Peoples Liberation Army
-
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
భారత సరిహద్దుల్లో చైనా బంకర్ల నిర్మాణం!
భారత్‌ను కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది చైనా. ఇప్పటికే భారత సరిహద్దులను డ్రాగన్ దేశం అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తూర్పు లడఖ్‌లోని ప్యాగ్యాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్‌గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తోందని రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాగ్యాంగ్ సరస్సుకు ఉత్తర వైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్ సిర్జాప్ వద్ద బంకర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బంకర్ల నిర్మాణాలు వాస్తవాధీన రేఖకు కేవలం ఐదు కిలోమిటర్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతం ఈ బంకర్లు నిర్మిస్త్ను ప్రాంతంలో 2020 ప్రారంభమైన ప్రతిష్టంభనకు ముందు ఎటువంటి మానవ సంచారం లేదు.2021-22 మధ్య నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. ఈ బేస్‌లో ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాగ్రి భద్రపరచం కోసం నిర్మించిన బంకర్లుగా కనిపిస్తున్నాయి. యూఎస్‌కు చెందిన బ్లాక్‌స్కై సంస్థ అందించిన ఉపగ్రహ చిత్రాల ఈ విషయం తెలుస్తోంది. సాటిలైట్ మే 30న తీసినఫొటోలో ఒక పెద్ద బంకర్.. దానికి ఎనిమిది ఎన్ట్రెన్స్లు. మరో చిన్న బంకర్.. దానికి ఐదు ఎన్ట్రెన్స్ ఉన్నట్లు స్పష్టం తెలుస్తోంది.అదే విధంగా పక్కనే పలు పెద్ద బిల్డింగ్లు, సైనిక వాహనాలతో అనేక షెల్టర్లు ఉన్నాయి. సైనిక వాహనాలను గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి చైనా ఆర్మీ షెల్టర్లు నిర్మించుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఇటీవల జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు నేతలూ తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకారం తెలిపారు. -
Manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్తతలకు అవే కారణం
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న ఉగ్రవాదుల ముఠాలు ప్రజల నిరసనల నేపథ్యంలో మళ్లీ చురుగ్గా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ సైనికా« దికారిపై కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. నిషేధిత యునై టెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూ ఎన్ఎ ల్‌ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. మణిపూ ర్లో నిరసనలకు దిగుతున్న పౌరులతో కలిసిపోయి ఉద్రిక్తతలు పెంచుతున్నారని చెబుతున్నారు. గత వారం టెంగ్నౌపల్ జిల్లా మొల్నోయి గ్రామంలో గిరిజనులపై దాడికి యత్నించిన కొందరు ఆందోళన కారులను అస్సాం రైఫిల్స్, ఆర్మీ బలగాలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ రమణ్ త్యాగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గువాహటిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు నిషేధిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వివరించారు. యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏతోపాటు కంగ్లీ యవోల్ కన్బా లుప్(కేవైకేఎల్), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే) లు కూడా రాష్ట్రంలో యాక్టివ్‌గా అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూఎన్ఎల్ఎఫ్కు 330, పీఎల్ఏకు 300, కేవైకేఎల్ 25 మంది కేడర్ కలిగి ఉన్నాయన్నారు. కేవైకేఎల్ చీఫ్ టాంబా అలియాస్ ఉత్తమ్ సహా ఆ గ్రూప్‌లోని 12 మంది జూన్‌లో పట్టుబడ్డారన్నారు. ఈ గ్రూపులన్నిటికీ ఆర్మీపై దాడులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్ వంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఉందని వివరించారు. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటినుంచి పోలీస్ స్టేషన్ల నుంచి ఎత్తుకెళ్లిన మెషిన్ గన్స్, రైఫిళ్లు వంటి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల వరకు బుల్లెట్లు వీరి వద్దే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మే నుంచి తెగల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
తైవాన్ దిశగా చైనా నౌకలు, యుద్ధ విమానాలు
తైపీ: తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ దేశం చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం, బుధవారం పెద్ద సంఖ్యలో నావికాదళం నౌకలను, ఫైటర్ జెట్లు, బాంబర్లతో కూడిన యుద్ధ విమానాలను తైవాన్ దిశగా పంపించింది. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శత్రువుల దండయాత్ర నుంచి తనను తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తైవాన్ ప్రతిఏటా నిర్వహించే సైనిక విన్యాసాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తన నౌకలను, యుద్ధ విమానాలను తైవాన్ దిశగా నడిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ) మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ 38 యుద్ధ విమానాలను, 9 నౌకలను తైవాన్ వైపు మళ్లించింది. అంతేకాకుండా మరో 30 విమానాలు దూసుకొచ్చాయి. ఇందులో జె–10, జె–16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విమానాలు చైనా–తైవాన్ మధ్య జలసంధిలో అనధికారిక సరిహద్దు అయిన మిడ్లైన్ను దాటి ముందుకెళ్లినట్లు సమాచారం. చైనాకు చెందిన హెచ్–6 బాంబర్లు కూడా దక్షిణ తైవాన్ సమీపంలో సంచరించినట్లు తెలుస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని డ్రాగన్ చెబుతోంది. ఎప్పటికైనా కలిపేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపిన చైనా
బీజింగ్/జియుక్వాన్: చైనా మంగళవారం మొదటిసారిగా ఒక పౌర వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌కు పంపించింది. జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన షెంజౌ–16ను లాంగ్ మార్చ్–2ఎఫ్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పది నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన షెంజౌ–16 నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ(సీఎంఎస్ఏ) తెలిపింది. ఈ మిషన్ పూర్తిగా విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. ‘షెంజౌ–16 అనంతరం టియాంగాంగ్ కోర్ మాడ్యూల్తో అనుసంధానమైంది. షెంజౌ–16లోని ముగ్గురు వ్యోమగాములు కోర్‌మాడ్యూల్ తియాన్హెలో ఉన్న ఇప్పటికే ఉన్న ముగ్గురు వ్యోమగాములను కలుసుకున్నారు. ఆ ముగ్గురు త్వరలోనే భూమికి తిరిగి వస్తారు’అని తెలిపింది. మంగళవారం పంపిన ముగ్గురిలో ఒకరు పేలోడ్ స్పెషలిస్ట్‌గా పేరున్న గుయి హయిచావో. ఈయన బీజింగ్‌లోని బీయిహంగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. మిగతా ఇద్దరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మికి చెందిన వారు. 2030కల్లా చంద్రునిపైకి మనుషులను పంపే మానవ సహిత యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్ఏ సోమవారం ప్రకటించింది. -
దొంగదెబ్బ తీసిన కమాండర్లకు ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం!
బీజింగ్: పొరుగు దేశం చైనా మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత సైనికులపై దొంగదెబ్బ తీయటంలో కీలకంగా వ్యవహరించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ కమాండ్ జనరల్స్‌పై ప్రశంసలు కురిపించింది. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు కమాండ్ జనరల్స్‌కు ప్రమోషన్ కల్పిస్తూ.. టాప్ పోస్టులు కట్టబెట్టారు. ప్రస్తుతం భారత సరిహద్దులోని వెస్టర్న్ థియోటర్ కమాండ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► జనరల్ హీ వెయిడాంగ్(65)ను సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) కొత్త వైస్ ఛైర్మన్‌గా నియమించారు జిన్‌పింగ్. సీఎంసీకు అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు.. సీఎంసీలో ఎలాంటి పదవులు చేపట్టకుండానే వైస్ ఛైర్మన్ పోస్టులోకి జనరల్ హీ వెయిడాంగ్ను నియమించటం గమనార్హం. ► జనరల్ ఝాంగ్ యూక్సియా(72).. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. పదవీ విరమణ వయసు దాటినప్పటికీ ఆయనను ఫస్ట్ ర్యాంకింగ్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. పీఎల్ఏలో జిన్‌పింగ్‌కు కుడిభుజంగా ఝాంగ్‌ను చెప్పుకుంటారు. ► జనరల్ జు క్విలింగ్(60)ను 205 మంది సభ్యులుగా ఉన్న పార్టీ కొత్త సెంట్రల్ కమిటీలో నియమించారు జిన్‌పింగ్. మరోవైపు.. నియంత్రణ రేఖ వద్ద సంక్షోభం తలెత్తిన క్రమంలో జనరల్ జు క్విలింగ్ ఇంఛార్జిగా ఉన్నారు. దీంతో 2021 జులైలో డబ్ల్యూటీసీ హెడ్‌గా , లెఫ్టినెంట్ జనరల్ నుంచి జనరల్‌గా పదోన్నతి పొందారు. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(69)కి సైతం పదవీ విరమణ వయసు దాటినప్పటికీ తనతోనే అట్టిపెట్టుకున్నారు జిన్‌పింగ్. పొలిట్ బ్యూరోలోకి వాంగ్ యీని తీసుకున్నారు. పార్టీ విదేశీ వ్యవహారాల సెంట్రల్ కమిషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
చైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు పైలట్ల కొరత
బీజింగ్: ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల (విమానవాహక నౌకల)పై నుంచి యుద్ధ విమానాలను నడపడంలో సుశిక్షితులైన పైలట్లు దొరక్క డ్రాగన్ దేశం తంటాలు పడుతోంది. విమానవాహక నౌకల కోసం తయారు చేసిన యుద్ధ విమానాలు ముఖ్యంగా జె–15 జెట్లు నడిపే అర్హులైన పైలట్ల డిమాండ్‌ను తీర్చేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్ఏఎన్) శిక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మొదటి విమాన వాహక నౌక లియోనింగ్‌ను ప్రారంభించిన దశాబ్దం తర్వాత చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం అనేక అవరోధాలను ఎదుర్కొంటోందని చైనా మిలటరీ మేగజీన్ ఆర్డినెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ తాజా కథనంలో తెలిపింది. గత వారం సముద్రంలో ట్రయల్స్ ప్రారంభించిన అత్యాధునిక మూడో విమాన వాహక నౌక ఫుజియాన్పై ఉండే 130 యుద్ధ విమానాలను నడిపేందుకు కనీసం 200 మంది క్వాలిఫైడ్ పైలట్లు అవసరం ఏర్పడిందని అందులో తెలిపింది. అంతేకాదు, అమెరికాతో సరితూగగల ఇలాంటి మరికొన్ని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసుకోవాలని చైనా ప్రణాళికలు వేస్తోంది. ‘అయితే, విమానాల డిజైనింగ్‌తోపాటు అందుకు తగ్గట్లుగా పైలట్లను తయారు చేసుకోవడం చాలా కష్టతరమైన అంశం. ఎందుకంటే ఇలాంటి కీలక సాంకేతిక అంశాలను మీతో ఎవరూ పంచుకోరు. ఎవరికి వారు వీటిని సొంతంగా సమకూర్చుకోవాల్సిందే’ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా కనీసం ప్రతి రెండు నెలలకో యుద్ధ నౌకను రంగంలోకి దించుతూ తన నావికాశక్తిని వేగంగా ఆధునీకరిస్తోంది. పైలట్ల కొరతను అధిగమించేందుకు నేవీ అధికారులు ఎయిర్‌ఫోర్స్‌లోని అర్హులైన సిబ్బందికి బదులు హైస్కూల్ విద్య పూర్తి చేసిన 19 ఏళ్ల వారిని ఎంపిక చేస్తూ శిక్షణను వేగవంతం చేసినట్లు అధికార చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. పలు సాంకేతిక అంశాల్లో అమెరికాతో పోలిస్తే చైనా పైలట్లు శిక్షణలో వెనుకబడినట్లే భావించాల్సి ఉంటుందని ఆర్డ్‌నెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ పత్రిక పేర్కొంది. -
షాకింగ్.. గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు!
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నియంత్రణ అంతా చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేతుల్లోనే ఉందని వదంతులు వ్యాపించాయి. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ ఆర్మీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత హౌస్ అరెస్టు చేశారు. ఈ రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ సారి చెక్ చేయండి. అని సుబ్రహ్మణ్య స్వామి రాసుకొచ్చారు. New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour. — Subramanian Swamy (@Swamy39) September 24, 2022 కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇది నిజమేనా? లేక రూమారా? అనే విషయంపై అయోమయం నెలకొంది. వీడియో వైరల్ చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది. జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోందని పేర్కొంది. #PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 23, 2022 అకస్మాతుగా ఎందుకీ రూమర్? చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు ఉరి శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఆరుగురు జిన్‌పింగ్ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి చెందినవారని తెలుస్తోంది. దీంతో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలు ఆయనపై ఆగ్రహంతో పదవి నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిన్‌పింగ్‌ను ఆర్మీ గృహ నిర్బంధం చేసిందనే వదంతిని మొదటగా ఆయన రాజకీయ ప్రత్యర్థి వర్గమే వ్యాపింపజేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిన్‌పింగ్ ఇటీవలే ఉజ్బెకిస్థాన్ సామర్కంద్లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. 77 మంది వలసదారులు మృతి -
చైనా రక్షణ బడ్జెట్ 7% పెంపు
బీజింగ్: చైనా తన సాయుధబలగాల కోసం ఈస ారి బడ్జెట్ కేటాయి ంపులు పెంచింది. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం ఎక్కు వగా 230 బిలియన్ డాలర్లకు డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచుకుంది. భారత్ తన రక్షణ అవసరాలకు కేటాయిస్తున్న బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఈ బడ్జెట్ ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్ యువాన్ల రక్షణ బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలను చైనా ప్రధాని లీ కెకియాంగ్ శనివారం ఆ దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాభల్యాన్ని కొనసాగించేందుకు చైనా ఇలా తన రక్షణ బడ్జెట్‌ను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను మరింత పటిష్టచేసేందుకు, చైనా సమగ్రత, సార్వభౌమత్వం, దేశ ప్రయోజనాలు, రక్షణలను దృష్టిలో ఉంచుకుని రక్షణ బడ్జెట్ పెంచామని ముసాయిదా పత్రాల్లో కెకియాంగ్ పేర్కొన్నారు. అయితే, 2017లో చైనా మొత్తం సాయుధ బలగాల సంఖ్యను 23 లక్షల నుంచి 20 లక్షలకు కుదించుకోవడం గమనార్హం. 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అధ్యక్షుడు జిన్‌పింగ్ ముఖ్యంగా సైన్యం పటిష్టతపైనా దృష్టిపెట్టారు. -
‘మిస్సింగ్’ మిరమ్ తరోన్ దొరికాడు! చైనా ఆర్మీ ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో అదృశ్యమైన మిరమ్ తరోన్ ఆచూకీ లభించింది. తమ భూభాగంలో ఒక భారతీయ బాలుడు దొరికాడని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం త్వరలో అతన్ని భారతీయ ఆర్మీకి అప్పగిస్తామని తెలిపింది. సదరు దొరికిన బాలుడి వివరాలను చైనా ఆర్మీ వెల్లడించలేదు. కానీ అతను మిరమ్ తరోన్ అని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. జనవరి 18న తరోన్ చైనా భూభాగంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో తరోన్ ఆచూకీ తెలుసుకోవడంలో సాయపడాలని ఇండియన్ ఆర్మీ పీఎల్ఏను కోరింది. ఈ నేపథ్యంలో తమకు బాలుడు దొరికాడని, ప్రొటోకాల్స్ పూర్తయ్యాక భారత్‌కు అప్పగిస్తామని చైనా ఆర్మీ ప్రకటించింది. తరోన్ అదృశ్యంపై తొలుత బీజేపీ ఎంపీ తాపిర్ గావో స్పందించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. (చదవండి: పట్టుబడితే.. పది లక్షల బాండు ఇవ్వాల్సిందే..) -
ఆ బాలుడ్ని అప్పగించండి: చైనాను కోరిన ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్- చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన బాలుడు మీరామ్ టారోన్‌ను తమకు అప్పగించాలని భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు గురువారం పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీరామ్ టారోన్ అనే బాలుడుని చైనా ఆర్మీ.. కిడ్నాప్ చేసిందని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గావో బుధవారం ఆరోపించారు. భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో అతను అపహరణకు గురైనట్లు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. హాట్‌లైన్ సాయంతో మీరామ్ టారోన్ విషయాన్ని పీఎల్ఏకు తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్ ఆర్మీ.. చైనా సైన్యాన్ని కోరింది. మూలికలు సేకరించడానికి, వేటుకు వెళ్లిన సదరు బాలుడు దారితప్పిపోయిడంతో అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో త్సాంగ్పో నది భారతదేశంలోకి ప్రవేశిస్తుందని అక్కడ బాలుడు అపహరణకు గురైనట్లు ఎంపీ తపిర్ గావో తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. రిపబ్లిక్ డేకు కొన్ని రోజల ముందే భారతదేశానికి చెందిన ఓ బాలుడిని చైనా కిడ్నాప్ చేసిందని, దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ట్వీటర్లో పేర్కొన్నారు. -
చైనా చిల్లర బుద్ధి, అప్పుడు బయోవార్‌తో కరోనా..ఇప్పుడు బయోటెక్నాలజీతో..
'కృత్రిమ సూర్యుడిని' సృష్టించడం. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ..కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో ఆలీబాబా అధినేత జాక్ మా రెక్కలు కత్తిరించడం. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. మిత్ర దేశాలకు చెందిన భూ భాగాల్ని అప్పనంగా ఆక్రమించుకునేందుకు తన దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఇరుదేశాల సైనికులపై దొంగదెబ్బ తీయడం. ప్రపంచ దేశాల్ని శాసించేందుకు కోవిడ్ వైరస్ వ్యాప్తితో చైనా బయోవార్‌ను సృష్టించడంలాంటి దుర్బుద్ది పనులు చేయడం చైనాకే చెల్లించింది. ఇప్పుడు అదే డ్రాగన్ కంట్రీ బయోటెక్నాలజీతో పేరుతో 'ఎదిరించాలనే శత్రువు సంకల్పాన్ని విచ్ఛిన్నం చేసే' మైండ్ కంట్రోల్ వెపన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తేలింది. చైనా చేస్తున్న కుటిల ప్రయత్నాల్ని నిలువరించేందుకు ఆదేశాన్ని మిత్ర దేశాలు దూరం పెడుతున్నాయి. అయినా చైనా తన చిల్లర బుద్ది పోనిచ్చుకోవడం లేదు. మిత్ర దేశాల్ని, వారి సైనికుల్ని నిలువరించేలా కుటిల ప్రయత్నాలు చేస్తుంది. వాషింగ్టన్ టైమ్స్ ప్రకారం..చైనా ప్రస్తుతం'బయోటెక్నాలజీ'గా పిలువబడే మైండ్ కంట్రోల్ వెపన్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపింది. వాషింగ్టన్ టైమ్స్ 2019కి చెందిన చైనా సైనిక విభాగానికి చెందిన రహస్య పత్రాలను సేకరించింది. వాటిలో ఈ బయోటెక్నాలజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రహస్య పత్రాల్లో..సాంప్రదాయ పద్దతుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగే భౌతిక తరహ దాడులు కాకుండా చైనా కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. ప్రత్యర్ధి దేశాల సైనికులపై దాడిచేయాల్సి వస్తే మారణాయుధాలతో కాకుండా కొత్త బయోటెక్నాలజీని ఉపయోగించి సైనికుల మైండ్ కంట్రోల్ చేయడం, దాడి చేయాలని ఆలోచనల్ని నియంత్రించడంపై చైనా ప్రభుత్వం పనిచేస్తుంది. అమెరికా రహస్యాలను చైనా దొంగిలిస్తున్నదా? బయోటెక్నాలజీ వంటి కీలక రంగాలపై పట్టు సాధించేలా అమెరికా టెక్నాలజీని సొంతం చేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవల అమెరికా గుర్తించింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం సైతం..చైనా అధికార పార్టీ 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)' జన్యు సవరణ, మానవ పనితీరు మెరుగుదల, డైరక్ట్ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్తో కంప్యూటర్ లేదా రోబోటిక్ ఆర్మ్ వంటి హార్డ్వేర్లను నియంత్రించడం( బ్రెయిన్ కంట్రోల్ ఇంటర్ ఫేస్) వంటి టెక్నాలజీలను అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన కథనంలో ప్రస్తావించింది. చైనాకు చెక్ పెడుతున్న అమెరికా ఈ ప్రమాదకరమైన టెక్నాలజీని చైనా అభివృద్ధి చేస్తుండగా..గతవారం అమెరికా వాణిజ్య విభాగం 12 చైనీస్ ఇన్స్టిట్యూట్లతో పాటు పలు సంస్థల్ని బ్లాక్ చేసింది. వాటిలో బీజింగ్స్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ ఉంది. అలా బ్లాక్ చేయడం వల్ల..అమెరికన్ కంపెనీలు లైసెన్స్ లేకుండా చైనాకు సైనిక విభాగానికి ఎలాంటి పరికరాల్ని పంపలేవు. కాగా, గత మూడు దశాబ్దాలలో చైనా సైనిక సామర్థ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. రాబోయే సంవత్సరాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యూఎస్ మిలిటరీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే.. -
మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం
ఇంఫాల్/న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రం మణిపూర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చురాచాంద్‌పూర్ జిల్లాలోని సెఖాన్ గ్రామం వద్ద విప్లవ్ త్రిపాఠి తన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు కాన్వాయ్‌లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు. దీంతో కాన్వాయ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రవాదుల దాడిలో కల్పల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతిచెందారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్‌కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్) ఏడుగురి ప్రాణ త్యాగాల్ని మర్చిపోలేం: మోదీ మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై తీవ్రవాదులు దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొనడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏడుగురి ప్రాణ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని శనివారం ట్వీట్ చేశారు. అది పిరికిపంద చర్య: రాజ్‌నాథ్ సింగ్ మణిపూర్‌లో తీవ్రవాదుల దాడిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తీవ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఐదుగురు యోధులను దేశం కోల్పోయిందని అన్నారు. చదవండి: ‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’ ఏమిటీ పీఎల్ఏ? మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంస్థను 1978 సెప్టెంబర్ 25న ఎన్.బిశ్వేశ్వర్ సింగ్ ప్రారంభించారు. మణిపూర్‌కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్ఏ పనిచేస్తోంది. పీఎల్ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌లో పీఎల్ఏ భాగస్వామిగా చేరింది. -
కుటుంబానికొక్కరు సైన్యంలోకి
న్యూఢిల్లీ: భారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని డ్రాగన్ దేశం చైనా వినియోగించుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడమే లక్ష్యంగా టిబెట్ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ, చైనా సైన్యం) ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి టిబెట్‌లోని యువతకు పీఎల్ఏ వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘావర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్ బోధించడం, మిగతా అన్నిటి కంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్న అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో, కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తోంది. మొదటగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, పీఎల్ఏ పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం. రెండోది..లద్దాఖ్ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో పీఎల్ఏకు భద్రత విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైంది.. కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంట భారత్‌లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో ఎల్ఏసీ వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది పాంగాంగో సో సరస్సు దక్షిణం వైపు ఎల్ఏసీ వెంట పీఎల్ఏ చొచ్చుకు వచ్చే అవకాశాలున్నాయని అనుమానించిన భారత్ టిటెటన్లతో కూడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను మొఖపరి, బ్లాక్ టాప్, ఇతర కొండ ప్రాంతాల్లో ఆక్రమించి చైనాకు షాకిచ్చింది. అప్పటి ఈ పరిణామమే చైనాను టిబెటన్ యువత వైపు మొగ్గేలా చేసిందని భావిస్తున్నారు. నేడు భారత్–చైనా 12వ రౌండ్ చర్చలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈనెల 31వ తేదీన భారత్, చైనాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్, గోగ్రాల నుంచి సైనికబలగాల ఉపసంహరణలో కొంత పురోగతి సాధించడంపై రెండు వర్గాలు దృష్టి పెడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా భూభాగంలోని మోల్దో బోర్డర్ పాయింట్లో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య భారత్ భూభాగంలోని చుషుల్ వద్ద ఏప్రిల్ 9వ తేదీన 11వ విడత చర్చలు జరిగాయి. 11వ విడత చర్చల తర్వాత ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా లేకపో వడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. -
భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనాల మధ్య గత తొమ్మిది నెలలుగా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు నడిచాయి. తాజాగా సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది జూన్‌లో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య కొన్ని సార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నదని.. ఒకానొక సమయంలో ఇక యుద్ధ భేరి మోగించడమే తరువాయి అనే పరిస్థితులు తలెత్తాయి అని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ సందర్భంగా వైకే జోషి మాట్లాడుతూ.. ‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఎర్ర గీత గీశారు. దీని తర్వాత కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. డ్రాగన్ తోక జాడిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టవచ్చని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గతేడాది ఆగస్టు 29, 30న మన సైన్యం దక్షిణాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలను చైనా ఏ మాత్రం ఊహించలేకపోయింది.. సహించలేకపోయింది. దీనికి ప్రతీకారంగా కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పీఎల్ఏ దళాలు మనకు అతి సమీపంలోకి వచ్చాయి. పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదన్నట్లుగా ఉంది’’ అన్నారు. ‘‘ఇక ఇటువైపు మన ట్యాంక్ మ్యాన్, గన్నర్, రాకెట్ లాంచర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ట్రిగ్గర్ వదిలితే చాలు.. దీనికి ధైర్యంతో పని లేదు. ఇక్కడ అత్యంత కష్టమైన పని ఏంటంటే కాల్పులు జరగకుండా చూడటం.. రక్తం చిందకుండా.. ప్రాణాలు కోల్పోకుండా చూడటం. ఈ పరిస్థితి తలెత్తకుండా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మాకు స్పష్టంగా అర్థం అవుతుంది యుద్ధం చేసే సందర్భం వచ్చిందని. మన జవాన్లు చాలా నిబద్ధతతో వ్యవహరించారు. మొత్తానికి డ్రాగన్‌ను కట్టడి చేయగలిగాం. యుద్ధం తప్పించగలిగాం’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు’’ వైకే జోషి. 45 మంది చనిపోయి ఉండొచ్చు గల్వాన్ ఘర్షణ సందర్భంగా 45 మంది చైనా జవాన్లు మరణించారని ఓ రష్యన్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జోషి కూడా నేరుగా నంబర్ చెప్పకపోయినా.. అదే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. చైనా వైపు చనిపోయిన వాళ్ల గురించి మన ఆర్మీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. ‘‘గల్వాన్ ఘర్షణలో ఎంత మంది మరణించి ఉంటారనే దాని గురించి నేను ఎలాంటి అంచనా వేయను. కానీ ఆ ఘటన జరిగినప్పుడు మా వైపు ఆబ్జర్వేషన్ పోస్ట్‌లు ఉన్నాయి. చాలా మందిని స్ట్రెచర్లలో తీసుకెళ్లడం కనిపించింది. 60మందికి పైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అందరూ చనిపోయారా లేదా తెలియదు. రష్యన్ ఏజెన్సీ చెప్పినట్లు మరణించిన చైనా సైనికుల సంఖ్య 45 లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’’ అన్నారు జోషి. చైనాకు కార్గిల్ హీరో సలహా కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. తన కెరీర్లో చాలా వరకూ లద్ధాఖ్ శిఖరాల్లోనే గడిపారు. ఆయనకు చైనా భాష మాండరిన్ చాలా బాగా తెలుసు. ఇక గల్వాన్ ఘర్షణ వల్ల చైనాకు చెడ్డపేరు రావడం తప్ప వాళ్లు సాధించింది ఏమీ లేదన్నారు జోషి. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మాండరిన్ సామెతను గుర్తు చేసుకున్నారు. ‘‘దూరంగా ఉన్న బంధువు, దగ్గరగా ఉన్న పొరుగువారు ఎప్పటికీ సమానం కారు’’ అనే సామెత చెప్పారు. అంటే పొరుగు వాళ్లతో మంచి సంబంధాలు నెలకొల్పడం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధారపడటం సరికాదు అని దీని అర్థం అన్నారు జోషి. ఇదే సామెతను తాను చైనాకు చెబుతానని అన్నారు. ‘‘మేము(భారత్) వాళ్లతో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఇప్పుడు చైనాపైనే ఉంది’’ అని జోషి స్పష్టం చేశారు. చదవండి: మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం.. -
గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం..
మాస్కో: భారత్, చైనా దేశాల మధ్య తూర్పు లద్ధాక్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలో చైనాకే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని రష్యా న్యూస్ ఏజన్సీ టీఏఎస్ఎస్ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. 2020 జూన్ 15న ఎల్ఏసీ వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా, ఈ ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంట్లో ప్రస్తావించారు. -
బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న మిలటరీ పాయింట్స్‌లో బలగాల సంఖ్యను పెంచింది. ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఈ చర్యలకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘర్షణాత్మక ప్రదేశాలకు కొత్తగా బలగాలను పంపించరాదని గతేడాది సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో చైనానే ప్రతిపాదించడం గమనార్హం. తమ ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందాన్నే చైనా ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే బలగాల మోహరింపు కార్యక్రమాన్ని చైనా చేపట్టిందని వెల్లడించాయి. చైనా చర్యలను గమనించిన భారత్.. ముందు జాగ్రత్తగా పలు కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. దాంతో, ఇరుదేశాల సాయుధ దళాలు, యుద్ధ ట్యాంకులు మరింత దగ్గరగా మోహరించిన పరిస్థితి మరోసారి నెలకొంది. చైనాతో 9వ విడత చర్చలు భారత్, చైనాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు ఆదివారం జరిగా యి. దాదాపు రెండున్నర నెలల తరువాత జరిగిన 9వ విడత చర్చలు ఇవి. నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని పలు వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది భారత సైనికులు మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపు అంతే సంఖ్యలో సైనికులను సిద్ధంగా ఉంచింది. మరిన్ని దళాలను పంపించకూడదని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించ కూడదని, 6వ విడత చర్చల సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. -
పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు
న్యూఢిల్లీ: భారత్‌ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. గత జూన్‌లో భారత్‌కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా–చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ అమెరికన్ కాంగ్రెస్‌కి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించింది. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), భారత సైనికుల మ««ధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే, చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు. చైనా ఒక పథకం ప్రకారమే సరిహద్దుల్లో భారత్‌తో కయ్యానికి కాలు దువ్విందని ఆ నివేదిక స్పష్టం చేసింది. వారాల ముందు నుంచే... గల్వాన్ ఘర్షణలకు కొద్ది వారాల ముందే చైనా రక్షణ మంత్రి తమ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలకు దిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్.. అమెరికా, చైనా మధ్య జరిగే పోరులో భారత్ కల్పించుకుంటే చైనాతో ఆర్థిక, వాణిజ్య బంధాలు తెగిపోతాయని హెచ్చరించింది. ఘర్షణకు ముందే చైనా ఆర్మీకి చెందిన వెయ్యి మంది సైనికులు గల్వాన్ లోయను చుట్టుముట్టడం శాటిలైట్ ఇమేజ్‌లో కనిపించింది. భారీగా ఆయు«ధాల మోహరింపు దృశ్యాలు కూడా ఆ చిత్రాల్లో కనిపించాయని ఆ నివేదిక ప్రస్తావించింది. -
ప్రపంచస్థాయి శక్తిగా పీఎల్ఏ
బీజింగ్: పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అధినేత జిన్‌పింగ్ సంకల్పించారు. యుద్ధాల్లో నెగ్గడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, నిజమైన పోరాట పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పారు. జిన్‌పింగ్ తాజాగా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) సమావేశంలో మాట్లాడారు. 20 లక్షల మంది సైన్యం ఉన్న పీఎల్ఏ ఈ కమిషన్ ఆధ్వర్యంలోనే పని చేస్తుంది. సీఎంసీకి జిన్‌పింగ్ చైర్మన్. చైనా సైన్యాన్ని ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా మార్చాలని, ఇందుకోసం కొత్త తరహా శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఆధునిక యుద్ధ రీతులకు అనుగుణంగా సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. 6 నెలలుగా భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలన్న అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైన్యం బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా సైన్యానికి దీటుగా తమ సైన్యాన్ని పెంచుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల తీర్మానించింది. 2027 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. 2020లో సైన్యంపై 179 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు పార్టీ అంగీకరించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్. 732 బిలియన్ డాలర్లతో అమెరికా తొలిస్థానంలో ఉంది. షాంఘై సహకార సంఘం భేటీకి ప్రధాని లీ కెకియాంగ్ భారత్ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న 19వ షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ఈవో) సభ్య దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ సంఘం భేటీ 30న వర్చువల్‌గా జరగనుంది. కరోనా వైరస్‌పై పోరాటం విషయంలో పరస్పరం సహకరించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎస్సీవోలో రష్యా, భారత్, చైనా, పాకిస్తాన్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు. భారత్‌తో లోతైన చర్చలు: చైనా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై భారత్‌తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు, పరస్పరం సహకరించుకుంటున్నట్లు చైనా గురువారం వెల్లడించింది. ఈ ఏడాది మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైన్యం మధ్య భారీ ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాలు పదుల సంఖ్యలో సైనికులను కోల్పోయాయి. అప్పటి నుంచి ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. సరిహద్దులో ఇరు దేశాల భారీగా సైన్యాలనుమోహరించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకొని, ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. 8వ దఫా చర్చల తర్వాత సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉందని చైనా జాతీయ భద్రతా శాఖ తెలిపింది. సైన్యం ఉపసంహరణపై ఇండియాతో లోతైన చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. -
లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత సైన్యం స్పందించింది. ‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్ఏ కార్పొరల్ వాంగ్ య లాంగ్గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని షాంగ్జిఝెన్ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్ఏ నుంచి ఒక వినతి అందింది’అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది. ‘భారత్–చైనా సరిహద్దులు దాటి భారత్‌లోకి అతడు ఎలా రాగలిగాడనే విషయం రాబట్టేందుకు అధికారులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నాటికి అతడిని తిరిగి వెనక్కు పంపించే అవకాశాలున్నాయి’అని పేర్కొంది. భారత్, చైనాలు ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాయని, పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని చైనా అధికార గ్లోబల్ టైమ్స్ తెలిపింది. సరిహద్దుల్లో ఇది మరో వివాదానికి తెరతీయబోదనీ, ఈ అంశం పరిష్కారం మరిన్ని ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం చేస్తుందని వ్యాఖ్యానించింది. పీఎల్ఏలో కార్పొరల్ హోదా భారత ఆర్మీలో నాయక్ స్థాయికి సమానం. కాగా, తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంట ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చైనాలో భాగంగా జమ్మూకశ్మీర్! జమ్మూకశ్మీర్ చైనాలో భాగం అంటూ ట్విట్టర్ చూపడం వివాదాస్పదంగా మారింది. ఈ పొరపాటును వెంటనే సరిచేసినట్లు ట్విట్టర్ చెబుతున్నప్పటికీ జమ్మూకశ్మీర్‌ను భారత్‌కు చెందినట్లు చూపకపోవడం, లేహ్ ప్రాంతాన్ని కశ్మీర్లో అంతర్భాగంగా పేర్కొనడం కొనసాగు తోందని నిపుణులు అంటున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకుడు నితిన్ గోఖలే ఆదివారం లేహ్‌లోని హాల్ ఆఫ్ ఫేంను గురించి ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో లేహ్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందినట్లు, జమ్మూకశ్మీర్ చైనాలో ఉన్నట్లు చూపుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరిగిందని ట్విట్టర్ ఇండియా ప్రతినిధి చెప్పారు. -
ఆ ఐదుగురు చైనాలోనే ఉన్నారు
న్యూఢిల్లీ: గత వారం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ వైపు ఉన్నట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ధృవీకరించిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా పీఎల్ఏ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకులు వారి పక్షాన ఉన్నట్లు చైనా ధ్రువీకరించింది. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి’ అని ట్వీట్ చేశారు. (చదవండి: ఇప్పుడే చెప్పలేం) China's PLA has responded to the hotline message sent by Indian Army. They have confirmed that the missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover the persons to our authority is being worked out. — Kiren Rijiju (@KirenRijiju) September 8, 2020 అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబన్సిరి జిల్లా నుంచి శుక్రవారం తప్పిపోయిన ఐదుగురు పౌరులు భారత సైన్యానికి పోర్టర్లు, గైడ్లుగా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు అదృశ్యం కాగా వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు దీని గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘గ్రీన్‌లైన్’పై చైనా గురి
న్యూఢిల్లీ: గత నెలాఖరులో లద్దాఖ్‌లో చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ– పీఎల్ఏ) పెద్ద పన్నాగమే పన్నింది. లద్దాఖ్‌తో టిబెట్ సరిహద్దును చైనా ‘గ్రీన్‌లైన్’తో నిర్వచిస్తోంది. ఈ గ్రీన్‌లైన్ పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలోని ఫింగర్–4 పర్వత ప్రాంతం మీదుగా వెళుతూ... దక్షిణతీరంలోని చుషుల్ లోయ మొత్తాన్ని చైనా భూభాగంగా చూపిస్తుంది. 1960లో చైనా తయారుచేసిన మ్యాప్ ఇది. ఆగస్టు 29– 30 మధ్యరాత్రి వేళ పీఎల్ఏ దుస్సాహసానికి దిగింది. ఈ గ్రీన్‌లైన్ మేరకు భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా పెద్ద ఎత్తున బలగాలతో ముందుకు కదిలింది. వాస్తవా«ధీన∙రేఖ వద్ద ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నించింది. ‘పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని కీలకమైన అన్ని పర్వత ప్రాంతాలపై, చుషుల్‌లో మోహరించడం ద్వారా భారత స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ప్రత్యర్థి కదలికలకు చెక్ పెట్టింది. లేకపోతే మొత్తం చుషుల్ లోయను పీఎల్ఏ తమ స్వాధీనంలోకి తీసుకునేది. ఎలాగైనా గ్రీన్‌లైన్‌ను చేరుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆరోజు చైనా సైన్యం ముందుకు కదిలింది. భారీ ట్యాంకులు, భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్స్, భారీ తుపాకులను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి భారత సైన్యాన్ని వెనుకడుగు వేసేలా బెదరగొట్టాలని చూసింది. అయితే వెంటనే అప్రమత్తమైన భారత్... ఫింగర్–4పై, పాంగాంగ్ దక్షిణ తీరంలో తమ బలగాల మోహరింపులో మార్పులు చేర్పులు చేసింది. తదుపరి అడుగు వేయడానికి చైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేసింది. అలా డ్రాగన్ దురాక్రమణ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది’ అని భారత సైనిక ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రెండు చోట్ల ఎదురెదురుగా... ఒకవైపు శుక్రవారం రష్యాలో ఇరుదేశాల రక్షణశాఖ మంత్రుల సమావేశం జరిగినప్పటికీ... సరిహద్దుల్లో మాత్రం చైనా ఇంకా తన దుందుడుకు చర్యలను ఆపడం లేదు. చుషుల్ లోయలోని రెచిన్ లా ప్రాంతంలో, బంప్ అనే మరోచోట భారత్– చైనా సైన్యాలు ఎదురెదురుగా మోహరించాయి. సైనిక బలగాలను, ఆయుధ సామగ్రిని చైనా పెంచుతూనే ఉంది. బంప్‌కు అభిముఖంగా, వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న బ్లాక్‌టాప్ శిఖరంపై పీఎల్ఏ 150 మంది సైనికులను, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్ను మోహరించింది. -
మళ్లీ చైనా దుస్సాహసం
న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సరిహద్దుల్లో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. గల్వాన్ ఘటన అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మరోసారి రెచ్చగొట్టేందుకు పీఎల్ఏ చేసిన ప్రయత్నానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని కొనసాగిం చాలంటూ కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి పాంగోంగ్ సో సరస్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు చేరుకున్నాయి. పసిగట్టిన భారత సైన్యం వేగంగా స్పందించింది. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున బలగాలను తరలించి, వారి ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అయితే, ఎలాంటి భౌతిక పరమైన ఘర్షణలు చోటుచేసుకోలేదని కేంద్రం తెలిపింది. పాంగోంగ్ సో సరస్సు చుట్టుపక్కల అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచినట్లు వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, దౌత్యవర్గాల మధ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆగస్టు 29/30 రాత్రి పీఎల్ఏ బలగాలు యథాతథ స్థితిని మార్చేందుకు రెచ్చగొట్టేలా సైనిక కదలికలకు పాల్పడ్డాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘క్షేత్రస్థాయిలో యథాతథ పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ ప్రాంతంలోని కీలక పోస్టుల్లో బలగాలను సమీకరించడం సహా అన్ని చర్యలు చేపట్టింది’అని కల్నల్ ఆనంద్ తెలిపారు. ‘పాంగోంగ్ సో సరస్సు దక్షిణ ఒడ్డున పీఎల్ఏ కదలికలు కనిపించాయి. వెంటనే భారత ఆర్మీ ఆ ప్రాంతంలో బలగాల సంఖ్యను భారీగా పెంచింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ వ్యవహారంపై చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి’ అని కల్నల్ ఆనంద్ వివరించారు. ‘శాంతి, సామరస్యాలు కొనసాగేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉంది. అంతే స్థాయిలో, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు కృత నిశ్చయంతో ఉంది’ అని వివరించారు. ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి చైనా బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ సో దక్షిణం వైపునకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, తిష్టవేసేందుకు ప్రయత్నిం చాయి. పసిగట్టిన భారత బలగాలు వారిని నిలువరించేందుకు వెంటనే భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎలాంటి భౌతిక దాడులు చోటుచేసుకోలేదు’అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ సో సరస్సు ఉత్తర తీరం వైపు రెండు దేశాల బలగాలు గతంలో తలపడ్డాయి. కానీ, దక్షిణం వైపు ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని వెల్లడించాయి. ఈ పరిణామంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా ప్రయత్నాన్ని ఆర్మీ సీరియస్‌గా తీసుకుందనీ, పాంగోంగ్ సో ఉత్తర, దక్షిణ తీరం, చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లోకి బలగాలతో పాటు ఆయుధ సంపత్తిని తరలించింది. భారత్ గట్టిగా డిమాండ్ చేస్తున్న విధంగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కట్టుబడి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాగా, జూన్ 15వ తేదీన గల్వాన్ ఘటన తర్వాత చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి. ఉద్రిక్తతలను సడలించుకు నేందుకు ఇరు దేశాలు అంగీకరించినా పాంగోంగ్ సో, డెప్సాంగ్, మరో రెండు ఘర్షణాత్మక ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసుకుని ఉంది. దీంతో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని తరలించింది. మిరేజ్–2000, సుఖోయ్ 30 ఎంకేఐ వంటి ఫైటర్ జెట్లను ఎల్ఏసీ వెంట మోహరించింది. అతిక్రమించలేదు: చైనా చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఆ రేఖను వారెప్పుడూ అతిక్రమించలేదు. సరిహద్దుల్లో రెండు వైపుల సైన్యం క్షేత్ర స్థాయి అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాయి’ అని వివరించారు. ‘గతంలో అంగీకరిం చిన అంశాలను భారత్ ఉల్లంఘించింది. పాంగోంగ్ సో సరస్సు దక్షిణతీరంతో పాటు రెకిన్ పాస్‌ను ఆగస్టు 31వ తేదీన భారత్ బలగాలు అతిక్రమించాయి. తీవ్రమైన రెచ్చగొట్టే చర్య సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు కారణమైంది. చైనా సైన్యం ఇటువంటి వాటిని దీటుగా ఎదుర్కొంటుంది’ అంటూ పీఎల్ఏ పశ్చిమ కమాండ్ ప్రతినిధి కల్నల్ ఝాంగ్ షుయిలీ చేసిన ప్రకటనను అధికార జిన్హువా ప్రచురించింది. -
ఆగని డ్రాగన్ ఆగడాలు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం మళ్లీ బుసలు కొడుతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్‌లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్‌లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ సీనియర్ కమాండర్ చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని అధికారి చెప్పారు. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది. ఏమిటీ లిపులేఖ్ పాస్? హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది. ఐరాసకు నేపాల్ కొత్త మ్యాప్ భారత్ వ్యతిరేక ధోరణిని నేపాల్ మరింత తీవ్రతరం చేస్తోంది. మన దేశ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలను నేపాల్‌లో అంతర్భాగంగా చూపిస్తూ తయారు చేసిన మ్యాప్‌ను ఐక్యరాజ్య సమితికి. గూగుల్‌కి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతాలను తమ దేశ భాగంలో చూపించడానికి నేపాల్ రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే. నేపాల్ ఈ చర్యల వెనుక చైనా ఒత్తిడి ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. -
సరిహద్దుల్లో అన్ని ప్రొటోకాల్స్ పాటించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన కోసం సరిహద్దుల నిర్వహణలో పరస్పరం అంగీకరించిన ప్రొటోకాల్స్ అన్నీ పాటించి తీరాలని చైనాకి భారత్ మిలటరీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని గట్టిగా చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు 15 గంటల సేపు సుదీర్ఘంగా సాగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చెబుతున్న కొత్త సరిహద్దులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత సైనిక బృందం, మే 5కి ముందు నాటి పరిస్థితుల్నే కొనసాగించాలని, ఆ నిబంధనలకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని గట్టిగా చెప్పింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు నాలుగో దఫా కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి సాధించినట్టుగా చైనా వెల్లడించింది. రేపు లద్దాఖ్‌కు రాజ్‌నాథ్ వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేలా భారత్, చైనా పరస్పరం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌కు వెళ్లనున్నారు. సరిహద్దుల్లో పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. భారత సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ బుధవారం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. రూ.300 కోట్లతో అత్యవసరమైన కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఎన్ని ఆయుధాలు కొనాలన్న దానిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే, మొత్తం ఖర్చు మాత్రం రూ.300 కోట్లు దాటకూడదు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. -
శవ ‘సంస్కారం’ లేని చైనా!
వాషింగ్టన్: దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల మృతదేహాలకు గౌరవ ప్రదమైన అంతిమ కర్మలు చేసే సంస్కారమూ లేకపోయింది పొరుగుదేశం చైనాకు! గత నెల 15వ తేదీన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో కొంతమంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. భారత్ 20 మంది సైనికులను కోల్పోగా తమ సైనికులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న చైనా.. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని వారి అంతిమ సంస్కారానికి కూడా అంగీకరించడం లేదని, కుటుంబ సభ్యులపై ఒత్తిడి పెంచుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ మాత్రం తన వీరపుత్రులకు తగిన గౌరవ మర్యాదలిచ్చి వారి బలిదానాన్ని గుర్తించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. చైనా మాత్రం ఇప్పటివరకూ ఆ ఘటనలో ఎంత మంది చనిపోయారో కూడా బహిర్గతం చేయలేదు. పైగా శోకసంద్రంలో ఉన్న సైనికుల కుటుంబాలను ప్రభుత్వం అవమానాల పాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలంటున్నాయి. సంప్రదాయాల ప్రకారం నిర్వహించే అంతిమ సంస్కారాలను సైనికుల కుటుంబాలు మరచిపోవాలంటూ...కరోనాను సాకుగా చూపినట్లు తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. -
చైనా ముప్పును ఎదుర్కొందాం
వాషింగ్టన్: ఇండియా, మలేసియా, ఇండోనేíసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ సేనలను పంపించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. గురువారం జర్మన్ మార్షల్ ఫండ్‌కు చెందిన బ్రసెల్స్ ఫోరమ్–2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియాలో పలు దేశాలకు ముప్పుగా పరిణమించిన పీఎల్ఏకు దీటైన సమాధానం చెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి తాము సరైన రీతిలోనే స్పందిస్తామని వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరులను ఉపయోగిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకత్వంలో తమ వ్యూహం ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో తమ సైనిక బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి తరలించే తమ బలగాలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. ఇండియా, వియత్నాం, మలే సియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా సముద్రంలో తమ సేనల అవసరం ఉందన్నారు. మనమంతా కలిసికట్టుగా పని చేయాలి శత్రువు విసురుతున్న సవాళ్ల నుంచి మన స్వేచ్ఛాయుత సమాజాలను, మన శ్రేయస్సు, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు. అదంత సులభం కానప్పటికీ మన కృషిని కొనసాగించాలని అన్నారు. చైనా వల్ల ప్రయోజనాలు పొందుతున్న వ్యాపార వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ, నియంతృత్వం మధ్య ఎప్పుడూ రాజీ కుదరదని స్పష్టం చేశారు. చైనా ఇతర దేశాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మన భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ చైనా సముద్రంలో, ఇండియాతో సరిహద్దు విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు. చైనాపై ఇండియన్ అమెరికన్ల నిరసన తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులు తిష్టవేయడాన్ని నిరసిస్తూ షికాగోలోని చైనా కాన్సులేట్ వద్ద పలువురు ఇండియన్ అమెరికన్లు చైనా వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేపట్టారు. చైనా దుందుడుకు చర్యలపై తాము మౌనంగా ఉండబోమని వారు స్పష్టం చేశారు. అలా చేస్తే పర్యవసానాలు తీవ్రం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయవద్దు చైనాకు భారత్ హెచ్చరిక బీజింగ్: సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే పరిణామాలు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ చైనాను ఘాటుగా హెచ్చరించింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలగడమే కాకుండా, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లో కార్యకలాపాలను నిలిపేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలతో ఆ దేశంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా ఉండాలంటే.. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అత్యంతావశ్యకమన్న విషయం చైనా గుర్తించాలని మిస్త్రీ హితవు పలికారు. గల్వాన్ లోయ తమదేనని చైనా పదేపదే చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వాస్తవాధీన రేఖపై భారత్‌కు పూర్తిగా అవగాహన ఉందని, ఎల్ఏసీకి ఇటువైపు, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చాన్నాళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని గుర్తు చేశారు. జూన్ 15 నాటి ఘర్షణకు కారణం భారత సైనికులేనన్న చైనా వాదనను విక్రమ్ మిస్త్రీ తోసిపుచ్చారు. ‘ఏప్రిల్, మే నెలల్లో గల్వాన్ లోయలో చైనా కార్యకలాపాలు పెరిగాయి. భారత పెట్రోలింగ్‌ను పదేపదే అడ్డుకున్నారు. అందుకే ఘర్షణలు చోటు చేసుకున్నాయి’ అని స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ భేటీ న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ పరిస్థితిని, భారత సైన్యం సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. జూన్ 23, 24 తేదీల్లో జనరల్ నరవణె లద్దాఖ్‌లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్ కూడా 22 నుంచి 24 వరకు రష్యాలో పర్యటించి వచ్చారు. సరిహద్దుల రక్షణ బాధ్యత సర్కారుదే: సోనియా న్యూఢిల్లీ: భారత సరిహద్దులను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. లడ్దాఖ్ పరిస్థితుల విషయంలో దేశప్రజల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని లడ్దాఖ్లో ప్రాణత్యాగాలు చేసిన సైనిక అమరవీరుల స్మారకార్థం కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’కార్యక్రమంలో సోనియా వీడియో సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్టు భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని రాకపోతే, 20 మంది భారత సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని ప్రశ్నించారు. మన సైన్యానికి సంపూర్ణ సహకారాన్ని, శక్తిని అందించడమే నిజమైన దేశభక్తి అవుతుందని సోనియా అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని చెప్పడం పొరుగు దేశానికి మేలు చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన వీడియో సందేశంలో ఆయన..తూర్పు లడ్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఉపగ్రహ చిత్రాలు, రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. -
మళ్లీ చైనా కయ్యం?
న్యూఢిల్లీ: చైనా ఇంకో చోట మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతోందంటున్నారు మిలటరీ విశ్లేషకులు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికుల కదలికలను పరిశీలిస్తే దౌలత్ బేగ్ ఓల్డీ, డెప్సాంగ్ సెక్టార్లలో తాజాగా వివాదాలు లేవనెత్తే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దౌలత్ బేగ్ ఓల్డీకి తూర్పు ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చురుకుగా కదులుతోందని, ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు కావడమే కాకుండా.. వాహనాల కదలికలు కూడా ఎక్కువయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2016 ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం వద్దనే ఈ క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ నెలలో తీసిన కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కొత్త క్యాంపుల గురించి తెలియగా.. స్థానిక నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. చైనా కదలికలకు అనుగుణంగా భారత్ మే నెల చివరిలోనే డెప్సాంగ్ ప్రాంతానికి తన బలగాలను తరలించిందని సమాచారం. 2013లో చైనా ఇదే డెప్సాంగ్ ప్రాంతంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గల్వాన్‌లో బల ప్రదర్శన తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చైనా సైనికులు గల్వాన్ ప్రాంతంలోనే తిష్టవేయగా.. భారత్ తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. జూన్ 15న ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం మేకులతో కూడిన గదలు, కర్రలతో చైనా సైనికులు జరిపిన దాడిలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందడం తెలిసిన విషయమే. ఈ ఘటన తరువాత ఇరు పక్షాలు అక్కడికి మరిన్ని బలగాలను తరలించి బలప్రదర్శనకు దిగాయి. (వేగంగా బలగాలు వెనక్కి) తాజాగా బుధవారం లేహ్‌లోని ఓ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన భారత యుద్ధ విమానాలు 240 కి.మీ.ల దూరంలోని సరిహద్దుల వరకూ ప్రయాణించాయి. రోడ్డుమార్గంలో చెక్పాయింట్లు ఏర్పాటు కావడమే కాకుండా లేహ్‌లో మిలటరీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు సమాచారం. లేహ్ రహదారులపై మిలటరీ వాహనాలు క్యూలు కట్టాయని స్థానికులు తెలపగా.. భారత సైనికులు ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నారని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్, చైనాలు రెండింటికీ సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలు మనుపెన్నడూ లేనంత స్థాయిలో చోటు చసుకోవడంలో స్థానికుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. గల్వాన్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదని, అదే సమయంలో చైనా ఆక్రమించినట్టుగా చెబుతున్న భూభాగాన్ని భారత్ మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తక్కువేనని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన హర్‡్ష పంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 22 నాటి ఉపగ్రహచిత్రం -
సరిహద్దు వివాదం : డ్రాగన్ కుయుక్తి
బీజింగ్ : లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో భారత్-చైనాలు ముఖాముఖి తలపడిన అనంతరం డ్రాగన్ ఆర్మీ అధికారికంగా స్పందించింది. ఘర్షణలకు భారత్‌ను నిందిస్తూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కుయుక్తులకు దిగింది. భారత్ ఉద్దేశపూర్వకంగా కవ్వింపు దాడులకు పాల్పడిందని పేర్కొంది. గాల్వన్ లోయ ప్రాంతంపై సార్వభౌమాధికారం చైనాకే ఉందని చైనా సైనిక ప్రతినిధి కల్నల్ జాంగ్ సులిల్ వ్యాఖ్యానించారు. భారత్ కవ్వింపు చర్యలను పక్కనపెట్టి చైనాతో చర్చల్లో పాలుపంచుకుని సంప్రదింపుల ద్వారా వివాదాల పరిష్కారానికి మొగ్గుచూపాలని కల్నల్ సులిల్ పేర్కొన్నారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఆయన తన వాదనకు ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. సరిహద్దు ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ఎందరు మరణించారనే వివరాలనూ వెల్లడించలేదు. కాగా గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ సైనికాధికారితో పాటు ఇద్దరు జవాన్లు మరణించారని భారత్ పేర్కొంది. చదవండి : చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి -
చైనా ఆర్మీ చేతికి అత్యాధునిక ఆయుధాలు!
బీజింగ్: పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) 75వ గ్రూపులో అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరినట్లు చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దేశ వాయువ్య సరిహద్దులో అత్యంత అధునాతన పీసీఎల్-181 ఫిరంగి వాహనాలతో సైన్యం పరేడ్ నిర్వహించిందని.. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. వాయువ్య చైనాలోని ఎడారి ప్రాంతంలో నంజియాంగ్ హావోజియావో(హార్న్ ఆఫ్ సౌత్ బోర్డర్)లో ఆయుధాల ప్రారంభోత్సవ వేడుక నిర్వహించిందని వెల్లడించింది. ఈ మేరకు సైన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది. కాగా డోక్లాం విషయంలో భారత్- చైనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో ఇటువంటి ఆయుధాలను పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు తరలించిన విషయం విదితమే. (చైనాతో తొలగుతున్న ఉద్రిక్తతలు) ఇక తాజాగా తూర్పు లడఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వీటిని 75వ గ్రూపునకు అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. దౌత్య, మిలిటరీ ఉన్నత స్థాయి చర్చల నేపథ్యంలో సైన్యం ఉపసంహరణ విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో భారత్- చైనా బలగాలు సమస్యాత్మక ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా.. గతేడాది అక్టోబరు 1న నేషనల్ మిలిటరీ డే పరేడ్‌లో 155 మిల్లీమీటర్ కాలిబర్ వీల్ కలిగిన హవీజర్ వాహనాలను చైనా సైన్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. కేవలం 25 టన్నుల బరువు కలిగిన ఈ తేలికపాటి ఆయుధాల్లో డిజిటల్ కంట్రోల్ ప్యానెల్స్ ఉంటాయి. ఒక్కసారి బటన్ నొక్కితే చాలు లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపిస్తాయి.(‘వాస్తవాధీన రేఖ’లో సామరస్యం) -
భారత గగనతలంలోకి చైనా హెల్లికాప్టర్లు!
న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి రెండు చైనా ఆర్మీ హెలికాప్టర్లు దూసుకువచ్చాయని ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు లఢఖ్‌లోకి చైనా హెలికాప్టర్లు ప్రవేశించడంతో ఇందుకు స్పందనగా భారత వైమానిక దళం సుఖోయ్ జైట్లను గగనతలంలోకి పంపిందని మంగళవారం తెలిపారు. మే 5 మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. అయితే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగానే ఈ విధంగా జరిగిందని.. నిబంధనల ఉల్లంఘన జరుగలేదని స్పష్టం చేశారు. కాగా ఈ పరిణామాల అనంతరం ఇటీవల తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద భారత్- చైనా దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే .(ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత) ఈ ఘటనలో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నట్లు వెల్లడించారు. తాజాగా భారత గగనతలంలోకి చైనా ఆర్మీ హెలికాప్టర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
లధాఖ్‌లో భారత్-చైనా సైనికుల ఘర్షణ
న్యూఢిల్లీ: లధాఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో భారత్, చైనా సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. లధాఖ్‌లోని ఉత్తర ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో బుధవారం ఉదయం ఇరుదేశాల సైనికులు పరస్పరం బాహాబాహికి దిగారు. అయితే, ఇరుదేశాల సైన్యం తరఫున ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరగడంతో ఇక్కడ ఉద్రిక్తత సమసిపోయింది. చర్చల అనంతరం అక్కడ యథాతథ స్థితి కొనసాగుతోంది. 134 కిలోమీటర్ల ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద భారత సైన్యం బుధవారం ఉదయం గస్తీ నిర్వహిస్తుండగా.. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) జవాన్లు అక్కడికి వచ్చి.. ముఖాముఖి తలపడ్డారు. సరస్సు వద్ద భారత సైన్యం గస్తీ నిర్వహించడంపై పీఎల్ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబేట్, లధాఖ్ మధ్య ఉన్న ప్యాంగాంగ్ సరస్సులో మూడొంతుల భాగం చైనా అధీనంలో ఉంది. పీఎల్ఏ అభ్యంతరంతో ఇరుదేశాల సైనికుల మధ్య గొడవ ప్రారంభమయింది. బుధవారం ఉదయం నుంచి రోజంతా ఇరుదేశాల సైనికులు పరస్పరం తలపడుతూ.. తోపులాటకు దిగారు. సాయంత్రానికి ఇరుదేశాల సైన్యాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. అయితే, సాయంత్రానికి ప్రోటోకాల్ ప్రకారం బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరపడంతో ఈ ఉద్రికతలకు తెరపడింది. గతంలో 2017లోనూ ఇక్కడ భారత్-చైనా సైన్యాలు తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం సైనికులు కొట్టుకున్నారు. -
భారత్‌కు చైనా వార్నింగ్
బీజింగ్, చైనా : డొక్లాం సమస్య నుంచి భారత్ పాఠాలు నేర్వాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) గురువారం హెచ్చరించింది. లేకపోతే భవిష్యత్‌లో డొక్లాం లాంటి సమస్యలు మరిన్ని చోటు చేసుకుంటాయని పేర్కొంది. గురువారం చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై కామెంట్లు చేశారు. ఓ మీడియా ప్రతినిధి డొక్లాం సమస్యపై భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కామెంట్ల గురించి క్వియన్ వద్ద ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన భారత్ డొక్లాం సమస్య నుంచి పాఠాలు నేర్చుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. లేకపోతే ఇలాంటి పరిస్థితులు(డొక్లాంలో భారతే అక్రమంగా ప్రవేశించిందని ఉద్దేశంతో) భవిష్యత్‌లో మరిన్ని తలెత్తుతాయని హెచ్చరించారు. -
