బయోకాన్ నుంచి హెపైటె టిస్ సి ఔషధం | Biocon shares get a leg up from hepatitis-C drug launch | Sakshi
Sakshi News home page

బయోకాన్ నుంచి హెపైటె టిస్ సి ఔషధం

Published Fri, Dec 25 2015 2:35 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

బయోకాన్ నుంచి హెపైటె టిస్ సి ఔషధం - Sakshi

బయోకాన్ నుంచి హెపైటె టిస్ సి ఔషధం

  న్యూఢిల్లీ: హెపటైటిస్ సి చికిత్సలో ఉపయోగించే సిమివిర్-ఎల్‌ను బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ గురువారం ఆవిష్కరించింది. ఇది అమెరికా కంపెని గిలియాడ్ తయారు చేస్తున్న హర్వోనీ ఔషధానికి జనరిక్ వెర్షన్. లెడిపాస్విర్ 90 మి.గ్రా, సొఫోస్‌బువిర్ 400 మి.గ్రా. కలయికతో కూడిన సిమివిర్-ఎల్‌ను చౌకగా అందిస్తున్నట్లు బయోకాన్ మార్కెటింగ్ విభాగం ప్రెసిడెంట్ రవి లిమాయె తెలిపారు. ఈ కాంబినేషన్‌తో 12 వారాల చికిత్స కోర్సుకు అమెరికాలో 94,500 డాలర్లు (సుమారు రూ. 63 లక్షలు) అవుతుంది. దేశీయంగా దీని ధరను వెల్లడించకపోయినప్పటికీ.. అమెరికాలో ధర కన్నా అత్యంత తక్కువ రేటుకే ఇది లభ్యమవుతుందని లిమాయె వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement