
తరోన్ ఆచూకీ తెలుసుకోవడంలో సాయపడాలని ఇండియన్ ఆర్మీ పీఎల్‌ఏను కోరింది. ఈ నేపథ్యంలో తమకు బాలుడు..
న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో అదృశ్యమైన మిరమ్ తరోన్ ఆచూకీ లభించింది. తమ భూభాగంలో ఒక భారతీయ బాలుడు దొరికాడని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం త్వరలో అతన్ని భారతీయ ఆర్మీకి అప్పగిస్తామని తెలిపింది. సదరు దొరికిన బాలుడి వివరాలను చైనా ఆర్మీ వెల్లడించలేదు.
కానీ అతను మిరమ్ తరోన్ అని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. జనవరి 18న తరోన్ చైనా భూభాగంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో తరోన్ ఆచూకీ తెలుసుకోవడంలో సాయపడాలని ఇండియన్ ఆర్మీ పీఎల్‌ఏను కోరింది. ఈ నేపథ్యంలో తమకు బాలుడు దొరికాడని, ప్రొటోకాల్స్ పూర్తయ్యాక భారత్‌కు అప్పగిస్తామని చైనా ఆర్మీ ప్రకటించింది. తరోన్ అదృశ్యంపై తొలుత బీజేపీ ఎంపీ తాపిర్ గావో స్పందించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
(చదవండి: పట్టుబడితే.. పది లక్షల బాండు ఇవ్వాల్సిందే..)