డోక్లాం వద్ద మళ్లీ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం వద్ద మళ్లీ చైనా బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1600 నుంచి 1800 మందితో కూడిన చైనీయ సైన్యం అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసింది. గడ్డ కట్టే చలిలో రెండు హెలిప్యాడ్లు, గుడిసెలు, స్టోర్లు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక డొక్లాం దక్షిణ ప్రాంతమైన ఝంపేరి రిడ్జ్ దగ్గర చైనా ఆర్మీ మోహరించిందని భారత సైన్యం కూడా ధృవీకరించింది. ఈ విషయంపై చైనా తన వాదనను వినిపించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైన్యం) ప్రతీ ఏటా వేసవి, శీతాకాలాల్లో ఇక్కడ క్యాంపులు నిర్వహించటం సహజం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత క్యాంపును ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కానీ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న భారత సైన్యం మాత్రం అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది. కాగా, సిక్కిం-భూటాన్-టిబెట్ ట్రై జంక్షన్ అయిన డోక్లాం వద్ద 73 రోజులపాటు భారత్-చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారీ ఆయుధాల తరలింపు.. ఎదురుపడినప్పుడల్లా, కవ్వింపు చర్యలకు పాల్పడిన చైనా, భారత్ సైనికుల దృశ్యాలు అప్పట్లో కంగారు పుట్టించాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
భారత్ మా మాటలను లెక్కచేయడం లేదు: చైనా
బీజింగ్: డొక్లాం పీఠభూమిపై తమ వాదనను భారత్ లెక్కచేయడం లేదని మంగళవారం చైనా విస్మయం వ్యక్తం చేసింది. పద్దతి మార్చుకోకపోతే భారత్‌లోకి మేం ప్రవేశించాల్సివుంటుందని హెచ్చరించింది. అప్పుడు చేయడానికి ఇంకేమీ మిగలదని గత కొన్ని వారాలుగా పాడుతున్న పాటనే మరలా వినిపించింది. గొంతు సవరించుకుని చైనా ఎన్నిమార్లు హెచ్చరికలు చేసిన భారత్ బెదరడం లేదు. సోమవారం త్వరలో డొక్లాం సమస్యకు శుభం కార్డు వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దేశాలు(చైనా, భారత్, భూటాన్) కలసి చర్చించుకున్న అనంతరమే డొక్లాంపై ఓ నిర్ణయానికి రావాలని భారత్ చైనాను అభ్యర్థించింది కూడా. భూటాన్ డొక్లాం తమ భూభాగంలోనిదని చెబుతుండగా.. చైనా డొక్లాం తమదని అంటోంది. మంగళవారం చైనా విదేశాంగ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా రోడ్డు నిర్మాణం చేస్తున్న ప్రదేశంలోకి భారత్ చొరబాటు చేసిందని వ్యాఖ్యానించింది. అందుకు భారత్ చెబుతున్న కారణాలు చైనాను విస్మయానికి గురి చేశాయని పేర్కొంది. భారత్ లాజిక్ సరిగా లేదని, అదే లాజిక్‌తో ప్రతి ఒక్కరూ పొరుగు దేశంలోకి చొరబాటు చేయొచ్చని వ్యాఖ్యానించింది. భారత్.. చైనా సరిహద్దులో భారీ నిర్మాణాలు చేపడితే.. అభద్రతా భావంతో తాము భారత్‌లోకి చొరబాటు చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది. -
అవునా.. మా వాళ్లు భారత్‌లోకి వచ్చారా!: చైనా
షాంఘై: లడఖ్‌లో తమ దేశ సైనికులు భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన విషయం తమకు తెలియదని చైనా పేర్కొంది. భారత స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన సైనికులు లడఖ్‌లోని పన్గాంగ్ సరస్సు వద్ద చొరబాటుకు యత్నించగా భారత సైనికులు వారిని అడ్డుకున్నట్లు రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. పన్గాంగ్ సరస్సు వద్ద చొరబాటుకు యత్నించడంతో పాటు అడ్డుకున్న భారత జవానులపై పీఎల్ఏ సైనికులు రాళ్లు రువ్వినట్లు భారత్ ఆరోపించింది. దాంతో భారత సైనికులు కూడా చైనా జవానులకు దీటుగా బదులివ్వాల్సివచ్చిందని వెల్లడించింది. ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన గొడవలో కొందరికి చిన్నపాటి గాయాలైనట్లు పేర్కొంది. కాగా, ఈ విషయంపై చైనా తొలుత మౌనం వహించి, ఇప్పుడు తాపీగా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యుంగ్.. తనకు ఈ విషయం గురించి అసలు సమాచారమే లేదని పేర్కొన్నారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద పీఎల్ఏ సైనికులు నిరంతరం పహారా కాస్తారని చెప్పారు. చైనా-భారత్ సరిహద్దులో శాంతిభద్రతలకు చైనా కట్టుబడి ఉందని తెలిపారు. భారత్ తరఫు సైన్యం ఎల్ఏసీ నిబంధనలను పాటించాలని సూచించారు. -
పాక్-చైనా అనుబంధం సాటిలేనిది: పాక్ ఆర్మీ ఛీఫ్
ఇస్లామాబాద్: పాక్ - చైనా అనుబంధంపై ఇరు దేశాలు ఆడుతున్న దాగుడు మూతలాట బయట పడింది. సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఖమర్ జావీద్ బజ్వా తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. తమ అనుబంధానికి ప్రపంచంలో సాటిలేదని పాక్ ఆర్మీ ఛీఫ్ చెప్పుకురావడం విశేషం. పాకిస్తాన్, ఇస్లామాబాద్‌లోని చైనా దౌత్యకార్యాలయంలో మంగళవారం జరిగిన చైనా 90వ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జావీద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డోక్లాం వద్ద భారత్- చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితు మధ్య ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈసందర్భంగా పాక్ ఆర్మీ ఛీఫ్ మాట్లాడుతూ పాక్ చైనాల మధ్య అనుబంధానికి సమానమైనది ప్రపంచంలో ఏదీ లేదన్నారు. భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైన చైనాను తన సోదర దేశంగా అభివర్ణించారు. ఈసందర్భంగా చైనా అంబాసిడర్‌గా పనిచేస్తున్న ఆసిఫ్ గఫూర్ రెండు దేశాల మధ్య పరస్పర సైనిక సహకారం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మూల స్తంభం అని సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్టు చేశారు. వీటన్నింటినీ పాకిస్తాన్ మీడియా ప్రముఖంగా పేర్కొన్నాయి. -
శత్రువులందరినీ ఓడిస్తాం: జిన్‌పింగ్ వార్నింగ్
మా సైన్యానికి ఆ సామర్థ్యముంది బీజింగ్: దురాక్రమణకు దిగే శత్రువులందరినీ ఒడించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు ఉందని చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్ అన్నారు. 23 లక్షల సైనికబలం కలిగిన పీఎల్ఏ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ మిలిటరీ పరేడ్‌ను తిలకించిన జిన్‌పింగ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. సర్వోన్నత నాయకత్వమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)కు అనుగుణంగా పీఎల్ఏ కచ్చితంగా నడుచుకోవాలని, పార్టీ ఏది సూచిస్తే అది చేయాలని అన్నారు. 'దురాక్రమణకు దిగే శత్రువులందరినీ ఓడించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం మన సాహసోపేతమైన మిలిటరీకి ఉందని నేను బలంగా విశ్వసిస్తున్నాను' అని జింన్‌పింగ్ పేర్కొన్నారు. సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య నెలరోజులకుపైగా సాగుతున్న ప్రతిష్టంభన గురించి ఆయన నేరుగా ప్రస్తావించలేదు. అయితే, చైనా అధికారిక మీడియా, విదేశాంగ, రక్షణశాఖలను ఉటంకిస్తూ భారత్ చైనా భూభాగంలోకి చొరబడిందని పేర్కొంటూ.. యుద్ధ బెదిరింపు కథనాలను ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం చైనా సైన్యానికి ఉందని ఆయన అన్నారు. -
పదాతిదళాన్ని కుదించనున్న చైనా
♦ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను బలోపేతం చేసేందుకే... ♦ ఇప్పటిదాకా పదాతిదళం సంఖ్య 23 లక్షలు ♦ పది లక్షలకే పరిమితం చేయనున్న డ్రాగన్ ♦ గతంలో పదాతిదళ యుద్ధంపైనే దృష్టి ♦ తాజా పరిస్థితుల నేపథ్యంలో సైనిక బలగాల పునర్వ్యవస్థీకరణ బీజింగ్: ప్రపంచంలోనే భారీసంఖ్యలో సైనిక బలగాలను కలిగిన చైనా తన పదాతి దళాన్ని కుదించనుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో మొత్తం సిబ్బంది సంఖ్య 23 లక్షలు కాగా ఇప్పుడు దీనిని పది లక్షల మేర తగ్గించనుంది. చరిత్రలోనే ఇది అతిపెద్ద తగ్గింపుకానుంది. నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దిశగా అడుగులు వేయనుంది. ఈ విషయాన్ని చైనా అధికార మీడియా బుధవారం వెల్లడించింది. పీఎల్ఏను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగా సైన్యంతోపాటు ఇతర బలగాలను సమం చేయనుంది. ఈ విషయాన్ని చైనా సైనిక విభాగం అధికార మీడియా అయిన పీఎల్ఏ డైలీ వెల్లడించింది. నౌకాదళం, క్షిపణి బలగాలసహా ఇతర విభాగలలో సిబ్బందిని పెంచనుంది. పురాతన సైనిక వ్యవస్థలో పెద్దసంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిని ఇతర విభాగాలను బదలాయిస్తామని తెలిపింది. ‘వ్యూహాత్మక లక్ష్యాలు, భద్రతా అవసరాలను బట్టి సంస్కరణలు చేపడతామని తెలిపింది. కాగా పీఎల్ఏ గతంలో పదాతిదళ యుద్ధంతోపాటు దేశ అంతర్గత భద్రతావసరాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఈ విధానంలో ప్రాథమిక మార్పులు తీసుకురానుంది. క్రియాశీలక పీఎల్ఏ సైనిక బలగాల సంఖ్యను పదిలక్షలకు కుదించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. పీఎల్ఏ వైమానిక దళం సిబ్బందిని మాత్రం అలాగే ఉంచనుంది. తాజా ప్రతిపాదనతో నౌకాదళం, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ టైమ్స్ పత్రిక మంగళవారం రాసిన కథనంలో పేర్కొంది. భద్రత దృష్ట్యా చైనా ప్రాథమ్యాలు, అవసరాలు మారిపోయాయని, అంతర్జాతీయస్థాయిలో విస్తరించాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సైనిక విభాగం సలహాదారు జూ గౌన్గ్యు చెప్పారు. చైనా అంతర్జాతీయ హోదాకు తగ్గట్టుగా పీఎల్ఏని పునర్వ్యవస్థీకరిస్తామని ఆయన వివరించారు. కశ్మీర్ అంశంలో వేలుపెడతాం బీజింగ్: సిక్కిం సరిహద్దులోని డోక్లాంను దురాక్రమించడానికి యత్నిస్తున్నా చైనా తాజాగా భారత్‌ను మరోసారి రెచ్చగొట్టిం ది. కశ్మీర్లో పరిస్థితి చేయి దాటినందున అంతర్జాతీయ జోక్యం అనివార్యమని స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వద్ద పరి స్థితులు విషమించాయని, హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతంలో సుస్థిరత దెబ్బతింటుందని పేర్కొంది. భారత్, పాక్ సంబంధాలను బలోపేతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ బుధవారం చెప్పారు. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఇందులో మూడోపక్షం జోక్యానికి తావే లేదని భారత్ మొదటి నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే డ్రాగన్ ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, భూటాన్ తరఫున డోక్లామ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఇండియా ఎలా పోరాడుతున్నదో కశ్మీర్ అంశానికీ అదే వర్తిస్తుందని ఆ దేశ నిపుణుడు ఒకరు ఇటీవల హెచ్చరించారు. డోక్లామ్ భారత్ భూభాగం కాదన్నారు. ఒకవేళ పాకిస్థాన్ కోరితే తమ సైన్యం కశ్మీర్లో అడుగుపెడుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో చైనా వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ డైరెక్టర్ లాంగ్ జింగ్‌చున్ హెచ్చరించారు. -
సుసంపన్నం... ఈ చిత్ర చరితం!
