బయోకాన్‌లో ‘కోటక్‌ ఫండ్‌’ రూ. 1,070 కోట్ల పెట్టుబడి | Kotak fund invests Rs 1070 crore in Biocon | Sakshi
Sakshi News home page

బయోకాన్‌లో ‘కోటక్‌ ఫండ్‌’ రూ. 1,070 కోట్ల పెట్టుబడి

Published Thu, Feb 23 2023 5:50 AM | Last Updated on Thu, Feb 23 2023 5:50 AM

Kotak fund invests Rs 1070 crore in Biocon - Sakshi

ముంబై: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో భాగమైన కోటక్‌ స్పెషల్‌ సిట్యుయేషన్స్‌ ఫండ్‌ (కేఎస్‌ఎస్‌ఎఫ్‌) తాజాగా బయోకాన్‌ బయాలాజిక్స్‌లో రూ. 1,070 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. బయోసిమిలర్స్‌ వ్యాపారంలో తమ భాగస్వామి వయాట్రిస్‌ వాటాలను బయోకాన్‌ కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

ఈ డీల్‌తో తాము మొత్తం 1 బిలియన్‌ డాలర్ల నిధిని పూర్తిగా ఇన్వెస్ట్‌ చేసినట్లవుతుందని కేఎస్‌ఎస్‌ఎఫ్‌ సీఈవో ఈశ్వర్‌ కర్రా తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాపార విభాగానికి సంబంధించిన పూర్తి ఆదాయాలు బయోకాన్‌కు దఖలుపడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమీకృత బయోసిమిలర్స్‌ కంపెనీగా ఎదిగేందుకు ఈ కొనుగోలు డీల్‌ ఉపయోగపడుతుందని వివరించారు. వయాట్రిస్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు బయోకాన్‌ గతేడాది ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement