న్యూఢిల్లీ: బయోకాన్ లాభం సెప్టెంబర్ క్వార్టర్లో ఐదు రెట్లు పెరిగింది. రూ.354 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. ప్రధానంగా అసాధారణంగా వచ్చిన లాభం ఇందుకు కారణం. ఈక్విలియం ఐఎన్‌సీలో తమ పెట్టుబడుల విలువలో చేసిన మార్పుల వల్ల అసాధారణ లాభం వచ్చినట్టు కంపెనీ తెలిపింది. అసాధారణ లాభం రూ.171 కోట్లను మినహాయించి చూసినా నికర లాభంలో 167 శాతం వృద్ధి నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బయోకాన్ రూ.69 కోట్ల లాభాన్ని గడించింది.
కన్సాలిటేడెట్ ఆదాయం రూ.1,019 కోట్ల నుంచి రూ.1,375 కోట్లకు పెరిగింది. బయోలాజిక్స్‌లోని అన్ని విభాగాల్లో బలమైన పనితీరు చూపించడంతో ఆదాయంలో 35 శాతం వృద్ధిని నమోదు చేశామని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తెలిపారు. తమ భాగస్వామి ఈక్విలియం దాఖలు చేసిన ఐటోలిజుమాబ్ ఐఎన్‌డీని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదించడం తమకు ప్రోత్సాహాన్నిచ్చినట్టు షా ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment