో ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఈవై నిర్వాహాకులు వెల్లడించారు. -
నష్టాల మార్కెట్లో బయోకాన్ జోరు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం బయోకాన్ షేరు లాభాలతో కొనసాగుతోంది. మలేషియా ప్లాంట్‌కు సంబంధించి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యుఎస్ఎఫ్డిఎ నుంచి కీలక క్లియరెన్స్ రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 1300 పాయింట్లకుపైగా కుదేలైన దలాల్ స్ట్రీట్ లో బయోకాన్ 5 శాతానికి పైగా ఎగిసింది. మలేషియా ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (ఈఐఆర్) అందుకున్నట్టు బయోకాన్ బుధవారం వెల్లడించింది. ఇన్సులిన్ గ్లార్జిన్ (సెమిగ్లీ) తయారీకి మలేషియాలోని కంపెనీ అనుబంధ సంస్థ బయోకాన్ ఎస్డీఎన్ బీహెచ్ డీ ఈఐఆర్ లభించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 10-21 మధ్య మలేషియా ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించింది. ఇన్సులిన్ గ్లార్జైన్ తయారీలో తమకు ఒదొకముఖ్యమైన మైలురాయి అని కంపెనీ పేర్కొంది. నాణ్యత, సేవల్లో ప్రపంచ ప్రమాణాలకు సంబంధించి బయోకాన్ నిబద్ధతకు ఇది నిదర్శమని వ్యాఖ్యానించింది. తాజా లాభాలతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,462 కోట్లకు చేరింది. -
కిరణ్ షాకు అత్యున్నత పౌర పురస్కారం
సాక్షి, బెంగళూరు: బయోకాన్ వ్యవస్థపాపకురాలు,ఎండీ కిరణ్ మజుందార్-షా తన ఖాతాలో అత్యున్నత అవార్డును జమ చేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ను అందుకున్నారు. ఆస్ట్రేలియా-ఇండియా ద్వైపాక్షిక సంబంధాన్ని అభివృద్ధి చేయడంలో చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా, ముఖ్యంగా వాణిజ్య, విద్యా సంబంధాలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన సేవ చేసినందుకు ఆమెకు అత్యున్నత పౌర గౌరవ అవార్డును అందించడం ఆనందంగా ఉందని ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అరుదైన ఈ గౌరవం దక్కడం తనకెంతో సంతోషంగా వుందని కిరణ్ షా పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, కాంగ్రెస్ నేత ఆర్వి దేశ్‌పాండే, డాక్టర్ దేవి శెట్టి వంట దిగ్గజాల సమక్షంలో కిరణ్ షా ఈ అవార్డును అందుకున్నారు. క్యాన్సర్ పరిశోధన, మహిళా సమస్యలపై కిరణ్ షా ప్రదర్శించిన నిబద్ధతతో పాటు, బెంగళూరు నగరాన్నిజీవించగలిగే నగరంగా ఉండేలా చేయడంలో ఆమె కృషి మనందరికీ తెలుసంటూ ఆస్ట్రేలియా హైకమిషనర్ హరీందర్ సిద్ధూ కిరణ్ షాను ప్రశంసించారు. ప్రపంచంలో విశేషమైన మార్పునకు నాందిపలికిన వ్యక్తులను గుర్తించడం చాలా అద్భుతంగా ఉందన్నారు. కాగా ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ఫిబ్రవరి 14, 1975న ది క్వీన్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో చదివిన కిరణ్ షా ఈ పురస్కారాన్ని స్వీకరించిన భారతీయులోనాల్గవ వారు. మదర్ థెరిసా, మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ గౌరవాన్ని అందుకున్నారు. The Australian Govt. has invested @kiranshaw as an Honorary Member within the #OrderofAustralia (AM) today. Delighted to present this award - Australia’s highest civilian honour - in recognition of her immense contribution in advancing the Australia-India bilateral relationship. pic.twitter.com/x5J6zoHn3G — Harinder Sidhu (@AusHCIndia) January 17, 2020 -
మహిళా లీడర్లు తగినంత మంది దొరకడం లేదు..
ముంబై: జూనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్ప టికీ సారథ్య బాధ్యతలు వహించగలిగే వారిని తగినంత స్థాయిలో దొరకపుచ్చుకోవడం కష్టంగా ఉంటోందని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు. రాబోయే ఐదు, పదేళ్లలో ఈ పరిస్థితి మారి లీడర్లుగా మరింత మంది మహిళలను చూడగలమని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే పరిస్థితులు మారుతున్నాయని, కానీ ఈ వేగం ఆశించినంత స్థాయిలో ఉండటం లేదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మజుందార్ షా పేర్కొన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద హోదాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా కంపెనీల బోర్డుల్లో సంఖ్యాపరంగా మహిళా డైరెక్టర్లు తక్కువగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఐదు రెట్లు పెరిగిన బయోకాన్ లాభం
న్యూఢిల్లీ: బయోకాన్ లాభం సెప్టెంబర్ క్వార్టర్లో ఐదు రెట్లు పెరిగింది. రూ.354 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. ప్రధానంగా అసాధారణంగా వచ్చిన లాభం ఇందుకు కారణం. ఈక్విలియం ఐఎన్సీలో తమ పెట్టుబడుల విలువలో చేసిన మార్పుల వల్ల అసాధారణ లాభం వచ్చినట్టు కంపెనీ తెలిపింది. అసాధారణ లాభం రూ.171 కోట్లను మినహాయించి చూసినా నికర లాభంలో 167 శాతం వృద్ధి నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బయోకాన్ రూ.69 కోట్ల లాభాన్ని గడించింది. కన్సాలిటేడెట్ ఆదాయం రూ.1,019 కోట్ల నుంచి రూ.1,375 కోట్లకు పెరిగింది. బయోలాజిక్స్లోని అన్ని విభాగాల్లో బలమైన పనితీరు చూపించడంతో ఆదాయంలో 35 శాతం వృద్ధిని నమోదు చేశామని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తెలిపారు. తమ భాగస్వామి ఈక్విలియం దాఖలు చేసిన ఐటోలిజుమాబ్ ఐఎన్డీని యూఎస్ఎఫ్డీఏ ఆమోదించడం తమకు ప్రోత్సాహాన్నిచ్చినట్టు షా ఈ సందర్భంగా చెప్పారు. -
హైదరాబాద్‌లో బయోకాన్ కొత్త రీసెర్చ్ సెంటర్
న్యూఢిల్లీ, హైదరాబాద్ : బయోటెక్నాలజీ దిగ్గజం బయోటక్ నగరంలో నూతన యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అంతేకాక ప్రస్తుతమున్న యూనిట్‌ను మరింత విస్తరించనున్నట్టు పేర్కొంది. బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఫార్మా దిగ్గజాలు నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సమావేశ సందర్భంగా బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, జినోమ్ వ్యాలీలో తన నూతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రికి తెలిపారు. తమ అనుబంధ కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా దాదాపు వెయ్యి హైస్కిల్స్ ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు బయోకాన్‌లో సిబ్బందిని రెట్టింపు చేస్తామని కూడా తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి, కిరణ్ మజుందార్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్, ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందని కిరన్ మజుందార్ షా అన్నారు. పారిశ్రామిక వేత్తలకు మంత్రి లాంటి నాయకులను చూసినప్పుడు స్పూర్తి కలుగుతుందని, ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని ప్రశంసలు వర్షం కురిపించారు. హైదరాబాద్ నగరంపైన కూడా కిరణ్ మజుందార్ షా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. వీరితో పాటు జీఈ ప్రెసిడెంట్, సీఈవో టెర్రి బ్రెసెన్హమ్‌తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేయనున్న ఇంక్యూబేటర్లో కూడా జీఈ భాగస్వాములవ్వాలని కోరారు. ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను టెర్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ టాస్క్‌తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్దంగా ఉందని టెర్రి మంత్రికి తెలిపారు. మెర్క్ లైఫ్ సైన్సెస్ సీఈవో ఉదిత్ భాత్రాతో, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతో, థాయ్‌లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యప్రఫసారాతో కూడా మంత్రి సమావేశమయ్యారు. -
బయోకాన్‌కు భారీ షాక్
ముంబై: కొనుగోళ్లతో జోరుగా స్టాక్‌మార్కెట్ లో పార్మా కౌంటర్ నష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా దేశీ ఫార్మా సంస్థ బయోకాన్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బయోకాన్ కేన్సర్ మందు ట్రస్టుజుమాబ్ పై యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఔషధం ఫైలింగ్‌ను ఉపసంహరించుకుందున్న వార్తలతో దాదాపు 8శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నమోదవుతోంది. యూరోపియన్ ఔషధ అథారిటీ(ఈఎంఏ) నుంచి ఇటీవల ట్రస్టుజుమాబ్కు ప్రమాణాలకు తగిన తయారీ(జీఎంపీ) గుర్తింపును పొందినప్పటికీ కంపెనీ అప్లికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించుకుంది. దీనిపై స్పందించిన బయోకాన్ఎండీ కిరణ మజుందార్ షా బయోకాన్ యూరోపియన్ రెగ్యులేటరి అధికారులు ట్రస్టుజుమాబ్, పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ఉత్పత్తులకు ఔషధాలపై పునర్ తనిఖీ కోసం సంస్థకు సమాచారం అందించారని చెప్పారు. అమెరికా రెగ్యులేటరీ యూఎఫ్డీఏకు ఈఎంఏకు చాలా తేడా వుందనీ దీన్ని గమనించాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
బయోకాన్‌కు బోనస్ బూస్ట్
ముంబై: దేశీ ఫార్మా దిగ్గజం బయోకాన్ తాజాగా వాటాదారులకు డివిడెండ్ చెల్లించే యోచనలో ఉంది. దీంతో ఇవాల్టిమార్కెట్లో బయోకాన్ కౌంటర్‌కు డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బయోకాన్ షేరు భారీగా లాభపడింది. 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. 8.45శాతానికిపైగా దూసుకెళ్లి రూ. 1,155వద్ద పాజిటివ్‌గా ఉంది. బయోకాన్ తన వాటాదారులకు బోనస్ జారీ చెల్లించనున్నామని మంగళవారం ప్రకటించింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల స 27న సమావేశంకానున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఇతర ఫార్మా షేర్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి లుపిన్, సన్‌ఫార్మా,డా.రెడ్డీస్, క్యాడిల్లా హెల్త్‌కేర్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
బయోకాన్ నికర లాభం 17 శాతం జంప్
న్యూఢిల్లీ: బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.147 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.126 కోట్లు)తో పోల్చితే 17 శాతం వృద్ధి సాధించామని బయోకాన్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.857 కోట్ల నుంచి రూ.952 కోట్లకు పెరిగిందని తెలిపింది. బయోలాజిక్స్, బ్రాండెడ్ ఫార్ములేషన్స్ తదితర అన్ని విభాగాల్లో మంచి వృద్ధి సాధించిన కారణంగా పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించామని బయోకాన్ చైర్పర్సన్, ఎండీ, కిరణ్ మజుందార్ షా చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేర్ 1.2 శాతం నష్టపోయి రూ.702 వద్ద ముగిసింది. బయోకాన్, మైలాన్ దరఖాస్తు స్వీకరించిన ఈఎంఏ పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ప్రొడక్ట్‌కు చెందిన మైలాన్ మార్కెటింగ్ అథరైజేషన్ అప్లికేషన్ (దరఖాస్తు) సమీక్షకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఆమోదం తెలిపిందని బయోటెక్ దిగ్గజ కంపెనీ ‘బయోకాన్’ పేర్కొంది. ఈ అప్లికేషన్లో ప్రొడక్ట్‌కు సంబంధించిన క్లినికల్, ప్రి-క్లినికల్, అనలిటికల్, ఫంక్షనల్ వంటి తదితర అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ప్రొడక్ట్‌ను క్యాన్సర్ రోగుల కెమియోథెరపీ చికిత్సలోని న్యూట్రోపినియా కాలాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రొడక్ట్‌ను బయోకాన్, మైలాన్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. -
బయోకాన్ లాభం 79% అప్
న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ నికర లాభం(కన్సాలిడేటెడ్)గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 79 శాతం వృద్ధి చెందింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.202 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.361 కోట్లకు పెరిగిందని బయోకాన్ తెలిపింది. అమ్మకాలు జోరుగా ఉండడం, రూ.268 కోట్ల అసాధారణ ఆదాయం కారణంగా నికర లాభం పెరిగిందని కంపెనీ సీఎండీ కిరణ్ మజుందార్ షా చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.830 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17 శాతం పెరిగి రూ.970 కోట్లకు ఎగిశాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బయోకాన్ షేర్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి(రూ.581)ను తాకి చివరకు 1.2 శాతం లాభంతో రూ.571 వద్ద ముగిసింది. -
తయారీపై ప్రభుత్వానివన్నీ పైపై మాటలే!
బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా హైదరాబాద్: తయారీ రంగానికి ఊతమిచ్చే విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ పైపై మాటలుగానే ఉంటున్నాయని బయోకాన్ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. భారత్‌లో సులభతరంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడలేదని, విధానాల్లో స్థిరత్వమూ లేదని ఆమె పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా అని ఊదరగొట్టడం మినహా తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించేలా విధానాలేమీ లేవు. ప్రభుత్వం ఎంతసేపూ సేవల రంగంపైనే దృష్టి పెడుతోంది.. తయారీ రంగం విషయంలో మాత్రం పైపై మాటలే చెబుతోంది. తయారీ రంగం మీద సీరియస్‌గానే ఉన్న పక్షంలో ప్రభుత్వం నిఖార్సుగా ఏదో ఒకటి చేసి చూపించాలి’ అని మజుందార్ షా చెప్పారు. ప్రభుత్వం ప్రధానంగా వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పించడంపైనా, విధానాల్లో అస్పష్టత లేకుండా స్థిరత్వం ఉండేలా చూడటంపైనా దృష్టి సారించాలన్నది తన అభిప్రాయమని వివరించారు. రాబోయే బడ్జెట్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి, విద్య.. వైద్యం.. ఉపాధి కల్పన.. ఇన్ఫ్రా తదితర రంగాలపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టాలని మజుందార్ షా చెప్పారు. -
బయోకాన్ నుంచి హెపైటె టిస్ సి ఔషధం
న్యూఢిల్లీ: హెపటైటిస్ సి చికిత్సలో ఉపయోగించే సిమివిర్-ఎల్‌ను బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ గురువారం ఆవిష్కరించింది. ఇది అమెరికా కంపెని గిలియాడ్ తయారు చేస్తున్న హర్వోనీ ఔషధానికి జనరిక్ వెర్షన్. లెడిపాస్విర్ 90 మి.గ్రా, సొఫోస్బువిర్ 400 మి.గ్రా. కలయికతో కూడిన సిమివిర్-ఎల్‌ను చౌకగా అందిస్తున్నట్లు బయోకాన్ మార్కెటింగ్ విభాగం ప్రెసిడెంట్ రవి లిమాయె తెలిపారు. ఈ కాంబినేషన్‌తో 12 వారాల చికిత్స కోర్సుకు అమెరికాలో 94,500 డాలర్లు (సుమారు రూ. 63 లక్షలు) అవుతుంది. దేశీయంగా దీని ధరను వెల్లడించకపోయినప్పటికీ.. అమెరికాలో ధర కన్నా అత్యంత తక్కువ రేటుకే ఇది లభ్యమవుతుందని లిమాయె వివరించారు. -
బయోకాన్ లాభం రూ. 105 కోట్లు
న్యూఢిల్లీ: బయోటెక్ దిగ్గజం బయోకాన్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 105 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 92 కోట్లతో పోలిస్తే ఇది 14.5% అధికం. ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అమ్మకాలు కూడా రూ. 634 కోట్ల నుంచి రూ. 701 కోట్లకు పెరిగాయి. కంపెనీ చైర్మన్ కిరణ్ మజుందార్ ఫలితాలపై స్పందిస్తూ రీసెర్చ్‌కు సంబంధించి క్యూ3లో పలు మైలురాళ్లను చేరుకున్నామన్నారు. ట్రాస్టుజుమబ్కు డీసీజీఐ అనుమతి లభించడాన్ని ప్రస్తావించారు. దీంతో దేశీయంగా వాణిజ్య ప్రాతిపదికన కాన్‌మాబ్ ఔషధాన్ని విడుదల చేసేందుకు వీలు కలగనున్నట్లు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు దాదాపు 6% పతనమై రూ. 452 వద్ద ముగిసింది. -
రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రొమ్ము కేన్సర్ చికిత్సకు దేశీయ కంపెనీ ఔషధం కూడా అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఔషధ రంగ సంస్థ బయోకాన్ రొమ్ము(స్తన) కేన్సర్ చికిత్స కోసం ‘కాన్‌మాబ్’ అనే సూది మందును ఆవిష్కరించింది. బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ మేరకు శనివారమిక్కడ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాన్‌మాబ్ ఔషధం ఫిబ్రవరి తొలివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ అమెరికా సంస్థ తయారు చేసిన ‘హర్సెప్టిన్’ అనే ఔషధాన్ని దేశంలో వాడుతున్నారు. ఆ మందు ధర రూ.75 వేలు కాగా, కాన్‌మాబ్ ధర 25 శాతం తక్కువ. కాన్‌మాబ్ ఔషధం 150 మిల్లీగ్రాముల మోతాదు ధరను రూ.19,500గా, 440 మిల్లీగ్రాముల ధరను రూ.57,500గా నిర్ణయిం చారు. వ్యాధిస్థాయిని బట్టి.. ఈ ఔషధంతో రెండు నుంచి మూడు నెలల్లో కేన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని షా తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో ఈ ఔషధానికి రూ.130 కోట్ల మేరకు మార్కెట్ ఉంది.