రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం | Biocon launches cheaper breast cancer drug | Sakshi
Sakshi News home page

రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం

Published Sun, Jan 19 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం

రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రొమ్ము కేన్సర్ చికిత్సకు దేశీయ కంపెనీ ఔషధం కూడా అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఔషధ రంగ సంస్థ బయోకాన్ రొమ్ము(స్తన) కేన్సర్ చికిత్స కోసం ‘కాన్‌మాబ్’ అనే సూది మందును ఆవిష్కరించింది. బయోకాన్ ఎండీ, చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ మేరకు శనివారమిక్కడ విలేకరులకు వివరాలు వెల్లడించారు.

 కాన్‌మాబ్ ఔషధం ఫిబ్రవరి తొలివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ అమెరికా సంస్థ తయారు చేసిన ‘హర్‌సెప్టిన్’ అనే ఔషధాన్ని దేశంలో వాడుతున్నారు. ఆ మందు ధర రూ.75 వేలు కాగా, కాన్‌మాబ్ ధర 25 శాతం తక్కువ. కాన్‌మాబ్ ఔషధం 150 మిల్లీగ్రాముల మోతాదు ధరను రూ.19,500గా, 440 మిల్లీగ్రాముల ధరను రూ.57,500గా నిర్ణయిం చారు.

వ్యాధిస్థాయిని బట్టి.. ఈ ఔషధంతో రెండు నుంచి మూడు నెలల్లో కేన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని షా తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో ఈ ఔషధానికి రూ.130 కోట్ల మేరకు మార్కెట్ ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement