Biotechnology
-
బయోఎకానమీ విలువ జూమ్
దేశీయంగా బయోఎకానమీ గతకొన్నేళ్లలో భారీగా పురోగమించినట్లు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బైరాక్) తాజా నివేదిక పేర్కొంది. దీంతో 2023 చివరికల్లా దేశీ బయోఎకానమీ విలువ 151 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 12,66,900 కోట్లు)కు చేరుకున్నట్లు తెలియజేసింది. జాతీయ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించినట్లు ప్రస్తావిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)లో4.25 శాతం వాటా సమకూర్చుతున్నట్లు వివరించింది. దీంతో ప్రపంచంలోని టాప్–5 బయోఎకానమీలలో భారత్ ఒకటిగా అవతరించినట్లు నివేదిక పేర్కొంది. బయోటెక్నాలజీ ఆధారిత ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(ఏబీఎల్‌ఈ) సహకారంతో బైరాక్(బీఐఆర్ఏసీ) రూపొందించిన నివేదికను గ్లోబల్ బయోఇండియా 2024 సదస్సు( 4వ ఎడిషన్)లో విడుదల చేసింది. నివేదిక వివరాలు చూద్దాం..వృద్ధికి దన్నుఇలా బయోఎకానమీ వృద్ధికి బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇన్నొవేషన్, హెల్త్‌కేర్, బయోమ్యాన్యుఫాక్చరింగ్ తదితరాలలో ఆధునిక పరివర్తన వంటి అంశాలు తోడ్పాటునిచ్చాయి. ఈ నేపథ్యంలో 2014కల్లా 10 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేసిన దేశీ బయోఎకానమీ 2023 చివరికల్లా 151 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఈ పురోగతి జాతీయాభివృద్ధిలో కీలకపాత్రను పోషించింది. దేశ జీడీపీలో 4.25 శాతం వాటాను సమకూరుస్తోంది. గ్లోబల్ బయోఎకానమీల టాప్–5 జాబితాలో భారత్‌కు చోటు కల్పించింది. బయోఈ3(ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉద్యోగితలకు బయోటెక్నాలజీ) పాలసీ ప్రధానంగా ఇందుకు తోడ్పాటునిచి్చంది. బయో ఆధారిత రసాయనాలు, ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్, వాతావరణానుకూల వ్యవసాయం, సముద్రం, అంతరిక్ష సాంకేతికతలలో ఆధునిక పరిశోధనలపై ప్రధానంగా పాలసీ దృష్టిపెట్టింది. వ్యాక్సిన్లు, బయోఫార్మాస్యూటికల్స్కు పెరుగుతున్న డిమాండ్ దేశీ బయోఎకానమీ వృద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు డీబీటీ సెక్రటరీ, బైరాక్ చైర్మన్, డీజీ–బ్రిక్ రాజేష్ ఎస్.గోఖలే పేర్కొన్నారు. కొత్త బయోఈ3 పాలసీ ద్వారా ఈ పరిస్థితులకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. వెరసి 2030కల్లా దేశీ బయోఎకానమీ విలువ 300 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. బయోమ్యాన్యుఫాక్చరింగ్లో ఏఐ వినియోగాన్ని బలపరచడంతోపాటు.. బయో ఏఐ కేంద్రాల ఏర్పాటుకు తెరతీయవలసి ఉన్నట్లు తాజా నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం..ఉపాధి అవకాశాలు ఏఐ వినియోగం, ఆధునిక తయారీ తదితరాల ద్వారా బయోఎకానమీని మరింత పరుగు పెట్టించడంతో ఉద్యోగ అవకాశాలు ఊపందుకుంటాయి. వివిధ పరిశ్రమలలలో బయోటెక్నాలజీని మిళితం చేయడం ద్వారా ప్రధానంగా టైర్–2, టైర్–3 నగరాలలో ఉపాధికి ఊతం లభిస్తుంది. బయోఇండ్రస్టియల్ రంగం దేశీ బయోఎకానమీలో అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. మొత్తం మార్కెట్ విలువలో 48 శాతం అంటే దాదాపు 73 బిలియన్ డాలర్ల విలువను ఆక్రమిస్తోంది. బయోఇంధనాలు, బయోప్లాస్టిక్స్సహా.. టెక్స్టైల్స్, డిటర్జెంట్స్ పరిశ్రమలలో వినియోగించే ఎంజైమాటిక్ అప్లికేషన్లు ఈ విభాగంలోకి చేరతాయి. వీటిలో బయోఇంధనాలు భారీ వృద్ధిని సాధిస్తున్నాయి. 2023కల్లా ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 13.8 బిలియన్ లీటర్లకు చేరింది. దీంతో భారత్ ప్రపంచంలోనే ఇథనాల్ తయారీకి మూడో పెద్ద దేశంగా ఆవిర్భవించింది. ఇక బయోఫార్మా రంగం సైతం బయోఎకానమీలో 36 శాతం వాటాను ఆక్రమిస్తోంది. విలువ దాదాపు 54 బిలియన్ డాలర్లుకాగా.. దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం ప్రపంచంలోనే నాయకత్వస్థాయిలో కొనసాగుతోంది. -
మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!
పూలు ఘుమఘుమలాడటం సహజం. మరి పూలకు మిలమిలలు ఎక్కడివని కోప్పడిపోకండి. రాత్రివేళ మిణుగురుల్లా మిలమిల మెరిసే పూలను ఒక శాస్త్రవేత్త సృష్టించాడు. అమెరికా ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిటూనియా మొక్కలకు జన్యుమార్పిడి చేసి, పిటూనియా పూలు మిణుగురుల్లా మిలమిలలాడేలా చేశాడు.అమెరికన్ కంపెనీ ‘లైట్ బయో’లో పనిచేస్తున్న డాక్టర్ కీత్ వుడ్ అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని సాధించాడు. మాలిక్యులర్ అండ్ కెమికల్ బయాలజీలో విస్తృత పరిశోధనలు సాగిస్తున్న డాక్టర్ కీత్ వుడ్, తొలుత పొగాకు మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టాడు. పొగాకు మొక్క చిన్నది కావడంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. తర్వాత పీటూనియా మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టి, అద్భుత ఫలితాలను సాధించాడు. పీటూనియా మొక్క ఎదిగిన తర్వాత దానికి పూసే పూలు రాత్రివేళ అచ్చంగా మిణుగురుల్లా మిలమిలలాడుతూ కనిపించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘లైట్ బయో’ కంపెనీ పెరటి తోటల్లో పెంచుకునేందుకు వీలుగా రాత్రివేళ మిలమిల వెలుగులు వెదజల్లే పీటూనియా మొక్కలకు ‘ఫైర్ ఫ్లై పీటూనియా’గా నామకరణం చేసి, వాటిని అమ్మడం ప్రారంభించింది. అమెరికన్ జనాలు ఈ మిణుగురు పూలమొక్కలను ఎగబడి మరీ కొంటున్నారు. (చదవండి: చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!) -
బయోటెక్నాలజీలో సాంకేతికతకు కీలక పాత్ర
న్యూఢిల్లీ: భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగ వృద్ధిలోనూ, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలోనూ సాంకేతికత చాలా కీలక పాత్ర పోషించగలదని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. నియంత్రణ ప్రక్రియలను సంస్కరించేందుకు, నూతన ఔషధాలను చాలా తక్కువ వ్యవధిలోనే మార్కెట్‌కు చేర్చేందుకు, వివిధ రంగాల్లో టెక్నాలజీని మరింత సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఒక ఐడియా అత్యంత తక్కువ సమయంలో, ఏడాది వ్యవధిలోనే ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు చేరగలిగితే బాగుంటుందని, ఇందుకోసం మన నియంత్రణ ప్రక్రియలను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని మజుందార్–షా చెప్పారు. దీనికోసం జనరేటివ్ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటా ఆనలిటిక్స్ మొదలైనవి ఉపయోగపడగలవని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా ఉత్పత్తులను ఆమోదించడానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నియంత్రణ సంస్థలు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంటాయని మజుందార్–షా తెలిపారు. నియంత్రణ అధికారులకు టెక్నికల్ నైపుణ్యాలు ఉండి, టెక్నాలజీపై అవగాహన ఉంటేనే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. -
పెట్టుబడులు ఆకర్షించేలా వసతుల కల్పన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాలతోపాటు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా చేపట్టిన మౌలిక వసతుల కల్పన ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనం కోసం మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చింది. శనివారం వారు టీ–హబ్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సదుపాయాల కారణంగానే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ వరుసగా రెండేళ్లు దాటేసిందన్నారు. ఐటీ ఎగుమతులతోపాటు ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామన్నారు. టీఎస్–బీ పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై ఒక్కరోజే 7 జీవోలను జారీ చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాయన్నారు. అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుందని అంటున్నారని చెప్పారు. మహారాష్ట్రతో అనుబంధం వీడనిది విద్యార్థిగా పుణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చరిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ, మహారాష్ట్ర మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ముంబై తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి: మహారాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ గత పదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని మహారాష్ట్ర ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి తమకు గుర్తుందని, పాలకులకు సరైన విజన్ ఉంటే అభివృద్ధి చెందుతుందనడానికి హైదరాబాద్ నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు. -
సేద్య కళ
చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్స్ చేసే యువత గురించి మనకు తెలుసు. అలాగే, చదువుకుంటూనే తమ అభిరుచులకు పదును పెట్టుకునేవారినీ మనం చూస్తుంటాం. అయితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం, పెన్న బద్వేల్‌వాసి అయిన చాట్ల అఖిల మాత్రం హాస్టల్లో ఉండి బయోటెక్నాలజీలో డిగ్రీ చేస్తూనే, ఖాళీ సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తనకున్న ఇష్టం వల్ల సేద్యంలో రకరకాల ప్రయోగాలు సొంతంగా చేయగలుగుతున్నాను అని చెబుతున్న అఖిల తన కలనే కాదు కళను కూడా పండిస్తోంది. ‘‘మాది వ్యవసాయ కుటుంబం అవడంతో చిన్నప్పటి నుంచి ఇంటి పనులతో పా టు పొలం పనులు కూడా తెలుసు. అమ్మ పద్మ, నాన్న గురువయ్య. అమ్మానాన్నలకు అన్న, నేను సంతానం. డిగ్రీ మూడవ సంవత్సరం నెల్లూరు టౌన్లోనే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు నేనుగా స్థిరపడాలంటే ఏది ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా ఆలోచించాను. కరోనా కాలంలో రెండేళ్లు ఇంటి వద్దే ఉన్నప్పుడు ఎక్కువ సమయం పొలంలోనే గడిపేదాన్ని. అలా వ్యవసాయంలోని కష్టం, ఇష్టం రెండూ అలవాటయ్యాయి. అయితే, ఊళ్లో వ్యవసాయం చేస్తూ, కాలేజీకి వెళ్లి చదువుకోలేను. ఇంటి వద్దే ఉండి నాకు నచ్చిన రీతిలో వ్యవసాయం చేయాలంటే అందుకు అమ్మానాన్నలను ఒప్పించడం కష్టమనుకున్నాను. ‘చదువుకుంటున్నావు కదా ఎందుకింత కష్టం’ అంటారు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండానే ఎక్కడైనా కొంత భూమి కౌలుకు తీసుకోవాలని వ్యవసాయం చేయాలని, కరోనా టైమ్‌లోనే తెలిసివారి ద్వారా చాలా వెతికాను. సాగులో లేని భూమి.. నేనున్న హాస్టల్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపా డులో ఒక ఎన్ఆర్ఐ భూమి ఉందని తెలిసింది. వారి వివరాలు కనుక్కొని, ఫోన్లో సంప్రదించి, రెండెకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. అది ఏ మాత్రం సాగులో లేని భూమి. అందుకు చాలా కష్టపడాలి. మొదట కష్టమవుతుందేమో అనుకున్నాను. కానీ, ఇష్టమైన పని కావడంతో సాగు చేయాలనే నిశ్చయించుకున్నాను. మట్టితో పిచికారి భూమిని చదును చేయించాను. ఆకు కూరలు, కూరగాయల సాగు చేస్తున్నాను. సాగులో వచ్చే ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు వెదుక్కుంటూ నా ఎఫర్ట్‌ను పెడుతున్నాను. ఓ వయసుపైబడిన వ్యక్తి ఉంటే, అతనికి అవసరాలకు డబ్బు ఇచ్చి పొలానికి కాపలాకు పెట్టాను. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు ఈ పనికి ఎంచుకున్నాను. ఉదయం ఫార్మ్ దగ్గరకు వెళతాను. సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. మొక్కల ఏపుగా పెరగడానికి మట్టి ద్రావకంతో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. పెన్నానది పక్కన ఉండటంతో అక్కణ్ణుంచి మోటార్ ద్వారా నీటి సదుపా యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. తక్కువ పెట్టుబడితో.. ఇప్పుడు పా లకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బెండ, చిక్కుడు, స్వీట్‌కార్న్, వంగ, దోస, సొరకాయ వంటివి సాగుచేస్తున్నాను. ఆకుకూరలు 15 రోజులకొకసారి కోతకు వస్తాయి. వీటన్నింటిని వాతావరణం బట్టి నా పనిలో మార్పులు చేసుకుంటాను. తెలిసినవాళ్లే వాటిని స్వయంగా వచ్చి తీసుకెళుతుంటారు. భూమిని చదును చేయించడానికి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టాను. అన్ని ఖర్చులు పోను రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. అయితే, ఈ మొత్తాన్ని కూడా భూమిలో సేంద్రీయ పద్ధతులను అమలు చేయడానికి ఖర్చు పెడుతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి సరదాగా వర్క్ చేస్తుంటారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్నానని ఎవరికైనా చెబితే ‘చదువుకుంటున్నావు కదా, ఆడపిల్లవు కదా! ఎందుకంత కష్టం, ఇంకేం పని దొరకలేదా’ అని నవ్వుతున్నారు. అందుకే ఎవరికీ చెప్పడం లేదు. ఇంకొంత భూమి తీసుకుని సాగు చేయాలనేది తర్వాతి ప్లాన్. ‘మా భూమిలో కూడా ఇలా మట్టిని కాపా డుతూ సేద్యం చేయండి..’ అని అడిగేవాళ్లున్నారు. ఏషియన్, మిల్లెట్ ఫార్మింగ్‌ను పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది’’ అని వివరించింది అఖిల. – నిర్మలారెడ్డి -
చైనా చిల్లర బుద్ధి, అప్పుడు బయోవార్‌తో కరోనా..ఇప్పుడు బయోటెక్నాలజీతో..
'కృత్రిమ సూర్యుడిని' సృష్టించడం. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ..కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో ఆలీబాబా అధినేత జాక్ మా రెక్కలు కత్తిరించడం. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. మిత్ర దేశాలకు చెందిన భూ భాగాల్ని అప్పనంగా ఆక్రమించుకునేందుకు తన దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఇరుదేశాల సైనికులపై దొంగదెబ్బ తీయడం. ప్రపంచ దేశాల్ని శాసించేందుకు కోవిడ్ వైరస్ వ్యాప్తితో చైనా బయోవార్‌ను సృష్టించడంలాంటి దుర్బుద్ది పనులు చేయడం చైనాకే చెల్లించింది. ఇప్పుడు అదే డ్రాగన్ కంట్రీ బయోటెక్నాలజీతో పేరుతో 'ఎదిరించాలనే శత్రువు సంకల్పాన్ని విచ్ఛిన్నం చేసే' మైండ్ కంట్రోల్ వెపన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తేలింది. చైనా చేస్తున్న కుటిల ప్రయత్నాల్ని నిలువరించేందుకు ఆదేశాన్ని మిత్ర దేశాలు దూరం పెడుతున్నాయి. అయినా చైనా తన చిల్లర బుద్ది పోనిచ్చుకోవడం లేదు. మిత్ర దేశాల్ని, వారి సైనికుల్ని నిలువరించేలా కుటిల ప్రయత్నాలు చేస్తుంది. వాషింగ్టన్ టైమ్స్ ప్రకారం..చైనా ప్రస్తుతం'బయోటెక్నాలజీ'గా పిలువబడే మైండ్ కంట్రోల్ వెపన్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపింది. వాషింగ్టన్ టైమ్స్ 2019కి చెందిన చైనా సైనిక విభాగానికి చెందిన రహస్య పత్రాలను సేకరించింది. వాటిలో ఈ బయోటెక్నాలజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రహస్య పత్రాల్లో..సాంప్రదాయ పద్దతుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగే భౌతిక తరహ దాడులు కాకుండా చైనా కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ప్రత్యర్ధి దేశాల సైనికులపై దాడిచేయాల్సి వస్తే మారణాయుధాలతో కాకుండా కొత్త బయోటెక్నాలజీని ఉపయోగించి సైనికుల మైండ్ కంట్రోల్ చేయడం, దాడి చేయాలని ఆలోచనల్ని నియంత్రించడంపై చైనా ప్రభుత్వం పనిచేస్తుంది. అమెరికా రహస్యాలను చైనా దొంగిలిస్తున్నదా? బయోటెక్నాలజీ వంటి కీలక రంగాలపై పట్టు సాధించేలా అమెరికా టెక్నాలజీని సొంతం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవల అమెరికా గుర్తించింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం సైతం..చైనా అధికార పార్టీ 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)' జన్యు సవరణ, మానవ పనితీరు మెరుగుదల, డైరక్ట్ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్తో కంప్యూటర్ లేదా రోబోటిక్ ఆర్మ్ వంటి హార్డ్వేర్లను నియంత్రించడం( బ్రెయిన్ కంట్రోల్ ఇంటర్ ఫేస్) వంటి టెక్నాలజీలను అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన కథనంలో ప్రస్తావించింది. చైనాకు చెక్ పెడుతున్న అమెరికా ఈ ప్రమాదకరమైన టెక్నాలజీని చైనా అభివృద్ధి చేస్తుండగా..గతవారం అమెరికా వాణిజ్య విభాగం 12 చైనీస్ ఇన్స్టిట్యూట్లతో పాటు పలు సంస్థల్ని బ్లాక్ చేసింది. వాటిలో బీజింగ్స్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఉంది. అలా బ్లాక్ చేయడం వల్ల..అమెరికన్ కంపెనీలు లైసెన్స్ లేకుండా చైనాకు సైనిక విభాగానికి ఎలాంటి పరికరాల్ని పంపలేవు. కాగా, గత మూడు దశాబ్దాలలో చైనా సైనిక సామర్థ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. రాబోయే సంవత్సరాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యూఎస్ మిలిటరీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే.. -
ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి
ఈటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న ఓ విద్యార్థిని మృతిచెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. గెలవాలనే తొందరలో ఆహారం గొంతులో ఇరక్కుపోయి, ఊపిరాడక అర్థాంతరంగా తనువుచాలింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీ గతవారం హాట్ డగ్స్ ఈటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్లో అదే యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్న మడ్లిన్ అనే 20 ఏళ్ల విద్యార్థిని కూడా పాల్గొంది. ఐతే హఠాత్తుగా హాట్ డగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరిఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్వహణ బృందం హుటాహుటిన బోస్టన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత రోజు ఆమె మరణించిందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. నిజానికి ఆమె ఒక గొప్ప అథ్లెట్ కూడా. ఈ విషాద సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
ఆర్సీబీలో టెక్నికల్ కొలువులు
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్సీబీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 49 ► పోస్టుల వివరాలు: సీనియర్ సైంటిస్ట్, రీసెర్చ్ కన్సల్టెంట్, డేటాబేస్ మేనేజర్, సైంటిస్ట్, డేటాబేస్ ఇంజనీర్, డేటా క్యురేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రోగ్రామర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు. ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: https://rcb.res.in మరిన్ని నోటిఫికేషన్లు: డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు -
బయోటెక్నాలజీలో పరిశోధనలు కీలకం
సాక్షి, హైదరాబాద్: బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, ఈ పరిశోధనలు కోవిడ్‌పై మానవాళి పోరాటంలో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధికి, చికిత్సకు, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంతావశ్యం అని గవర్నర్ తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్–2020’అన్న అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్‌భవన్ నుండి ఆన్లైన్ ద్వారా గవర్నర్ ప్రసంగించారు. కరోనా సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాలలో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, సైంటిస్టులు ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్న నేపథ్యంలో భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్నదన్నారు. భారతదేశం ప్రస్తుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో 20 శాతం సాధిస్తుందని తమిళిసై వివరించారు. హైదరాబాద్ ‘బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్’గా ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. -
జినోమ్ వ్యాలీలో బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: బయో టెక్నాలజీ, బయో ఫార్మా రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో ప్రవేశించే పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో బీ–హబ్‌ను ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రూ.60 కోట్ల వ్యయంతో ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బయో ఫార్మా రంగ పరిశోధనలకు ఊతమిచ్చేలా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం దేశంలోనే తొలిసారని.. హబ్ ఏర్పాటుతో సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలలు, పరిశోధనల కోసం ఇంక్యుబేటర్, ఉత్పత్తి సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. బీ–హబ్ ఏర్పాటుపై మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీ–హబ్‌తో బయో ఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. స్వదేశీ కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచంలో బయో ఫార్మా రంగంలో ముందున్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్థాయిలో పరిశోధన, తయారీ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బయో ఫార్మా రంగంలో పరిశోధనలు చేస్తున్న ఔత్సాహికులు తమ పరిశోధన ఫలితాలను ఉత్పత్తి దశకు తీసుకెళ్లడంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లకు బీ–హబ్ పరిష్కారం చూపనుందని మంత్రి వివరించారు. హైదరాబాద్ స్థానం సుస్థిరం ఫార్మా పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన బిజినెస్ ప్లానింగ్, జీవ కణాలపై పరిశోధనలు, ప్రాసెస్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్మెంట్ లాంటి అనేక అంశాల్లో బీ–హబ్ ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్న నగరంలోని ఔషధ పరిశ్రమలకు ఈ హబ్ ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల ప్రీ క్లినికల్ అధ్యయనాల కోసం బయో ఫార్మా స్కేల్ అప్ ప్రయోగశాలతోపాటు సెల్ లైన్ డెవ లప్మెంట్, క్లోన్ సెలక్షన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ డెవలప్మెంట్, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ వంటి అనేక సదుపాయాలు హబ్‌లో అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని చెప్పారు. దేశంతోపాటు ఆసియా ఖండంలోనే ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జినోమ్ వ్యాలీలో ఇప్పటికే 200పైగా కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. పదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలు లక్ష్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఔషధ, బయో టెక్నాలజీ కంపెనీలకు అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే బీ–హబ్‌తో ఆయా కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు నిర్వహించి ఉత్పత్తులు తయారు చేసేందుకు, మార్కెట్ చేసేందుకు, సమయాన్ని తగ్గించేందుకు వీలు కలుగుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ఇండియాగా ఉందని, రానున్న పదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే జినోమ్ వ్యాలీ 2.0, హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైసెస్ పార్ట్, లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేపట్టనున్న బీ–హాబ్ తమ లక్ష్యాలు అందుకోవడంలో విజయవంతం అవుతుందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా డీఎన్ఏ డేటా బ్యాంకులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో డీఎన్ఏ డేటా బ్యాంకులను కేంద్రం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా పౌరుల డీఎన్ఏ వివరాలను బయటకు వెల్లడిస్తే మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ డీఎన్ఏ ముసాయిదా బిల్లును రూపొందించింది. డీఎన్ఏ ప్రొఫైల్స్, డీఎన్ఏ శాంపిల్స్, రికార్డులను బాధితులు, నిందితులు, అనుమానితులు, తప్పిపోయినవారు, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తుల్ని గుర్తించేందుకు మాత్రమే వాడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బిల్లు రూపకల్పనలో న్యాయశాఖ బయోటెక్నాలజీ విభాగం సలహాలను తీసుకుందన్నారు. ఈ ముసాయిదా బిల్లుకు ప్రస్తుతం న్యాయశాఖ తుదిరూపు ఇస్తోందన్నారు. డీఎన్ఏ సమాచారాన్ని అక్రమంగా కోరేవారికి కూడా మూడేళ్ల జైలుశిక్షతో పాటు లక్ష వరకూ జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. వచ్చే సమావేశాల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఇటీవల కేంద్రం సుప్రీంకు తెలిపిందన్నారు. -
రేడియోను నాశనం చేశామా?
న్యూఢిల్లీ : ఆధార్... దేశంలో పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆధార్‌ను అన్ని సేవలకు అనుసంధానం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత వివరాలన్నీ బట్టబయలు అవుతాయని కొందరు వాదిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల భద్రత పెరుగుతుందని చెబుతోంది. అసలు ఆధార్ వల్ల ముప్పెంత..? ప్రయోజనమెంత..? అనే విషయాలపై ఇజ్రాయిల్ చరిత్రకారుడు యువాల్ నోహ్ హరారి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ టెక్నాలజీ కూడా నిర్ణాయకమైనది కాదని హరారి అన్నారు. ప్రతి టెక్నాలజీలోనూ సానుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయని చెప్పారు. కానీ బయోటెక్నాలజీ విషయంలో కొంత మొత్తంలో ఉండే ప్రతికూలతల కోసం, భారీ మొత్తంలో ప్రయోజనాలను వదులుకోవడం మూర్ఖత్వమేనన్నారు. ఉదాహరణకు..నాజి జర్మనీ రేడియోను ప్రధాన ప్రచార సాధనంగా వాడుకున్నారు. ప్రతి సాయంత్రం, ప్రతి రోజూ హిట్లర్ తన ప్రసంగాలను లక్షల కొద్దీ జర్మన్లకు రేడియో ద్వారానే వినిపించే వారు. వారి బ్రెయిన్‌వాష్ చేశారు. అంటే రేడియో చెడుకే అనే అర్థమా? అన్ని రేడియో సెట్లను నాశనం చేశామా? కాదు కదా! చాలా మంచి విషయాలకు కూడా రేడియోను వాడారు. ఇదే బయోటెక్నాలజీ విషయంలోనూ అప్లయ్ అవుతుంది. బయోటెక్నాలజీ విషయంలో ప్రజలు భయపడాల్సినవసరం లేదు. దీన్ని ఆపాలని చూసినా.. నాశనం చేయాలని చూసినా.. ఎలాంటి ఉపయోగకరం ఉండదని హెచ్చరించారు. ప్రతి టెక్నాలజీ విషయంలోనూ పలు రాజకీయ కోణాలుంటాయని, అన్ని అవకాశాలను తెలుసుకున్న అనంతరమే సరియైన దాన్ని ఎంపిక చేసుకోవాలని హరారి సూచించారు. ముంబైలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇండియా టుడే కంక్లేవ్ 2018 సందర్భంగా హరారి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్తమానానికి, భవిష్యత్తు చాలా భిన్నంగా ఉంటుందని, అదేవిధంగా గ్లోబల్ సమస్యలను, గ్లోబల్ పరిష్కారాలు కనుగొనాల్సినవసరం కూడా తమపైనే ఉందన్నారు. -
‘అగ్రి’కి యమా క్రేజ్..!
♦ మెడిసిన్ లేకున్నా అగ్రికల్చర్ ఎంసెట్‌కు అధిక డిమాండ్ ♦ అగ్రికల్చర్ కోర్సుల కోసం భారీగా వచ్చిన దరఖాస్తులు ♦ ఇప్పటికే దరఖాస్తు చేసిన 65 వేల మంది విద్యార్థులు ♦ ఇంజనీరింగ్ కోసం 1.19 లక్షలకుపైగా దరఖాస్తులు ♦ మొత్తంగా ఇప్పటివరకు 1.87 లక్షల దరఖాస్తులు ♦ ఈనెల 15తో ముగియనున్న దరఖాస్తుల గడువు సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, దాని పరిధి లోని పలు కోర్సులకు ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంసెట్ పరిధిలో నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులతోపాటు ఆయు ర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సులు నీట్ పరిధిలోకి వెళ్లినా అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ రాసేందుకు ఇప్పటికే 65 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా రు. అగ్రికల్చర్ ఎంసెట్ పరిధిలోని బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మా, బయోటెక్నాలజీ, ఫార్మా–డి కోర్సు ల్లో చేరేందుకు నిర్వహించే అగ్రి ఎంసెట్ రాసేందుకే వీరంతా దరఖాస్తు చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్ కోసం ఫీజు చెల్లించే గడువు ఈనెల 15 వరకు ఉంది. అప్పటి వరకు దరఖాస్తుల సంఖ్య 75 వేలు దాటుతుందని అధికారుల అంచనా. గత ఏడాది కంటే ఎక్కువ... గత ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తోపాటు అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సు ల్లో చేరేందుకు 1.02 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకే 56 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయుష్ కోర్సుల కోసం మరో 10 వేల మంది వరకు దరఖాస్తు చేసు కున్నారు. అంటే అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసిన వారు 35 వేల మందే. ఈ ఏడాది ఇప్పటికే 65,459 దరఖాస్తులు రాగా ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నందున మరో 10 వేల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. మరో వైపు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు అగ్రికల్చర్, దాని పరిధి లోని కోర్సులపై దృష్టి సారించినట్లు «అధికారు లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున విద్యార్థులు ఆయా కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతు న్నారు. మరోవైపు నీట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కూడా ప్రాక్టీస్ కోసం ఎంసెట్‌కు కూడా దరఖాస్తు చేసి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంజనీరింగ్ దరఖాస్తులు 1.19 లక్షలు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి వరకు 1,19,720 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య గతేడాదిలాగే 1.40 లక్షలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,44,511 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,33,428 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 1,03,923 విద్యార్థులు అర్హత సాధించారు. మరోవైపు అగ్రికల్చర్, ఇంజనీరింగ్ రెండింటికి హాజరయ్యేందుకు మరో 1,195 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ దరఖాస్తులు 18,973 తెలంగాణ ఎంసెట్ రాసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 18,973 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కోసం 10,093 మంది.. అగ్రికల్చర్ ఎంసెట్ కోసం 8,750 మంది, రెండూ రాసేందుకు 65 మంది దరఖాస్తు చేశారు. -
ఎన్విరాన్మెంటల్ పోస్టుల్లో.. ‘బయోటెక్నాలజీ’కి అన్యాయం
ఇతర రాష్ట్రాల్లో అవకాశం.. ఇక్కడ మాత్రం నో సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులకు కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన విద్యార్హతల్లో బయో టెక్నాలజీ విద్యార్థులను అన్యాయం జరిగింది. ఇటీవల టీఎస్పీఎస్సీ 26 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రకటించిన నోటిఫికేషన్లో బీటెక్ బయో టెక్నాలజీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళనలో పడుతున్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ టీఎస్పీఎస్సీ, కాలుష్య నియంత్రణ మండలి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు లేక, అటు ప్రభుత్వ విభాగాల్లోనూ అవకాశం రాక ఆందోళనలో మునిగిపోతున్నారు. పదిహేనేళ్ల కింద బీటెక్ బయో టెక్నాలజీకి బాగా డిమాండ్ ఉండేది. కానీ ఆ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు సరైన ఉద్యోగావకాశాలు మాత్రం లభించడం లేదు. ప్రైవేటు రంగంలో బయో టెక్నాలజీకి అవకాశాల్లేవు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అవకాశం ఇవ్వనపుడు ఆ కోర్సును నిర్వ హించడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా.. కాలుష్య నియంత్రణ మండలి కూడా పట్టించుకోకుండా అన్యాయం చేసిందని వాపోతున్నారు. ఢిల్లీ, రాజస్థాన్‌లోని కాలుష్య నియంత్రణ మండళ్లలో భర్తీ చేసిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు బీటెక్ బయో టెక్నాలజీ అభ్యర్థులు అర్హులుగా ప్రకటించాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం విభిన్నంగా వ్యవహరిస్తుండడంతో ఆ కోర్సు చేసిన 30 వేల మంది ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
బయోటెక్ బాంధవి
మన దిగ్గజాలు భవిష్యత్తు బయోటెక్నాలజీదేనని దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే గుర్తించిన దార్శనికురాలు ఆమె. జీవశాస్త్ర పరిజ్ఞానానికి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని జోడించి భారత్‌లో బయోటెక్నాలజీ పరిశ్రమనుప్రగతిపథంలో పరుగులు తీయించారామె. భారత బయోటెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక విజయకేతనం. ఎలాంటి వ్యాపార నేపథ్యం లేకున్నా, కేవలం సంకల్పబలంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న దీక్షాదక్షత, లాభార్జనకే పరిమితం కాకుండా తన ఆస్తిలో సగభాగాన్ని సేవాకార్యక్రమాలకు కేటాయించిన వితరణశీలత ఆమెకే చెల్లింది. కిరణ్ మజుందార్ షా 1953 మార్చి 23న బెంగళూరులో స్థిరపడ్డ సామాన్య గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బెంగళూరు వర్సిటీ నుంచి 1973లో బీఎస్సీ పూర్తి చేశారు. వైద్యవిద్య చదవాలనుకున్నా, స్కాలర్షిప్ రాకపోవడంతో ఆ ఆశ నెరవేరలేదు. కిరణ్ తండ్రి రాసేంద్ర మజుందార్ యునెటైడ్ బ్రూవరీస్లో ప్రధాన బ్రూ మాస్టర్‌గా పనిచేసేవారు. ఆయన సలహాపై ఆస్ట్రేలియాలోని బాలారత్ వర్సిటీలో బ్రూయింగ్ (మద్యం తయారీ) కోర్సులో చేరారు. బ్రూయింగ్ చదువు పూర్తయ్యాక 1975లో భారత్‌కు తిరిగి వచ్చినా ఆమెనెవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఆడపిల్ల మద్యం తయారు చేయడమేంటని పెదవి విరిచారు. పదివేల పెట్టుబడితో... ‘బయోకాన్’ ఇప్పుడంటే కోట్లకు పడగలెత్తిన పరిశ్రమ గాని, కిరణ్ ఈ పరిశ్రమను పట్టుమని పదివేల రూపాయల నామమాత్రపు పెట్టుబడితో ప్రారంభించారు. బ్రూయింగ్ రంగంలో ఉద్యోగంపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఐర్లాండ్‌కు చెందిన బయోకాన్ బయోకెమికల్స్ కంపెనీ వ్యవస్థాపకుడు లెస్లీ ఆకిన్క్లోసీ రూపంలో కిరణ్‌కు అనుకోని అవకాశం లభించింది. లెస్లీ తమ కంపెనీకి భారత్‌లో భాగస్వామి కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆయనకు కిరణ్ తారసపడ్డారు. ఇద్దరికీ ఒప్పందం కుదరడంతో ఒక అద్దె ఇంట్లోని కారు గ్యారేజీలో ‘బయోకాన్’ను ప్రారంభించారు. రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తే, ‘బయోటెక్నాలజీనా..? ఇంతవరకు ఆ పేరే వినలేదే’ అంటూ బ్యాంకు అధికారులు పెదవి విరిచేవారు. చివరకు తండ్రి పూచీకత్తు మీద రుణం మంజూరైంది. పేద దేశాల మార్కెట్‌పైనే దృష్టి పేద దేశాల మార్కెట్‌పైనే కిరణ్ తొలి నుంచి వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. పేటెంట్ గడువు ముగిసిన ఔషధాలను వివిధ రూపాల్లోకి మార్చి కొత్త ఔషధాలను తయారు చేయటం, కంపెనీలతో వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవటం కంపెనీకి లాభించింది. కొలెస్ట్రాల్‌ను నిరోధించే స్టాటిన్స్‌కు అప్పట్లో మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండేది. దీనిపై లోవాస్టీన్కున్న పేటెంట్ గడువు 2001లో తీరిపోవటంతో బయోకాన్ స్టాటిన్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. వ్యాపార విస్తరణపై దృష్టి సారించిన కిరణ్... వివిధ వ్యాధుల నివారణకు వాడే జీవ ఔషధాల తయారీ కోసం 1994లో సింజెనే, 2004లో క్లింజనే పేరిట అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశారు. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి సలహాపై 2004లో కిరణ్ తన కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేశారు. భారత్‌లో తొలి కేన్సర్ ఔషధాన్ని 2006లో విడుదల చేసిన ఘనత బయోకాన్కే దక్కుతుంది అద్దె ఇంటి గ్యారేజీలో మొదలైన బయోకాన్ నేడు బెంగళూరు చేరువలోని హోసూరులో 80 ఎకరాల సువిశాల ప్రాంగణానికి విస్తరించి భారత బయోటెక్నాలజీ రంగంలో బయోకాన్ అతిపెద్ద సంస్థగా అవతరించింది. కిరణ్ రూ.6 వేల కోట్లకు పైగా సంపదతో సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి ఎదిగారు. ఆస్తిలో సగం ఆపన్నుల కోసం... వ్యాపార విజయాలు కిరణ్ మజుందార్ షాకు అనేక సత్కారాలను, పురస్కారాలను తెచ్చిపెట్టాయి. భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ అవార్డులతో సత్కరించింది. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆమెకు ఓథ్మర్ గోల్డ్‌మెడల్ పురస్కారాన్ని బహూకరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, కిరణ్ తన ఆస్తిలో సగభాగాన్ని పూర్తిగా ఆపన్నులను ఆదుకోవడానికే కేటాయించారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సత్వర వైద్యసేవల కోసం రూ.220 కోట్లతో ‘ఇరాజ్’ రోగ నిర్ధారణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 1400 పడకల కేన్సలర్ ఆస్పత్రిని నిర్మించారు. వరద బాధితులకు మూడువేల ఇళ్లు కట్టించారు. కంపెనీ నిర్వహణకు సంసారం ప్రతిబంధకమవుతుందని భావించి చాలాకాలం పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే, 1998లో స్కాట్లాండ్ కు చెందిన జాన్షాను ప్రేమించి పెళ్లాడారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మాతృత్వానికి దూరమైన కిరణ్, బయోకానే తన బేబీ అంటారు. - దండేల కృష్ణ -
తెయూకు మరో ప్రతిష్టాత్మక ఎంఓయూ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మరో ప్రతిష్టాత్మక ఒప్పంద పత్రం కుదుర్చుకుంది. ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌తో బయోటెక్నాలజీ, బోటనీ విభాగాలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూ ఈ నెల 21న జరిగినప్పటికీ, సోమవారం ఉదయం సెక్రటేరియట్‌లోని వీసీ సి పార్థసారథి ఛాంబర్లో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సెంటర్ ఫర్ అగ్రికల్చర్ (క్రిడ) తరపున ప్రిన్సిపాల్ సైంటిస్ట్‌లు డాక్టర్ ఒస్మాన్, డాక్టర్ మహేశ్వరి, తెయూ తరపున వీసీ పార్థసారథి, బయోటెక్నాలజీ హెచ్‌వోడీ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, బోటనీ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ బి.విద్యావర్థిని ఈ ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో బయోటెక్నాలజీ విద్యార్థులు జెనెటిక్ ఇంజనీరింగ్‌లో పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుందని వీసీ తెలిపారు. ఎమ్మెస్సీ, పీహెచ్డీ విద్యార్థులు, అధ్యాపకుల ఎక్సేS్చంజ్ ఉంటుందని ప్రవీణ్ తెలిపారు. క్రిడ అనేది ప్రతిష్టాత్మక సంస్థ అని ఆయన తెలిపారు. -
బయోకాన్ సింజిన్ ఐపీఓకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌కు చెందిన రీసెర్చ్ విభాగం సింజిన్ ఇంటర్నేషనల్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను సింజిన్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తన మర్చంట్ బ్యాంకర్ యాక్సిస్ క్యాపిటల్ ద్వారా సెబీకి సమర్పించింది. సెబీ ఈ నెల 12న సింజిన్ ఇంటర్నేషనల్ ఐపీఓకు ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా పత్రాల ప్రకారం..., సింజిన్ ఇం టర్నేషనల్ 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ద్వారా ఎంత మొత్తం సమీకరించాలనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోందని పరిశ్రమ వర్గాల అంచనా. -
భవిష్యత్ బయోటెక్నాలజీదే
సీఎం సిద్ధరామయ్య రానున్న మూడేళ్లలో ‘ఎల్ఈడీ’ వెలుగులు బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బెంగళూరు: బయోటెక్నాలజీలో భారత్ ప్రధాన శక్తిగా ఎదిగే దిశగా కర్ణాటక ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సోమవారం ఇక్కడి బెంగళూరు ఇండియా బయో-2015 ప్రదర్శనను కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధు మాట్లాడుతూ రాష్ట్రంలో జైవిక పరమాణు ఇంజనీరింగ్ సంశోధనా కేంద్రాన్ని ప్రారంభించేందుకు అనుమతించాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కోరినట్లు తెలిపారు. దేశంలోని బయోటెక్నాలజీ సంస్థలన్నింటిలోకి దాదాపు 52 శాతం సంస్థలు కర్ణాటకలోనే ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో ఉన్న 10 ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థలు రాష్ట్రంలో తన శాఖలను ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇక రాష్ట్రంలో బయో టెక్నాలజీ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా బయోకాన్ సంస్థ చైర్మన్ కిరణ్ మజుందార్ షా నేతృత్వంలో ఓ ప్రత్యేక మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దేశంలో ఇకపై ఎల్ఈడీ వెలుగులు రానున్న మూడేళ్ల కాలంలో దేశంలోని అన్ని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వీధి దీపాల్లోని సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ఏడాదికి 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, తద్వారా 1.5 బిలియన్ డాలర్లను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇప్పటికే న్యూఢిల్లీలో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చామని, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 617 ఎల్ఈడీ బల్బులను అమర్చామని వెల్లడించారు. గతంలో ఒక్కో ఎల్ఈడీ బల్బు ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉండేదని ప్రస్తుతం రూ.150కి ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి వ చ్చేశాయని పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సబ్సిడీలను కనుక ప్రకటిస్తే ఒక్కో ఎల్ఈడీ బల్బు రూ.100కి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష జవదేకర్ మాట్లాడుతూ...ప్రస్తుతం బయో ఇంధన రంగంలో యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ కావాల్సినంత విద్యుత్ అందుబాటులో లేదని, అందువల్ల ప్రతి రోజూ డీజిల్‌తో నడిచే జనరేటర్ల ద్వారా విద్యుత్‌ను అందించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాక స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సరికొత్త పధకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, బీటీశాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా తదితరులు పాల్గొన్నారు. -
జన్యు మార్పిడితోనే ఆహార భద్రత
సైన్స్ కాంగ్రెస్‌లో శాస్త్రవేత్తల స్పష్టీకరణ ముంబై: పెరుగుతున్న జనాభా అవసరాలకు జన్యుమార్పిడి(జీఎం) పంటలే శరణ్యమని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. జన్యు మార్పిడి పంటల పరిజ్ఞానాన్ని మరింత విస్తరించేందుకు విధాన పరమైన అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబై వర్సిటీలో జరుగుతున్న 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌లో సోమవారం ‘జన్యు మార్పిడి పంటలు-వ్యవసాయంలో ఆధునిక బయోటెక్నాలజీ వినియోగం’ అంశంపై చర్చ జరిగింది. దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డెరైక్టర్ రాజేంద్ర సింగ్ పరోడా అధ్యక్షత వహించారు. ఏటేటా పెరిగిపోతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించాలంటే జన్యుమార్పిడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు ప్రయోజనాల కోసం శాస్త్రీయ పునాదులపై జీఎం పంటలపై అవగాహన కల్పించాలన్నారు. బీటీ వంకాయ సురక్షితమని పరిశోధనల్లో తేలినా దాన్ని వినియోగించడం లేదన్నారు. జీఎం పంటలు విదర్భతోపాటు దేశంలో మరికొన్ని చోట్ల విఫలమైనందున రైతులు మళ్లీ సంప్రదాయ విధానాల వైపు మళ్లారని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో జెనెటిక్స్ విభాగాధిపతి దీపక్ పెంటల్ మాట్లాడుతూ... జీఎం పంటలను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నా భారత్ ఇప్పటికీ రూ.60 వేల కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటోందన్నారు. అణు పరిజ్ఞానం పంచుకోవాలి.. అణు పరిశోధనల ఫలితాలను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘అణుశక్తి-వర్తమానం-భవిష్యత్తు’ అంశంపై చర్చ జరిగింది. వైద్య రంగంలో అణు శక్తి వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల అనారోగ్య సమస్యలు పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ అభయ్ బంగ్ ‘గిరిజనుల ఆరోగ్యం-ఐటీ’ చర్చలో పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని భోపాల్ ఎయిమ్స్ డెరెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. -
వ్యవసాయరంగానికి పెను సవాళ్లు
కేంద్ర వ్యవసాయ కమిషనర్ జె.ఎస్.సంధూ వ్యాఖ్య వరి పరిశోధన కేంద్రంలో జాతీయ సదస్సు ప్రారంభం క్షీణిస్తున్న భూసారం, నీటి లభ్యత పెరుగుతున్న చీడపీడలు బయోటెక్నాలజీ, జన్యుశాస్త్రాలే దిక్కు అని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తరచూ వచ్చే కరువు, వరద లు, పెరిగిపోతున్న చీడపీడల బెడద వ్యవసాయరంగానికి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు, వీటినుంచి తట్టుకుని మంచి దిగుబడులను ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేయాల్సి న అవసరం ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ కమిషనర్ జె.ఎస్.సంధూ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల సాయంతో జీవ సంబంధ, వాతావరణ సంబంధ వ్యవసాయరంగ సమస్యలను అధిగమించడం సాధ్యమేనని ఆయన శనివారం హైదరాబాద్‌లోని వరి పరిశోధన కేంద్రంలో మాట్లాడుతూ అన్నారు. ‘ఎమర్జింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చూనిటీస్ ఇన్ బ యాటిక్ అండ్ అబయాటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్’ అన్న అంశంపై వరి పరిశోధన కేంద్రంలో ప్రా రంభమైన రెండు రోజుల జాతీయ సదస్సుకు జె.ఎస్.సంధూ ముఖ్యఅతిథిగా హాజయ్యారు. 1965 ప్రాంతంలో వరి పంటను ఐదు రకాల చీడలు మాత్రమే ఆశించేవని.. ప్రస్తుతం వీటి సంఖ్య 15కు పెరిగిపోయిందని ఆయన వివరించారు. బీటీ ద్వారా బోల్‌గార్డ్ బెడదను తొల గించుకున్నా ఇతర సమస్యలు ఎక్కువయ్యాయని గుర్తుచేశారు. ఇదే సమయంలో వాతావరణ అనిశ్చితి కూడా పెరిగిపోతోందని, నెలరోజుల క్రితం అసోంలో పంటలు వరదలతో నీట మునిగి ఉంటే ప్రస్తుతం నీరు అందని పరిస్థితి ఉందని తెలిపారు. అనేక పంటల జన్యుక్రమాల నమోదు పూర్తికావడం, బయోటెక్నాలజీ రంగం వృద్ధి చెందడం భవిష్యత్ సవాళ్లను అధిగమించగలమన్న ధీమాను కల్పిస్తున్నాయని చెప్పారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎ.పద్మరాజు, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ (రాయ్‌పూర్) ఉపకులపతి డాక్టర్ ఎస్.కె.పాటిల్ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యల పరి ష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. పెరిగిపోతున్న అవసరాలు, వాతావరణ మార్పులు, నీటికొరత, తగ్గిపోతున్న భూకమతాల విస్తీర్ణం వ్యవసాయ రంగంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయని, ప్రకృతి వనరుల సమర్థ వినియోగం, అధికదిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టితో వీటిని అధిగమించాలని సూచించారు. భూసార పరిరక్షణతోపాటు శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలను రైతులకు వేగంగా అందజేసేందుకు తగిన వ్యవస్థలను రూపొం దించాల్సిన అవసరం ఉందన్నారు. వరి పరిశోధ న కేంద్రం డెరైక్టర్ వి.రవీంద్రబాబు మాట్లాడుతూ దిగుబడులతోపాటు పోషకవిలువలు ఉన్న వరివంగడాలను అభివృద్ధి చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఆస్తా ఫౌండేషన్, సొసైటీ ఫర్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (మీరట్, ఉత్తరప్రదేశ్), సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (హైదరాబాద్)లు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు హాజరయ్యారు. -
బయోటెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలు ఏంటీ?
-
రొమ్ము కేన్సర్‌కు దేశీయ ఔషధం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రొమ్ము కేన్సర్ చికిత్సకు దేశీయ కంపెనీ ఔషధం కూడా అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఔషధ రంగ సంస్థ బయోకాన్ రొమ్ము(స్తన) కేన్సర్ చికిత్స కోసం ‘కాన్‌మాబ్’ అనే సూది మందును ఆవిష్కరించింది. బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ మేరకు శనివారమిక్కడ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాన్‌మాబ్ ఔషధం ఫిబ్రవరి తొలివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ అమెరికా సంస్థ తయారు చేసిన ‘హర్సెప్టిన్’ అనే ఔషధాన్ని దేశంలో వాడుతున్నారు. ఆ మందు ధర రూ.75 వేలు కాగా, కాన్‌మాబ్ ధర 25 శాతం తక్కువ. కాన్‌మాబ్ ఔషధం 150 మిల్లీగ్రాముల మోతాదు ధరను రూ.19,500గా, 440 మిల్లీగ్రాముల ధరను రూ.57,500గా నిర్ణయిం చారు. వ్యాధిస్థాయిని బట్టి.. ఈ ఔషధంతో రెండు నుంచి మూడు నెలల్లో కేన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని షా తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో ఈ ఔషధానికి రూ.130 కోట్ల మేరకు మార్కెట్ ఉంది. -
టైఫాయిడ్‌కి కొత్త టీకా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోటెక్ టైఫాయిడ్ నివారణకు కొత్త టీకా... టైప్‌బార్-టీసీవీని అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా, ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ (ఐవీఐ) డెరైక్టర్ జనరల్ క్రిస్టియన్ లూక్ దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న టీకాలకు భిన్నంగా.. ఇది ఆరు నెలల చిన్నారులకు కూడా ఉపయోగపడుతుందని, మరింత దీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. వచ్చే రెండు వారాల్లో ధరను నిర్ణయించి, మార్కెట్లో ప్రవేశపెడతామని కృష్ణ ఎల్లా చెప్పారు. దీన్ని ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగానికి కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇతర టీకాల డోసేజి ధర రూ. 180 దాకా ఉంటుండగా.. కొత్త వ్యాక్సిన్ రేటు అంతకన్నా కాస్త ఎక్కువ గా ఉండగలదన్నారు. క్లినికల్ పరీక్షలకు సంబంధించి విజయవంతమైన టైఫాయిడ్ వ్యాక్సిన్ ప్రపంచంలో ఇదే మొట్టమొదటిదని కృష్ణ చెప్పారు. 65 కోట్ల పెట్టుబడి: సుమారు 8 ఏళ్లుగా టైప్‌బార్-టీసీవీ (టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్) రూపకల్పనపై కసరత్తు చేసినట్లు కృష్ణ తెలిపారు. ఈ నాలుగోతరం టీకాను అభివృద్ధి చేయడంపై సొంతంగా రూ. 65 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. టైఫాయిడ్ టీకాల విభాగం నుంచి ఆదాయాలు రూ.40-50 కోట్లు ఉంటున్నాయని, కొత్త ఉత్పత్తితో ఈ మొత్తం రూ.100 కోట్లకు పెరగగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా దేశీయ మార్కెట్‌పై దృష్టి పెట్టనున్నామని, అలాగే ఆగ్నేయాసియా తదితర దేశాల మార్కెట్లకు ఎగుమతి చేస్తామని కృష్ణ చెప్పారు. కంపెనీ ప్రస్తుత టర్నోవరు దాదాపు రూ. 300 కోట్లుగా ఉంది. ఏటా 2 కోట్ల మందికి టైఫాయిడ్ అపరిశుభ్రత, స్వచ్ఛమైన మంచి నీరు లేకపోవడం వంటి సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల మందికిపైగా టైఫాయిడ్ బారిన పడుతున్నారని ఐవీఐ డెరైక్టర్ జనరల్ క్రిస్టియన్ లూక్ చెప్పారు. ఇందులో సుమారు, 2,50,000-6,00,000 మంది మరణి స్తుండగా.. వీరిలో అత్యధికులు పిల్లలే ఉంటున్నారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఆసియాలో ప్రధానంగా భారత్, పాకిస్థాన్‌లో టైఫాయిడ్ కేసులు అత్యధికమని లూక్ చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాలిశాకరైడ్ తరహా టీకాలు 2 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే పనిచేస్తున్నాయని కృష్ణ చెప్పారు. పైగా వీటి ప్రభావం సుమారు మూడేళ్ల దాకా మాత్రమే ఉంటోందని, అటు పైన మరోసారి టీకా తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. కానీ, వీటిని పదే పదే తీసుకున్నందు వల్ల దుష్ఫలితాలకు అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఆవిష్కరించిన టైప్‌బార్-టీసీవీ దీర్ఘకాలం పనిచేస్తుందని కృష్ణ ఎల్లా వివరించారు. దాదాపు 1,200 మందిపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇలా క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన తొలి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇదేనని ఆయన పేర్కొన్నారు.