'కృత్రిమ సూర్యుడిని' సృష్టించడం. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ..కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో ఆలీబాబా అధినేత జాక్ మా రెక్కలు కత్తిరించడం. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. మిత్ర దేశాలకు చెందిన భూ భాగాల్ని అప్పనంగా ఆక్రమించుకునేందుకు తన దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఇరుదేశాల సైనికులపై దొంగదెబ్బ తీయడం. ప్రపంచ దేశాల్ని శాసించేందుకు కోవిడ్ వైరస్ వ్యాప్తితో చైనా బయోవార్‌ను సృష్టించడంలాంటి దుర్బుద్ది పనులు చేయడం చైనాకే చెల్లించింది. ఇప్పుడు అదే డ్రాగన్ కంట్రీ బయోటెక్నాలజీతో పేరుతో 'ఎదిరించాలనే శత్రువు సంకల్పాన్ని విచ్ఛిన్నం చేసే' మైండ్ కంట్రోల్ వెపన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తేలింది.
చైనా చేస్తున్న కుటిల ప్రయత్నాల్ని నిలువరించేందుకు ఆదేశాన్ని మిత్ర దేశాలు దూరం పెడుతున్నాయి. అయినా చైనా తన చిల్లర బుద్ది పోనిచ్చుకోవడం లేదు. మిత్ర దేశాల్ని, వారి సైనికుల్ని నిలువరించేలా కుటిల ప్రయత్నాలు చేస్తుంది. వాషింగ్టన్ టైమ్స్ ప్రకారం..చైనా ప్రస్తుతం'బయోటెక్నాలజీ'గా పిలువబడే మైండ్ కంట్రోల్ వెపన్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపింది.
వాషింగ్టన్ టైమ్స్ 2019కి చెందిన చైనా సైనిక విభాగానికి చెందిన రహస్య పత్రాలను సేకరించింది. వాటిలో ఈ బయోటెక్నాలజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రహస్య పత్రాల్లో..సాంప్రదాయ పద్దతుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగే భౌతిక తరహ దాడులు కాకుండా చైనా కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ప్రత్యర్ధి దేశాల సైనికులపై దాడిచేయాల్సి వస్తే మారణాయుధాలతో కాకుండా కొత్త బయోటెక్నాలజీని ఉపయోగించి సైనికుల మైండ్ కంట్రోల్ చేయడం, దాడి చేయాలని ఆలోచనల్ని నియంత్రించడంపై చైనా ప్రభుత్వం పనిచేస్తుంది.
అమెరికా రహస్యాలను చైనా దొంగిలిస్తున్నదా?
బయోటెక్నాలజీ వంటి కీలక రంగాలపై పట్టు సాధించేలా అమెరికా టెక్నాలజీని సొంతం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవల అమెరికా గుర్తించింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం సైతం..చైనా అధికార పార్టీ 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)' జన్యు సవరణ, మానవ పనితీరు మెరుగుదల, డైరక్ట్ బ్రెయిన్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో కంప్యూటర్ లేదా రోబోటిక్ ఆర్మ్ వంటి హార్డ్‌వేర్‌లను నియంత్రించడం( బ్రెయిన్ కంట్రోల్ ఇంటర్ ఫేస్) వంటి టెక్నాలజీలను అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన కథనంలో ప్రస్తావించింది.
చైనాకు చెక్ పెడుతున్న అమెరికా
ఈ ప్రమాదకరమైన టెక్నాలజీని చైనా అభివృద్ధి చేస్తుండగా..గతవారం అమెరికా వాణిజ్య విభాగం 12 చైనీస్ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు పలు సంస్థల్ని బ్లాక్ చేసింది. వాటిలో బీజింగ్స్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఉంది. అలా బ్లాక్ చేయడం వల్ల..అమెరికన్ కంపెనీలు లైసెన్స్ లేకుండా చైనాకు సైనిక విభాగానికి ఎలాంటి పరికరాల్ని పంపలేవు. కాగా, గత మూడు దశాబ్దాలలో చైనా సైనిక సామర్థ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. రాబోయే సంవత్సరాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యూఎస్ మిలిటరీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment