వ్యాపారం ఏదైనా. దేవుడు అతడే
Gandhi Jayanti Special Story: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మోనన్దాస్ కరమ్‌చంద్ గాంధీజీ నేరుగా ఎక్కడ వ్యాపారం చేయలేదు. కానీ వ్యాపారానికి సంబంధించి మహాత్ముడు చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న ఓ చిన్న సలహా వెలకట్టలేనిదిగా నిలిచింది. బాపు చూపిన బాటలో నడిచిన బిల్‌గేట్స్, జెఫ్ బేజోస్, స్టీవ్ జాబ్స్లు సక్సెస్ అయ్యారు.
బ్రిటీషర్ల వల్లే
పారిశ్రామీకరణలో భాగంగా ఇంగ్లండ్‌లో తయారయ్యే వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో బ్రిటీషర్లు మార్కెట్ చేసేవారు. వాళ్ల వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుంటున్నప్పటికీ వినియోగదారులైన ఆయా దేశాల ప్రజలకు సరైన మర్యాద గుర్తింపు ఇచ్చే వారు కాదు. కస్టమర్లను హీనంగా చూసేవారు. అధికార బలంతో, ఆయుధ బలంతో వస్తువులు అమ్ముకునేవారు.
ఆ ఘటనతో
గాంధీజీ బారిస్టర్ పూర్తి చేసిన తర్వాత సౌతాఫ్రికాలో లాయర్‌గా ప్రాక్టీస్ చేసేవారు. ఈ సందర్భంగా ఓ సారి రైలులో ప్రయాణిస్తున్న గాంధీజీని మార్గమధ్యంలో పీట్స్‌బర్గ్ రైల్వే స్టేషన్లో దించేశారు. దీంతో ఆయన సౌతాఫ్రికాలో ఆత్మగౌరవ పోరాటం మొదలు పెట్టి, మన దేశానికి బ్రిటీషర్ల నుంచి స్వాతంత్రం సాధించి పెట్టారు. ఈ పోరాటంలో భాగంగా గాంధీజి తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను జాగృతం చేసేవారు.
అతనే దేవుడు
1980లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులపట్ల వ్యాపారులు ఎలా మెలగాలో గాంధీజి ప్రత్యేకంగా వివరించారు... ‘ మన ప్రాంగణంలో కస్టమర్ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అతను మనపై ఆధారపడి లేడు. మనమే అతనిపై అధారపడి ఉన్నాం. అతను మన పనిని ఆటంకపరిచే వ్యక్తి కాదు. మనం ఉన్నదే అతని కోసం. కస్టమర్ మన వ్యాపారానికి అవతలి వ్యక్తి కాదు. మన వ్యాపారంలో కీలక వ్యక్తి వినియోగదారుడు. అతనికి అవసరమైన వస్తువులు అందించి మనం అతనికి సేవ చేయడం లేదు. మన దగ్గర వస్తువులు కొనుగోలు చేసి అతనే మనకు సేవ చేస్తున్నాడు. అందువల్ల కస్టమరే మన దేవుడు’ అంటూ గాంధీజీ ప్రసంగించారు.
ఆ సూక్తే ఆదర్శం
19వ శతాబ్ధంలో గాంధీజీ చెప్పిన కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అనే సూక్తి ఇప్పటికీ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టులతో పాటు అనేక వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడయితే ప్రత్యేకంగా కస్టమర్ కేర్ సెంటర్లు కూడా వచ్చాయి. వినియోగదారుడికి మర్యాద ఇచ్చి అతని మన్నన పొందిన ఎంతో మంది ఎంట్రప్యూనర్లు వ్యాపారంలో ఎంతోపైకి ఎదిగారు. మహాత్ముడు చూపిన బాటలోనే వినియోగదారుడి పట్ల ఎలా ప్రవర్తించాలనే అంశాలపై తమదైన అనుభవాలను భావి తరాలకు అందించారు.
బాపు చూపిన బాటలో
- మీ ప్రొడక్టు పట్ల అత్యంత అసంతృప్తితో ఉన్న కస్టమర్ దగ్గరే మీరు ఆ ప్రొడక్టుకు సంబంధించి అనేక విషయాలు నేర్చుకోగలుతారు అంటూ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. అందువల్లే మైక్రోసాఫ్ట్‌ని లోపరహితంగా నడిపేందుకు ప్రయత్నిస్తారు. విండోస్ ఫోన్ పట్ల వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసన వెంటనే ఆ ఫోన్ల తయారీని ఆపేశారు. లోపరహితంగా మళ్లీ మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
- మన ఇంట్లో ఇచ్చే ఒక పార్టీకి వచ్చిన అతిథి లాంటి వ్యక్తి కస్టమర్. అతనికేం కావాలో మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అతన్ని కంఫర్ట్‌గా ఉంచాలి అనే వ్యాపార సూత్రాన్ని అనుసరించారు అమెజాన్ ఫౌండర జెఫ్ బేజోస్. అంత మర్యాద ఇచ్చారు కాబట్టే ముఖ పరిచయం లేకుండానే ఈ కామర్స్ రంగాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. సామాన్యుల నమ్మకాన్ని చూరగొన్నారు. తిరుగులేని వ్యాపారవేత్తగా నిలిచారు.
- ఏ కంపెనీ వెళ్లనంత దగ్గరగా కస్టమర్ దగ్గరకి వెళ్లండి. ఎంత దగ్గరగా అంటే అతనికే ఏం కావాలో వారు గుర్తించేలోగా మీర అది ఇచ్చేంతంగా అంటూ చెప్పారు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. ఆయన మాటలకు తగ్గట్టే యాపిల్ ఫోన్ తెచ్చి వినియోగదారులను ఆశ్చర్యపరిచారు.
- క్లిక్జ్ డాట్‌కామ్ కో ఫౌండర్, రచయిత అన్ హాండ్లే అభిప్రాయం ప్రకారం ఎంట్రప్యూనర్ రాసే కథలో హీరో కస్టమరే. ఆ సూత్రానికి కట్టుబడే ఆమె వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు.
- ప్రముఖ రచయిత సెథ్ గోడిన్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తుల కోసం కస్టమర్లను వెతకొద్దు.. కస్టమర్లకు ఏం కావాలో చూసి అవే ఉత్పత్తి చేయాలని చెబుతారు.
చదవండి : Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు