ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్డు ఇటీవల స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేసింది. అందులో చాలా కంపెనీలకు చెందిన యాజమాన్యాలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఎలక్టోరల్ బాండ్‌కు సంబంధించి వివిధ సమాచారం వైరల్‌గా మారుతుంది.
తాజాగా కిరణ్ మజుందార్‌షా ప్రాతినిధ్యం వహిస్తున్న బయోకాన్ కంపెనీ తరఫున నెలకు రూ.5 కోట్ల చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు ‘ఎస్.’ అనే ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌లు వెలిశాయి. ఈ వ్యవహారం కర్ణాటక ఎన్నికల ముందే జరిగినట్లు అందులో తెలిపారు. వెంటనే దానికి షా ‘అది తప్పు. దయచేసి లెక్కలు సరిచేసుకోండి’ అంటూ బదులిచ్చారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కిరణ్‌షా రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది. ‘ఇది వాస్తవానికి రూ.6 కోట్లు. మీరు ఆ మొత్తాన్ని ఇతర పద్ధతుల ద్వారా చెల్లించారని భావిస్తే, దయచేసి వాటి వివరాలు చెప్పండి’ అని మరో యూజర్ స్పందించారు. దాంతో తాను ఎల్లప్పుడూ పారదర్శకంగా ఉంటానని షా బదులిచ్చారు. మీరు సవరించినట్లు మొత్తం రూ.6కోట్లు బాండ్ల కొనుగోలు చేసినట్లు చెప్పారు.
.@kiranshaw donate 5 crore a month before Karnataka elections. pic.twitter.com/Z2JiYfHzbx
— S. (@Biryani_) March 14, 2024
బయోకాన్‌తోపాటు అనేక లిస్టెడ్, అన్‌లిస్టెడ్ హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు బాండ్ల పథకంలో పాల్గొన్నాయి. వీటిలో ప్రముఖ పారాసెటమాల్ బ్రాండ్ డోలో, అరబిందో ఫార్మా, మ్యాన్‌కైండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జైడస్ హెల్త్‌కేర్, నాట్కో, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, పిరమల్ ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్, లుపిన్, ఇప్కా, అజంతా ఫార్మా ఉన్నాయి.
అన్‌లిస్టెడ్ కంపెనీల్లో హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్స్, హెటెరో బయోఫార్మా, ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్, మైక్రో ల్యాబ్స్, యూఎస్‌వీ, భారత్ బయోటెక్, చిరోన్ బెహ్రింగ్, బయోలాజికల్ ఇ, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంస్థలు విరాళాలు ఇచ్చాయి.
ఇదీ చదవండి: ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..
కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని సుప్రీం తన తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment