
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
బీజింగ్, చైనా : డొక్లాం సమస్య నుంచి భారత్ పాఠాలు నేర్వాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) గురువారం హెచ్చరించింది. లేకపోతే భవిష్యత్‌లో డొక్లాం లాంటి సమస్యలు మరిన్ని చోటు చేసుకుంటాయని పేర్కొంది.
గురువారం చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై కామెంట్లు చేశారు. ఓ మీడియా ప్రతినిధి డొక్లాం సమస్యపై భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కామెంట్ల గురించి క్వియన్ వద్ద ప్రస్తావించారు.
ఇందుకు స్పందించిన భారత్ డొక్లాం సమస్య నుంచి పాఠాలు నేర్చుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. లేకపోతే ఇలాంటి పరిస్థితులు(డొక్లాంలో భారతే అక్రమంగా ప్రవేశించిందని ఉద్దేశంతో) భవిష్యత్‌లో మరిన్ని తలెత్తుతాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment