బయోకాన్ గ్రూప్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షాకు ప్రతిష్టాత్మక జెంషెడ్‌జీ టాటా అవార్డు లభించింది. దేశంలో బయోసైన్సెస్ ప్రగతికి మార్గదర్శకత్వం వహించి ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ప్రెసిడెంట్, టీక్యూఎం ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జనక్ కుమార్ మెహతా చేతుల మీదుగా మజుందార్-షా ఈ పురస్కాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్ బి ముత్తురామన్, ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్, ఐఎస్‌క్యూ బెంగళూరు చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎన్ సుబ్రమణ్య పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ మజుందార్-షా మాట్లాడుతూ “ఐఎస్‌క్యూ అందిస్తున్న 2024 జంషెడ్‌జీ టాటా అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది భారతదేశపు గొప్ప దార్శనికుడి పేరుతో ఉంది. ఆయన వారసత్వం, ఆవిష్కరణ, దేశ నిర్మాణం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అన్నారు.
ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళ
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.
#
#
#
#Biosciences
#QualityExcellence
#IndianSocietyForQuality
#LifetimeAchievement
#Biotechnology
#HealthcareInnovation
#
Comments
Please login to add a commentAdd a comment