నోరు మంచిదైతే ‘ఊరు’ పేదదైతేనేం? ప్రపంచ ప్రసిద్ధ చైనీస్ ఆర్టిస్ట్ హువాంగ్ జో విషయంలో అలాగే జరిగింది. హెమి ప్రావిన్స్‌లోని ఒక పేద పల్లెలో పుట్టాడు. నలుగురితో మంచిగా మాట్లాడడం మాత్రమే తెలిసిన ‘జో’ పెద్దల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు. అందులో కళాసంస్కృతులకు సంబంధించిన విషయాలు చాలా ఎక్కువ. అందుకే ఆయనకు తన ఊరు ఎప్పుడూ పేదగా కనబడలేదు. సంస్కృతి, కళలతో అది సంపన్నంగా ఉన్నట్లు తోచేది. ఆర్టిస్ట్ హన్ లెరన్ నుంచి సంప్రదాయ చైనీస్ చిత్రకళను నేర్చుకున్నాడు జో. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పనిచేసిన ‘జో’ ఆ కాలం నాటి జీవితాలను రికార్డ్ చేశాడు. వెస్ట్రన్ స్కెచింగ్ స్కిల్స్‌ను సంప్రదాయ చైనీస్ చిత్రకళతో కలిపాడు. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. చైనా సమాజంలోని సామాన్యుడి జీవితంలోని అనేకానేక ఘట్టాలను, ఆకర్షణీయ దృశ్యాలను ఈ పెయింటింగ్స్ అద్దం పడతాయి. ప్రకృతికి, మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఆ చిత్రాలు కవితాత్మకంగా వర్ణిస్తున్నట్లుగా ఉంటాయి. చిత్రకళ అంటే ‘జో’కు ఎంత ఇష్టమంటే ఏ ఒక్కరోజూ ఆయన పెయింటింగ్ చేయకుండా ఉండలేదు. తీవ్ర అనారోగ్యంగా ఉన్న కాలంలో కూడా ఏదో ఒక బొమ్మ వేస్తూనే ఉండేవాడు. ప్రాక్టీస్ స్కెచ్‌లతో ఆయన దగ్గర ఉండే సంచి ఎప్పుడూ నిండిపోయి ఉండేది. ‘‘చరిత్ర మీద పట్టు ఉండడం కూడా ఆయన చిత్రాలు విజయవంతం కావడానికి ఒక కారణం’’ అంటాడు ‘సగం శిష్యుడు సగం స్నేహితుడు’ అనే పేరు ఉన్న జోంగ్సియాంగ్. కేవలం చిత్రాలు వేయడమే కాకుండా ప్రాచీన కళాకృతులను సేకరించడంతోపాటు కళాసంఘాల నిర్మాణానికి కూడా తన వంతు ప్రయత్నం చేసిన ‘జో’ పాత చైనా, కొత్త చైనాలకు ఒక సాక్షిలా నిలిచాడు. ప్రస్తుతం ‘జో’ గీసిన కొన్ని చిత్రాల వేలం బీజింగ్‌లో జరుగుతోంది. -
చైనా చెరలో ఐదుగురు భారతీయులు
చైనా మరోసారి బరితెగించింది. ఈసారి ఏకంగా ఐదుగురు భారతీయులను నిర్బంధంలోకి తీసుకుంది. లడఖ్ ప్రాంతంలోని చుమర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పైపెచ్చు, వాళ్లు భారత భూభాగంలోకి చొరబడి మరీ మనవాళ్లను పట్టుకుపోవడం గమనార్హం. వాస్తవాధీన రేఖ పరిధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. అయితే, ఈ విషయంలో సైన్యం వెంటనే కలగజేసుకోవడంతో ఐదుగురినీ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు భారతీయ సైనికులకు అప్పగించాయి. పశువులను మేపుకొంటున్న ఐదుగురు భారతీయులను పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోకి కొన్ని కిలోమీటర్లు లోపలకు వచ్చి మరీ తీసుకెళ్లాయి. ఆ ప్రాంతంపై తమ పట్టు ఉందని చూపించుకోడానికే వాళ్లలా చేసి ఉంటారని అంటున్నారు. అయితే ఈ సంఘటనను సామరస్యపూర్వంగా పరిష్కరించుకున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆకాశంలోకి దూసుకెళ్లిన చైనా 'లిజియన్'
చైనా మానవ రహిత యుద్ద విమానం 'లిజియన్'ను అభివృద్ధి చేసింది. ఆ లిజియన్ను గురువారం ఇక్కడ విజయవంతంగా ప్రయోగించింది. లిజియన్ అంటే చైనీయుల భాషలో పదునైన కత్తి అని అర్థం.దాంతో లిజియన్ ఆకాశంలో కత్తిలా దూసుకుపోయింది. దీంతో మానవరహిత యుద్దవిమానాన్ని ఆసియా ఖండంలో తయారు చేసిన మొట్టమొదటి దేశం చైనాగా ఖ్యాతిగాంచింది. చైనా తూర్పు, పశ్చిమ ప్రాంతంలోని సముద్రంలో జరగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లిజియన్ ఉపకరిస్తుందని, అలాగే చైనాకు పొరుగుదేశాల మధ్య నెలకొన్న ప్రాదేశిక సరిహద్దు వివాదాలపై బీజింగ్ నాయకులకు లిజియన్ ఒక చక్కటి సాధనమని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెందిన మాజీ జనరల్ వెల్లడించారని హాంకాంగ్‌కు చెందిన వార్తా పత్రిక వెల్లడించింది. చైనా దేశంలోని అధునిక సైనిక అద్బుత పాటవానికి లిజియన్ ప్రతీక అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మేజర్ జనరల్ ఝు గుంగ్యు వెల్లడించారు. అభివృద్ధితో ముందుకు దూసుకువెళ్తున్న దేశాల అధునిక విజ్ఞానాన్ని చైనా అందిపుచ్చుకుందనటానికి ఉదాహరణ లిజియన్ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మానవ రహిత యద్ధ విమానాలు యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రూపొందించాయని ఆయన గుర్తు చేశారు. లిజియన్ యూఎస్ మిలటరీలోని ఎక్స్-78బి ద్రోణ్‌ను పోలి ఉంటుందని తెలిపారు. -
ఆ యువకులకు... గ్యాంగ్‌రేప్‌తో సంబంధం లేదు!
బీజింగ్‌లోని హోటల్లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనతో ప్రముఖ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన మేజర్ జనరల్ జెన్లీ షౌజియాంగ్ కుమారుడు లీ తియానికి ఎటువంటి సంబంధం లేదని డిపెన్స్ న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలిపారు. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన శిక్ష పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ శిక్షను వెంటనే రద్దు చేయాలని డిఫెన్స్ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. సామూహిక అత్యాచార కేసులో శిక్ష పడిన ఇద్దరు యువకులు అమాయకులని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బీజింగ్‌లో నెంబర్1 ఇంటర్మీడియట్ కోర్టులో సామూహిక అత్యాచార కేసుపై మంగళవారం రెండవ సారి విచారణ జరిగింది. ఈ సందర్బంగా లీ తియానిక తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను పైవిధంగా వినిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధాని బీజింగ్‌లోని ప్రముఖ హోటల్లో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన చైనాను అతలాకుతలం చేశాయి. ఆ దుశ్చర్యకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి, శిక్ష విధించాలని చైనీయులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు. ఆ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో షౌజియాంగ్ కుమారుడు లి తియాని, మరో యువకుడు నిందితులని పోలీసులు నిర్ధారించారు. ఆ క్రమంలో సెప్టెంబర్ 26న బీజింగ్ హైడియన్ జిల్లా కోర్టు లి తియానికి 10 ఏళ్ల, మరో యువకుడికి 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దాంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ఎగువ కోర్టును ఆశ్రయించారు. అయితే చైనా ఆర్మీ అనుబంధ సంస్థ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌లో లి తియాని తండ్రి షౌజియాంగ్ ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.